/rtv/media/media_files/2026/03/04/iran-key-strategies-in-war-against-us-and-israel-2026-03-04-13-53-39.jpg)
Iran key Strategies in War against US and Israel
మిడిల్‌ఈస్ట్‌లో ముదురుతున్న ఉద్రిక్త పరిస్థితులు ఇరాన్ యుద్ధ వ్యూహాన్ని మార్చేశాయి. అమెరికా సైనిక శక్తిని నేరుగా ఎదుర్కోవడం కన్నా అధ్యక్షుడు ట్రంప్ బలహీనతలను దెబ్బతీయడమే లక్ష్యంగా అడుగులు వేస్తోంది. గల్ఫ్ దేశాల్లో అమెరికా సైనిక స్థావరాలతో సహా ట్రంప్ కుటుంబానికి చెందిన వ్యాపార సముదాయాలను, అలాగే చమురు, గ్యాస్ కేంద్రాలపై ఇరాన్ డ్రోన్లతో దాడులు చేస్తోంది. ఇంతకీ ఈ యుద్ధంలో ఇరాన్ వ్యూహాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం.
ట్రంప్ కుటుంబ వ్యాపారాలే లక్ష్యంగా
దుబాయ్, ఒమన్, సౌదీ అరేబియాలోని ట్రంప్ ఇంటర్నేషనల్ గోల్ఫ్ క్లబ్స్, విలాసవంతమైన హోటళ్లు, నివాస సముదాయాలపై ఇరాన్ దాడులు చేసింది. ట్రంప్ వ్యాపారవేత్త కాబట్టి ఆయన వ్యక్తిగత ఆస్తులకు నష్టం జరిగితే ఆయనపై ఒత్తిడి పెరుగుతుందని ఇరాన్ భావిస్తోంది. ట్రంప్ తన సొంత ఆస్తులు కాపాడుకోలేకపోతున్నారని అమెరికాలో విమర్శలు రావాలని, ఆ తర్వాత ట్రంప్‌ను వెనక్కి తగ్గేలా చేయాలని ఇరాన్ ప్లాన్ వేస్తోంది.
గల్ఫ్ చమురు, గ్యాస్ కేంద్రాల ధ్వంసం
సౌదీ అరేబియాలోని రాస్ తనూరా, ఖతార్‌లోని రాస్ లఫాన్ గ్యాస్ ప్లాంట్లపై ఇరాన్ దాడులు చేసిన సంగతి తెలిసిందే. అంతేకాదు చమురు రవాణాకు కీలక మార్గమైన హార్మూజ్ జలసంధిని కూడా మూసివేసింది. ఆ మార్గంలో ఏవైనా నౌకలు వస్తే దాడులు చేస్తామని హెచ్చరించింది. అయితే ఇలా చమురు కేంద్రాలపై దాడులు చేయడం, హర్మూజ్ జలసంధిని మూసివేయడం వల్ల అంతర్జాతీయ మార్కెట్‌లో చమురు ధరలు విపరీతంగా పెరుగుతాయి. దీనివల్ల అమెరికా మిత్రదేశాలైన యూరప్ దేశాల్లో చమురు కొరత ఏర్పడుతుంది. దీనివల్ల మిత్రదేశాల్లో అశాంతిని సృష్టించి ట్రంప్‌పై ఒత్తిడి తీసుకురావడం ఇరాన్ వ్యూహం.
Also Read: లక్షల కోట్ల ఆస్తులు.. కళ్లు చెదిరే భవంతులు.. ఇరాన్ కొత్త చీఫ్ ఆస్తులు తెలిస్తే షాకవుతారు!
