Starlink: స్టార్‌లింక్‌ శాటిలైట్లను కూల్చనున్న రష్యా.. వెలుగులోకి సంచలన నిజాలు

ఎలాన్‌మస్క్‌కు చెందిన స్టార్‌లింక్‌ శాటిలైట్‌ కూటమిలో 35956 అనే కృత్రిమ ఉపగ్రహం అదుపుతప్పి భూమి దిశగా కదులుతోంది. దీనిపై నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తుండగా ఇప్పుడు మరో సమస్య వచ్చి పడింది. రష్యా నుంచి మరో ముప్పు పొంచి ఉందని నిఘా వర్గాలు చెబుతున్నాయి.

New Update
Intelligence agencies suspect Russia is developing anti-satellite weapon to target Starlink service

Intelligence agencies suspect Russia is developing anti-satellite weapon to target Starlink service

ఎలాన్‌మస్క్‌కు చెందిన స్టార్‌లింక్‌ శాటిలైట్‌ కూటమిలో 35956 అనే కృత్రిమ ఉపగ్రహం అదుపుతప్పి భూమి దిశగా కదులుతోంది. దీనిపై నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తుండగా ఇప్పుడు మరో సమస్య వచ్చి పడింది. రష్యా నుంచి మరో ముప్పు పొంచి ఉందని నిఘా వర్గాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. అంతరిక్ష కక్షలో తిరిగే వందలాది కృత్రిమ శాటిలైట్లను కూల్చేసేందుకు రష్యా అధునాతన ఆయుధాన్ని కూల్చేసే పనిలో పడిందని నిఘా వర్గాలు అనుమానిస్తున్నాయి. ది అసోసియేటెట్‌ ప్రెస్ వార్తాసంస్థ ఈ నిఘా సమాచారాన్ని వెల్లడించింది. 
  
అంతరిక్షంలో శాటిలైట్‌లపైకి సూక్ష్మ పెల్లెట్లను ప్రయోగించి ఆ ఉపగ్రహాలకు నష్టం కలిగించేలా చేయడమే రష్యా ఆయుధం టార్గెట్. ఈ ఆయుధానికి జీరో ఎఫెక్ట్‌ అని పేరు పెట్టినట్లు సమాచారం. వందలాది పెల్లెట్లను ఒకేసారి ప్రయోగిస్తే పెద్దసంఖ్యలో శాటిలైట్లను నాశనం చేయొచ్చు.  ఇవి చిన్నిచిన్న ముక్కలుగా చెల్లాచెదురుగా పడటంతో సమీప కక్ష్యలో ఉండే ఇతర శాటిలైట్లను సైతం దెబ్బతింటాయి. ఇలాంటి వినాశకర ఆయుధాన్ని రష్యా సృష్టించకుండా ఉంటుందని తాము అనుకోవడం లేదని అమెరికాలో ప్రభుత్వేతర సెక్యూర్‌ వరల్డ్‌ ఫౌండేషన్‌లోని అంతరిక్ష భద్రతా నిపుణుడు విక్టోరియా సామ్సన్‌ అన్నారు. 

Also Read: మదర్సాల చట్టం రద్దు చేసిన యోగి సర్కార్.. ఇక ఏం జరగనుందో తెలుసా?

