Mojtaba Khamenei : లక్షల కోట్ల ఆస్తులు.. కళ్లు చెదిరే భవంతులు.. ఇరాన్ కొత్త చీఫ్ ఆస్తులు తెలిస్తే షాకవుతారు!

ఇరాన్ రాజకీయాల్లో ఒక శకం ముగిసి, కొత్త శకం మొదలైంది. ఇరాన్ కొత్త సుప్రీంను ఎన్నుకుంది. దివంగత సుప్రీం అయతుల్లా అలీ ఖమేనీ చిన్న కుమారుడైన మోజ్తబా ఖమేనీని ఈ పదవికి నియమించింది.

New Update
iran

ఇరాన్ రాజకీయాల్లో ఒక శకం ముగిసి, కొత్త శకం మొదలైంది. ఇరాన్ కొత్త సుప్రీంను ఎన్నుకుంది. దివంగత సుప్రీం అయతుల్లా అలీ ఖమేనీ చిన్న కుమారుడైన మోజ్తబా ఖమేనీని ఈ పదవికి నియమించింది. ఇరాన్ టీవీ నివేదికల ప్రకారం.. అక్కడి అత్యున్నత మండలి 'అసెంబ్లీ ఆఫ్ ఎక్స్‌పర్ట్స్' ఈ కీలక నిర్ణయం తీసుకుంది.56 ఏళ్ల మోజ్తబా ఖమేనీ, అయతుల్లా అలీ ఖమేనీకు రెండవ కుమారుడు. అయితే ఇప్పటిరవరకు ఎలాంటి ప్రభుత్వ పదవిని నిర్వహించనప్పటికీ..  కానీ, ఇరాన్ అధికార వర్గాల్లో ఆయన అత్యంత ప్రభావవంతమైన వ్యక్తిగా పేరు తెచ్చుకున్నారు.  తెర వెనుక ఉండి చక్రం తిప్పడంలో ఈయన సిద్ధహస్తుడని సమాచారం. ముఖ్యంగా ఇరాన్ శక్తివంతమైన సైన్యం IRGC (ఇరానియన్ రివల్యూషనరీ గార్డ్ కార్ప్స్) తో ఈయనకు బలమైన సంబంధాలు ఉన్నాయి. 

ఆయన వెనుకున్న ఆస్తులెంత? 

ఈ క్రమంలో మోజ్తబా ఖమేనీ ఎంత ధనవంతుడు.. ఆయన వెనుకున్న ఆస్తులెంత.. విదేశాల్లో ఏమైనా పెట్టుబడులు పెట్టాడా అనే విషయాలు ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.  బ్లూమ్‌బెర్గ్‌తో సహా కొన్ని అంతర్జాతీయ నివేదికల ప్రకారం ఈయనకు విదేశాల్లో కోట్ల డాలర్ల పెట్టుబడులు ఉన్నాయి. స్విస్ బ్యాంకు ఖాతాలతో పాటు, బ్రిటన్‌లో సుమారు 138 మిలియన్ పౌండ్ల విలువైన విలాసవంతమైన ఆస్తి ఉన్నట్లు ఆరోపణలు ఉన్నాయి. 2019లోనే అమెరికా ప్రభుత్వం మోజ్తబాపై ఆర్థిక ఆంక్షలు విధించింది. ఇక మోజ్తబా భార్య పేరు జహ్రా హదాద్-అబ్దెల్. ఈమె ఇరాన్ మాజీ పార్లమెంట్ స్పీకర్ కుమార్తె. వీరికి ముగ్గురు పిల్లలు ఉన్నట్లు సమాచారం, అయితే దీనిపై అధికారికంగా ఎలాంటి ప్రకటన లేదు.  మోజ్తబా నియామకం వెనుక IRGC ఒత్తిడి ఉందనే వార్తలు వినిపిస్తున్నప్పటికీ, ఇరాన్ ప్రభుత్వం నుంచి దీనిపై ఇంకా అధికారికంగా స్పందించాల్సి ఉంది. 

సాధారణంగా షియా సంప్రదాయం ప్రకారం.. తండ్రి తర్వాత కొడుకు సుప్రీం లీడర్ కావడం అంత సులువు కాదు. ఇరాన్ రాజకీయాల్లో కూడా వారసత్వ పాలనపై కొంత వ్యతిరేకత ఉంది. గతంలో అలీ ఖమేనీ సిద్ధం చేసిన వారసుల జాబితాలో మోజ్తబా పేరు లేదని వార్తలు వచ్చినప్పటికీ, ఇప్పుడు అనూహ్యంగా ఆయనకే బాధ్యతలు అప్పగించడం గమనార్హం.

Advertisment
తాజా కథనాలు