అమెరికన్ దౌత్య కార్యాలయాలపై దాడులు
ఖతార్‌లోని అల్-ఉదైద్, కువైట్‌లోని సైనిక స్థావరాలపై ఇరాన్ క్షిపణి దాడులు చేస్తోంది. అలాగే సౌదీ అరేబియా, కువైట్‌లో అమెరికా ఎంబీలపై దాడులు చేసింది. దుబాయ్‌లోని అమెరికా కాన్సులేట్ పార్కింగ్ ప్లేస్‌లో కూడా డ్రోన్ దాడి జరిగింది. అమెరికా తమ దౌత్యవేత్తలను, సిబ్బందిని గల్ఫ్ నుంచి ఖాళీ చేసేలా ఇరాన్ ప్లాన్ చేసింది. ఇప్పటికే బహ్రెయిన్, జోర్డాన్, కువైట్ నుండి నాన్-ఎమర్జెన్సీ సిబ్బందిని అమెరికా వెనక్కి రప్పించింది. గల్ఫ్ దేశాలలో అమెరికా సురక్షితం కాదనే సందేశాన్ని ఇరాన్ పంపిస్తోంది.
ప్రస్తుతం సౌదీ అరేబియా, కువైట్, లెబనాన్‌లో అమెరికా ఎంబసీలు ప్రస్తుతం మూసివేశారు. గల్ఫ్ దేశాల్లో ఉన్న అమెరికన్లను వెంటనే ఆయా దేశాల నుంచి వెళ్లిపోవాలని అమెరికా ప్రభుత్వం ఇప్పటికే ట్రావెల్ అడ్వైజరీ జారీ చేసింది. అమెరికా ప్రధాన భూభాగంపై దాడి చేస్తే సామర్థ్యం ఇరాన్‌కు లేదు. అందుకే, గల్ఫ్ దేశాల్లో ఉన్న అమెరికా స్థావరాలను దెబ్బతీయడం ద్వారా అమెరికా సైనికులను అక్కడినుంచి వెళ్ళిపోయేలా ఒత్తిడి తీసుకురావడమే ఇరాన్ అసలు వ్యూహం.
Also Read: ఇరాన్‌లో అంతర్యుద్ధం.. కుర్దీష్ గ్రూపులతో కలిసి CIA మాస్టర్ ప్లాన్
ఈ యుద్ధంలో ఇరాన్ అట్రిషన్ వార్ స్ట్రాటజిక్ పద్ధతిని కూడా వాడుతోంది. ఇరాన్ కేవలం చౌక డ్రోన్లతోనే దాడులు చేస్తోంది. అమెరికా, ఇజ్రాయెల్ మాత్రం ఖరీదైన, అడ్వాన్స్‌డ్ ఆయుధాలతో వాటిని అడ్డుకుంటున్నాయి. 'షాహెద్ 136 వన్‌వే' అటాక్ డ్రోన్లను ఇరాన్ ప్రయోగిస్తోంది. చిన్న క్రూయిజ్ మిసైళ్లలా ఉండే ఈ డ్రోన్న ప్రభావం గట్టిగానే ఉంటుంది. లక్ష్యాన్ని చేరుకున్న తక్షణమే అవి పేలిపోతాయి. వీటిని సూసైడ్ డ్రోన్లు అని కూడా అంటారు. ఇరాన్‌కు చెందిన ఒక్కో డ్రోన్ తయారుచేసేందుకు కేవలం 20 వేల డాలర్లు (రూ.16 లక్షలు) మాత్రమే ఖర్చవుతుంది. కానీ వీటిని అడ్డుకునేందుకు గల్ఫ్ దేశాలు, అమెరికా, ఇజ్రాయెల్ వాడుతున్న రక్షణ వ్యవస్థ ఖర్చు మాత్రం రూ.కోట్లు దాటుతోంది.
మరోవైపు అమెరికాకు బిగ్ షాక్ తగిలింది. క్షిపణులు నిల్వలు తగ్గిపోతున్నాయని పెంటగాన్ పేర్కొంది. ఇంటర్‌సెప్టర్ మిస్సైల్స్ నిల్వలు భారీగా తగ్గినట్లు మీడియాలో వార్తలు వస్తున్నాయి. ప్రస్తుతం ఇరాన్‌ను దెబ్బకొట్టేందుకు అమెరికా భారీగా మిస్సైల్స్ ప్రయోగిస్తోంది. యుద్ధంలో రోజుకు రూ200 నుంచి రూ.500 కోట్లు ఖర్చు చేస్తోంది. మరోవైపు అమెరికా, ఇజ్రాయెల్ చేసిన దాడుల్లో ఇప్పటిదాకా ఇరాన్‌లో 958 మృతి చెందారు.
Follow Us