Rasmussen Poll : ట్రంప్ విజయం గ్యారంటీ!

మరికొన్ని రోజుల్లో జరిగే అమెరికా ఎన్నికల్లో రిపబ్లికన్‌ పార్టీ అభ్యర్థి డొనాల్డ్‌ ట్రంప్‌ విజయం ఖాయమని Rasmussen Poll తెలిపింది. ఈ పోల్‌ లో ట్రంప్‌ కి 297, కమలా హారిస్‌ కు 241 ఎలక్ట్రోరల్‌ ఓట్లు వస్తాయని Rasmussen Poll చెప్పింది.

New Update
Kamala Harris: దూసుకుపోతున్న కమలా హారిస్‌.. ట్రంప్‌ కన్నా నాలుగు పాయింట్ల ఆధిక్యం

America Elections : అమెరికా ఎన్నికల్లో రిపబ్లికన్‌ పార్టీ అభ్యర్థి డొనాల్డ్‌ ట్రంప్‌ విజయం ఖాయమని Rasmussen Poll  అంచనా వేసింది. ట్రంప్‌ కి 297, కమలా హారిస్‌ కు 241 ఎలక్ట్రోరల్‌ ఓట్లు వస్తాయని పేర్కొంది. స్వింగ్ స్టేట్స్‌ అయిన జార్జియా, నార్త్‌ కరోలినా, విస్కన్సిన్‌, నెవడా, పెన్సిల్వేనియా, అరిజోనా, మిచిగాన్‌ రాష్ట్రాల్లో ట్రంప్‌ సత్తా చాటుతారని తెలిపింది. కాగా నవంబర్‌ 5న అగ్ర రాజ్యంలో ఎన్నికలు జరగనున్న సంగతి తెలిసిందే. 

Also Read: 11 నుంచి ఏపీ అసెంబ్లీ సమావేశాలు..బడ్జెట్‌ కూడా!

ఇప్పటికే ముందస్తు ఓటింగ్‌ను ఉపయోగించుకొని ఇప్పటికే దాదాపు 6.1 కోట్ల మందికి పైగా ప్రజలు ఓట్లు వేశారు. ఈ ఎన్నికల్లో రిపబ్లికన్ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్, డెమొక్రటిక్ అభ్యర్థి కమలాహారిస్‌కు మధ్య గట్టి పోటి నెలకొంది. ఈ ముందస్తు ఓటింగ్ ప్రక్రియలో చాలామంది పోలింగ్ కేంద్రాలకు వెళ్లి ఓటువేశారు. మరికొంతమంది మెయిల్ బ్యాలెట్‌ ద్వారా తన ఓటు హక్కు వినియోగించుకున్నారు.    

Also Read: ఇల్లు కట్టుకునే వారికి చంద్రబాబు సర్కార్ శుభవార్త

అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌ కూడా తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. డేలావేర్‌లోని విల్మింగ్టన్‌లో తన ఇంటికి సమీపంలో ఉన్న పోలింగ్ కేంద్రంలో 40 నిమిషాల పాటు క్యూ లైన్‌లో నిల్చొని ఓటు వేశారు. ఇక నవంబర్ 5న మిగతా ఓటర్లు ఓటు వేయనున్నారు. ఈ ఎన్నికల్లో ఎవరు గెలుస్తారనే దానిపై కేవలం అమెరికా మాత్రమే కాదు.. ప్రపంచ దేశాలు ఆసక్తిగా ఎదురుచూస్తున్నాయి. ఓవైపు ఉక్రెయిన్, రష్యా యుద్ధం, మరోవైపు పశ్చిమాసియాలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న వేళ.. అమెరికా కొత్త అధ్యక్షునితో భవిష్యత్తులో ఎలాంటి పరిణామాలకు దారీ తీస్తాయే అనేది చర్చనీయమవుతోంది.  

భారతీయ ఓటర్ల మొగ్గు ఎటువైపు..

ఈసారి అమెరికా ఎన్నికల్లో భారత ఓటర్లు కీలకపాత్ర పోషించనున్నారు. అమెరికాలో భారతీయ ఓటర్లు అధికంగానే ఉన్నారు. ఇక్కడకు వచ్చి సెటిల్ అయినవారే కాకుండా.. గ్రీన్ కార్డు హోల్డర్లు కూడా ఓటు వేసే ఛాన్స్ ఉంది. భారతీయులకు ట్రంప్‌తో ఇంతకు ముందే అనుభవం ఉంది. లాస్ట్ టైమ్ ట్రంప్ అధ్యక్షుడిగా ఉన్నప్పుడు భారతీయులు నానా కష్టాలు పడ్డారన్న విమర్శలున్నాయి. వీసాల జారీను చాలా కట్టుదిట్టం చేయడంతో ఇబ్బందులు ఎదుర్కొన్నారు. 

Also Read: జనవరి నుంచే కొత్త రేషన్ కార్డులు.. ఫస్ట్ ఇచ్చేది వారికే!

అయితే ఎన్ని ఉన్నా...ఈసారి మా మద్దుతు మాత్రం మళ్ళీ ట్రంప్‌కే అంటున్నారు. ఆయన అధ్యక్షుడిగా వస్తేనే జాబ్స్ నిలబడతాయని చెబుతున్నారు. అక్రమ వలసలు ఆగిపోతాయని...ఎవరు నిజాయితీగా రావాలో వారే అమెరికాకు వస్తారని చెబుతున్నారు. కమలా హారిస్ వస్తే అక్రమ వలసలు పెరగిపోతాయని భారతీయులు అభిప్రాయపడుతున్నారు. అదీ కాక ప్రస్తుతం డౌన్ ఫాల్‌లో ఉన్న అమెరికా ఆర్ధిక పరిస్ధితి బాగుపడాలంటే ట్రంపే రావాలని ఇండియన్స్ అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. 

Also Read: బాల్ టాంపరింగ్‌ కు పాల్పడిన భారత కీపర్. అంపైర్ తో వాగ్వాదం!

ఇప్పటి వరకు బైడెన్ చేసిన తప్పులనే కమలా హారీస్ వస్తే రిపీట్ చేస్తారని...ఆమె సవంత అభిప్రాయం ఎలా ఉన్నా పార్టీ చెప్పినట్టుగానే నడుచుకోవాలి కాబట్టి పరిస్థితి ఏమీ మారదు అని అంటున్నారు. అందుకే మా ఓటు ట్రంప్‌కే అని అంటున్నారు. 

Advertisment
Advertisment
తాజా కథనాలు