BIG BREAKING: మదర్సాల చట్టం రద్దు చేసిన యోగి సర్కార్.. ఇక ఏం జరగనుందో తెలుసా?

ఉత్తర్ ప్రదేశ్‌లో యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వం ఒక కీలక నిర్ణయం తీసుకుంది. ఎప్పుడు సంచలన నిర్ణయాలు తీసుకునే యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ మరో సంచలన నిర్ణయం తీసుకున్నారు. మదర్సా టీచర్లకు పోలీసు చర్యల నుంచి రక్షణ ఇచ్చే చట్టాన్ని రద్దు చేశారు.

New Update
FotoJet (28)

Yogi government repealed that law in madrasas

Yogi Govt Sensational Decision: ఉత్తర ప్రదేశ్‌లో యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వం ఒక కీలక నిర్ణయం తీసుకుంది. ఎప్పుడు సంచలన నిర్ణయాలు తీసుకునే యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ మరో సంచలన నిర్ణయం తీసుకున్నారు. అఖిలేష్‌ యాదవ్‌ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో తీసుకువచ్చిన మదర్సా టీచర్లకు పోలీసు చర్యల నుంచి రక్షణ ఇచ్చే చట్టాన్ని రద్దు చేశారు. దీంతో మదర్సా సిబ్బందిపై అక్రమాలు వెలుగులోకి వస్తే నేరుగా చర్యలు తీసుకునే అధికారం పోలీసులకు ఉంటుంది.

కాగా గతంలో అధికారంలో ఉన్న సమాజ్‌వాదీ పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్ హయాంలో (2016లో) తీసుకొచ్చిన మదర్సా టీచర్లకు పోలీసు చర్యల నుంచి రక్షణ ఇచ్చే బిల్లును యోగి ప్రభుత్వం రద్దు చేసింది. సదరు బిల్లు ప్రకారం, మదర్సా ఉపాధ్యాయులు లేదా సిబ్బందిపై ఎలాంటి అక్రమాలు (ఆర్థిక లోపాలు లేదా ఇతర నేరాలు) వెలుగులోకి వచ్చినా, పోలీసులు నేరుగా చర్యలు తీసుకునే అవకాశం లేకుండా పోయింది. వారిపై చర్యలు తీసుకోవాలంటే ప్రత్యేక అనుమతులు అవసరమయ్యేవి. అఖిలేష్ యాదవ్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో  తీసుకొచ్చిన ఈ చట్టం మదర్సా ఉపాధ్యాయులు లేదా సిబ్బందికి ఒక రకమైన రక్షణ కవచంగా పనిచేసింది. దీంతో ఆ చట్టాన్ని అడ్డుపెట్టుకుని వారు అనేక అక్రమాలకు పాల్పడుతున్నారని యోగి ఆరోపిస్తున్నారు.

ఇప్పుడు ఈ బిల్లు రద్దు చేయడం వల్ల మదర్సా సిబ్బందిపై ఎలాంటి ఫిర్యాదు వచ్చినా..లేదా ఆధారాలు ఉన్నా పోలీసులు నేరుగా దర్యాప్తు చేసి చర్యలు తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. యోగి ప్రభుత్వం ఈ నిర్ణయాన్ని 'కాన్ సే ఉపర్ కోఈ వర్గ్ నహీ' (చట్టానికి ఎవరూ అతీతం కాదు) అనే సూత్రంతో సమర్థించింది. ఈ మార్పు మదర్సాల్లో పారదర్శకత, జవాబుదారీతనాన్ని పెంచుతుందని ప్రభుత్వం అభిప్రాయపడుతోంది. ఇది మదర్సా విద్యావ్యవస్థలో జరిగే అక్రమాలను అరికట్టడానికి సహాయపడుతుందని యోగీ ప్రభుత్వం భావిస్తోంది.

Advertisment
తాజా కథనాలు