జీరో ఎఫెక్ట్‌ ఆయుధ తయారీ గురించి రష్యా అధ్యక్ష కార్యాలయం అధికార ప్రతినిధి దిమిత్రీ పెస్కోవ్‌ మాట్లాడారు. కక్షలో తిరిగే సామర్థ్యమున్న ఆయుధాల ప్రయోగాలను శత్రుదేశాలు ఆపేలా ఐక్యరాజ్య సమితి చొరవ చూపాలని అన్నారు. అయితే పుతిన్ గతంలోనే అణ్వస్త్ర సామర్థ్యమున్న అంతరిక్ష ఆయుధాలను మోహరించమని అన్నారు. తక్కువ ఎత్తులో తిరిగే స్టార్‌లింక్ శాటిలైట్‌లు రష్యా గగనతలంపై నిఘా పెట్టి ఉక్రెయిన్ దిశలో రష్యా సేనల ఆచూకిని గుర్తించి ఉక్రెయిన్‌కు అందజేస్తున్నాయి. ఈ క్రమంలోనే స్టార్‌లింక్‌ శాటిలైట్‌లు తమ భద్రతకు ముప్పుగా ఉన్నాయని అందుకే వాటిని నాశనం చేయాలని రష్యా భావిస్తున్నట్లు పశ్చిమాసియా నిఘా వర్గాలు చెబుతున్నాయి.          

 కెనడా సైన్యంలోని అంతరిక్ష విభాగ బ్రిగేడియర్‌ జనరల్‌ క్రిస్టోఫర్‌ హోర్నర్‌ దీని గురించి మాట్లాడారు. '' నింగిలోకి దూసుకెళ్లే రాకెట్ల వంటి వాటినే మనం గుర్తించగలం. కేవలం మిల్లీమీటర్‌ పొడవు వరకు ఉండే సూక్ష్మ పెల్లెట్లను భూతల, గగనతల నిఘా సిస్టమ్‌లు గుర్తించలేవు. వీటితో శాటిలైట్‌లపై దాడి చేస్తే నష్టాన్ని తప్పించడం చాలా కష్టం. పెల్లెట్ల దెబ్బకు ఒకే కక్షలో శాటిలైట్‌లు అన్నీ కూడా నాశనం అవుతాయి. అంతేకాదు అది దాడి చేసేంది రష్యా అని కనిపెట్టడం కూడా కష్టంతో కూడుకున్న పని. నవంబర్‌లో సూక్ష్మ స్థాయి అంతరిక్ష శకలం తగిలి చైనా స్పెస్‌క్రాఫ్ట్‌ దెబ్బతింది. చైనా అంతరిక్ష కేంద్రం నుంచి బయలుదేరిన తర్వాత అక్కడే ఉండిపోయింది. దీనివల్ల భూమిపైకి రావాల్సిన చైనా వ్యోమగాములు కూడా అక్కడే ఇరుక్కుపోయారని'' క్రిస్టోఫర్ హోర్నర్ అన్నారు.

Also Read: కర్ణాటకలో పరువు హత్య..నిండు గర్భిణిపై కన్నవారి దాష్టీకం

వాషింగ్టన్‌లోని సెంటర్‌ ఫర్‌ స్ట్రాటజీ అండ్‌ ఇంటర్నేషనల్‌ స్టడీస్‌లో అంతరిక్ష భద్రత, ఆయుధాల నిపుణుడు క్లేటన్ స్వాప్ మాట్లాడుతూ శాటిలైట్ల ఉపరితలాల్లో ఎక్కువ ప్రాంతాన్ని సౌర ఫలకాలే ఆక్రమిస్తాయని అన్నారు. పెల్లెట్ల తగిలితే అవన్నీ బద్ధలవుతాయని.. దీనివల్ల శాటిలైట్ల మనుగడ ప్రశ్నార్థకమవుతందని తెలిపారు. ప్రస్తుతం స్టార్‌లింక్ శాటిలైట్‌లు భూమి నుంచి ఆకాశంలో 500 కిలోమీటర్ల ఎత్తులో సంచరిస్తున్నట్లు పేర్కొన్నారు. వీటి కింది కక్షలో ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్, చైనా వారి తియాంగ్‌ స్పేస్‌ స్టేషన్ తిరుగుతున్నాయని అన్నారు. రష్యా దాడి చేస్తే శాటిలైట్‌లు చెల్లచెదురై ISS, తియాంగ్‌ స్పేస్‌ స్టేషన్లు నాశనం అయ్యే ఛాన్స్ ఉన్నట్లు పేర్కొన్నారు.