Iran: వామ్మో.. ఇరాన్‌లో 9 నెలల్లో 1000 మందికి మరణశిక్ష అమలు

ఇరాన్‌ ప్రభుత్వం వరుసగా మరణశిక్షలు అమలు చేస్తోంది. దీన్ని అంతర్జాతీయ మానవ హక్కుల సంఘాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. ఈ ఏడాదిలో ఇప్పటిదాకా వెయ్యి మందికి మరణశిక్షలు అమలు చేసిందని ఇరాన్ మానవ హక్కుల సంఘం వెల్లడించింది.

New Update
Iran Executed Over 1,000 People In 2025, Highest In 17 Years

Iran Executed Over 1,000 People In 2025, Highest In 17 Years

ఇరాన్‌ ప్రభుత్వం వరుసగా మరణశిక్షలు అమలు చేస్తోంది. దీన్ని అంతర్జాతీయ మానవ హక్కుల సంఘాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. ఈ ఏడాదిలో ఇప్పటిదాకా వెయ్యి మందికి మరణశిక్షలు అమలు చేసిందని ఇరాన్ మానవ హక్కుల సంఘం వెల్లడించింది. గడిచిన వారం రోజుల్లోనే 64 మందికి వీటిని అమలు చేసిందని పేర్కొంది. దీన్నిపట్టి చూస్తే ప్రతిరోజూ తొమ్మిదిమందిని ఉరితీసినట్లు తెలిపింది. ఈ మధ్యకాలంలో ఇరాన్‌లో మరణశిక్షలు పెరిగిపోతున్నాయి. 

Also Read: వామ్మో వీడెవడండి బాబు.. రైళ్లో పామును చూపించి భిక్షాటన

గడిచిన 3 దశాబ్దాల్లో ఎప్పుడూ లేనంతగా ఈమధ్య ఎక్కువగా మరణశిక్షలు అమలు చేస్తోంది.  గతేడాది 975 మందికి మరణశిక్ష అమలు చేసినట్లు సమాచారం. ఇక ఈ ఏడాదిలో ఇప్పటికే ఆ సంఖ్య 1000 దాటిందని మానవ హక్కుల సంఘం పేర్కొంది. అంతేకాదు ఈ మరణశిక్షలు బాహ్య ప్రపంచానికి తెలిసినదానికన్న మరింత ఎక్కువగానే ఉండే అవకాశం ఉందని తెలిపింది. 

Also Read: కోల్‌కతాలో రికార్డు స్థాయిలో వర్షం.. 9 మంది మృతి, 30 విమానాలు రద్దు

గతంలో అనేక మార్గాల్లో ఇరాన్ మరణశిక్షలు అమలు చేసేది. ప్రస్తుతం చూసుకుంటే ఉరిశిక్షలే ఎక్కువగా అమలు చేస్తోంది. అత్యధికంగా జైళ్లలో వీటిని అమలు చేస్తూనే.. బహిరంగ మరణశిక్షలు కూడా విధిస్తోంది. హత్య, అత్యాచారం, లైంగిక దాడి, డ్రగ్స్ అక్రమ రవాణా లాంటి నేరాలకు ఈ శిక్షలు అమలు చేస్తోంది. ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్‌తో పాటు పలు అంతర్జాతీయ మానవ హక్కుల సంస్థల ప్రకారం.. అత్యధికంగా మరణశిక్షలు అమలు చేస్తు్న్న దేశాల్లో చైనా మొదటిస్థానంలో ఉంది. రెండో స్థానంలో ఇరాన్ ఉంది. చైనా ప్రతీ సంవత్సరం వేలాది మందికి మరణశిక్షలు అమలు చేస్తోందనే వాదనలు ఉన్నాయి. కానీ దీనికి సంబంధించి పూర్తి వివరాలపై స్పష్టత లేదు. 

Advertisment
తాజా కథనాలు