DUBAI EMPTY : స్వదేశం వైపు భారతీయుల చూపు..దుబాయ్‌ను వదిలేస్తున్న ధనవంతులు

ఇరాన్‌ పై అమెరికా, ఇజ్రాయెల్‌ సాగిస్తు్న్న యుద్ధంతో నిన్న మొన్నటి వరకు సేఫ్‌ కంట్రీస్‌గా పేరుపడ్డ దేశాలు యుద్ధ భయంతో వణికిపోతున్నాయి. దీంతో అక్కడ స్థిరపడిన పలువురు వ్యాపారులు, భారతీయ ధనవంతులు, ఇసియా దేశాల ధనవంతులు దుబాయ్‌ని వదిలేసేందుకు సిద్ధపడుతున్నారు.

New Update
FotoJet (25)

DUBAI EMPTY

DUBAI EMPTY :  ఇరాన్‌ పై అమెరికా(iran us war), ఇజ్రాయెల్‌ సాగిస్తు్న్న యుద్ధంతో పశ్చిమాసియా దేశాలు దద్దరిల్లుతున్నాయి. నిన్న మొన్నటి వరకు సేఫ్‌ కంట్రీస్‌గా పేరుపడ్డ దేశాలె యుద్ధ భయంతో వణికిపోతున్నాయి. అమెరికా, ఇజ్రాయెల్‌ తనపై సాగిస్తున్న యుద్ధానికి ప్రతిగా ఇరాన్‌ ప్రతిదాడులకు దిగుతుంది. అందులో భాగంగా సైనిక అమెరికా సైనిక స్థావరాలను లక్ష్యంగా చేసుకుని బాంబుల వర్షం కురిపిస్తోంది. తన చుట్టూ ఉన్న గల్ఫ్‌ కంట్రీస్‌ పై ఇరాన్‌  క్షిపణులు, డ్రోన్లతో దాడులకు దిగుతోంది. దీంతో దుబాయ్ వంటి దేశాల్లో వ్యాపరాలు నిర్వహిస్తు్న్న సంపన్నులు లబోదిబో మంటున్నారు. తమ ఆస్తుల భరోసాపై ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా దుబాయ్‌ పై వరుసగా  క్షిపణులు, డ్రోన్ల దాడులు జరుగుతుండటంతో  అక్కడ స్థిరపడిన పలువురు వ్యాపారులు, భారతీయ ధనవంతులు, ఇసియా దేశాల ధనవంతులు దుబాయ్‌ని వదిలేసేందుకు సిద్ధపడుతున్నారు. ఇన్నాళ్లు  'సేఫ్ హెవెన్'గా ఫేమస్ పేరుబడిన దుబాయ్ ప్రతిష్ఠ ఇరాన్ బాంబు దాడులతో మసకబారుతోంది. దీంతో పెట్టుబడిదారులు సింగపూర్, హాంకాంగ్ వైపు తరలిపోతున్నారని తాజా నివేదికలు స్పష్టం చేస్తున్నాయి.

Also Read :  ఇరాన్‌పై దాడులకు ‘ఉక్రెయిన్‌’ డ్రోన్లు... ఒకే అన్న జెలెన్‌స్కీ

Indians Look Towards Their Homeland

మరోవైపు భారతీయ ధనవంతులు దుబాయ్‌(dubai emergency) వదిలేయడానికి సిద్ధమయ్యారు. ఇప్పటికే -- గల్ఫ్‌ దేశాల నుంచి 52,360 మంది భారతీయులు భారత్‌కు చేరుకున్నారని తెలుస్తోంది. వీరంతా -- ప్రత్యేక విమానాలు, ప్రత్యామ్నాయ రూట్లలో భారతదేశానికి తిరిగి వచ్చేసినట్లు పలు కథనాలు వెల్లడిస్తున్నాయి. అంతేకాక పలువురు -- ధనవంతులు దుబాయ్ నుంచి ఆస్తులు కూడా ట్రాన్స్‌ఫర్ చేసుకుంటున్నారని, దుబాయ్‌లో నివసిస్తున్న ఇద్దరు భారతీయ పారిశ్రామికవేత్తలు(billionaires) రిస్క్ తగ్గించుకోవడానికి తమ బ్యాంకు ఖాతాల నుండి ఒక్కొక్కరు లక్ష డాలర్ల కంటే ఎక్కువ మొత్తాన్ని సింగపూర్‌కు తరలించడానికి ప్రయత్నించినట్లు రాయిటర్స్ కథనం పేర్కొనడం గమనార్హం. వీరే కాక పలువురు ఇతర సంపన్నులు కూడా తమ ఆస్తులను గల్ఫ్ నుండి తరలించేందుకు న్యాయ నిపుణులను, ఆర్థిక సలహాదారులను సంప్రదిస్తుస్తున్నారనే ప్రచారం జోరుగా సాగుతోంది.

50 మిలియన్ డాలర్ల కు మించి ఆస్తులు కలిగిన దుబాయ్ క్లయింట్లు చాలామంది వెంటనే తమ డబ్బులను సింగపూర్, హాంకాంగ్‌కు మార్చాలని ప్లాన్‌ చేస్తున్నారట. గల్ఫ్ ప్రాంతంలో నెలకొన్న అస్థిరత కారణంగా ఫ్యామిలీ ఆఫీసులు కూడా అప్రమత్తమైనట్లు తెలుస్తోంది. ఇన్నాళ్లూ కేవలం పన్ను ప్రయోజనాల కోసమే దుబాయ్‌ను ఎంచుకున్న వారు.. ఇప్పుడు పన్నుల కంటే తమ ప్రాణాలకు, ఆస్తుల భద్రతకే మొదటి ప్రాధాన్యత అని భావిస్తున్నారట.దీంతో వారంతా -- దుబాయ్ నుంచి తమ ఆస్తులు ట్రాన్స్‌ఫర్ చేసుకునేందుకు సిద్ధపడుతున్నారు. ఒకవేళ యుద్ధం రేపు ముగిసినా.. విమానాల రాకపోకలు, భద్రతపై నమ్మకం కలగడం అంత ఈజీ వ్యవహారం కాదని నిపుణులు అంటున్నారు. అయితే ధనవంతుల భయాన్ని పసిగట్టిన యూఏఈ ప్రభుత్వం పెట్టుబడిదారుల విశ్వాసం దెబ్బతినకుండా ఉండేందుకు ప్రయత్నిస్తున్నప్పటికీ, యుద్ధ భయం మాత్రం సంపన్నులను వీడటం లేదు. దీంతో వారంతా తమ వ్యాపారాలను  సింగపూర్ వంటి దేశాల వైపు మళ్లీంచడానికే ఆసక్తి చూపుతున్నారు.

Also Read :  గల్ఫ్‌ దేశాలపై ఇరాన్ దొంగ దెబ్బ.. రాత్రంతా మిస్సైళ్ల వర్షం

Advertisment
తాజా కథనాలు