Dubai marina towar : గల్ఫ్‌ దేశాలపై ఇరాన్ దొంగ దెబ్బ..రాత్రంతా మిస్సైళ్ల వర్షం

ఇరాన్‌‌పై అమెరికా, ఇజ్రాయెల్‌‌ దాడులు.. ఇరాన్‌‌ ప్రతిదాడులతో పశ్చిమాసియా రణరంగంలా మారింది. ఇరాన్‌‌ సుప్రీం లీడర్‌‌ ఖమేనీ హత్యతో మొదలైన యుద్ధం మరింత ఉధృతంగా మారింది. నిన్న రాత్రి ఇజ్రాయెల్‌ దళాలు ఇరాన్ పై బాంబులతో అటాక్ చేసింది.

New Update
FotoJet (24)

Dubai marina towar

Dubai marina towar : ఇరాన్‌‌పై అమెరికా, ఇజ్రాయెల్‌‌ దాడులు.. ఇరాన్‌‌ ప్రతిదాడులతో పశ్చిమాసియా రణరంగంలా మారింది. ఇరాన్‌‌ సుప్రీం లీడర్‌‌ ఖమేనీ హత్యతో మొదలైన యుద్ధం మరింత ఉధృతంగా మారింది. నిన్న రాత్రి ఇజ్రాయెల్‌ దళాలు ఇరాన్ పై బాంబులతో అటాక్ చేసింది. అయినా ఇరాన్ ఏ మాత్రం వెనక్కు తగ్గడం లేదు. కాగా తమ పొరుగుదేశాలపై దాడులు ఆపేస్తామని ప్రకటించిన ఇరాన్‌ మాట తప్పింది. గల్ఫ్ దేశాలను ఇరాన్‌ ఊచకోత కోస్తుంది. ఇరాన్ రాత్రంతా గల్ఫ్‌ దేశాలపై మిస్సైళ్ల వర్షం కురిపించింది. దుబాయ్‌లోని మెరినా టవర్‌పై ఇరాన్‌ దాడి చేసింది. ఈ దాడిలో మెరినా టవర్‌లోని ఓ ఎత్తైన బిల్డింగ్‌ను మిస్సైల్స్ శకలాలు తాకాయి. దీంతో బిల్డింగ్‌లో ఒక్కసారిగా దట్టమైన పొగలు కమ్ముకున్నాయి. భయంతో స్థానికులు పరుగులు తీశారు.

దుబాయ్‌పై 16 బాలిస్టిక్ మిస్సైల్స్‌..121 డ్రోన్లతో ఇరాన్‌ విరుచుకుపడింది. దీంతో అప్రమత్తమైన దుబాయ్‌ ఆర్మీ15 మిస్సైల్స్, 119 డ్రోన్లను కూల్చేసింది. మరోవైపు దుబాయ్ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్‌ను ఇరాన్ మరోసారి లక్ష్యంగా చేసుకుంది. డ్రోన్లు, మిస్సైళ్లతో  తీవ్ర స్థాయిలో దాడి చేయడంతో ఎయిర్‌పోర్ట్ పరిసరాల్లో దట్టమైన పొగ కమ్ముకుంది. ఈ ఘటనతో తాత్కాలికంగా విమానాల రాకపోకల అంతరాయం ఏర్పడింది, కొన్ని విమానాలను దారి మళ్లించారు. ఆపరేషన్లు కొంత సమయం పాటు నిలిచిపోయినట్లు తెలిసింది.నిన్న ఉదయం దుబాయ్‌ ఎయిర్‌పోర్ట్‌పైనా ఇరాన్ దాడి చేసింది. అయితే ఇరాన్ డ్రోన్‌లను దుబాయ్‌ గాల్లోనే పేల్చివేసింది. ఈ దాడుల వెనుక అమెరికా, ఇజ్రాయెల్ బలగాలే తమ లక్ష్యమని ఇరాన్ స్పష్టం చేసింది. ప్రస్తుతం దుబాయ్ ఎయిర్‌పోర్ట్ నుండి విమాన సేవలు తిరిగి ప్రారంభమయ్యాయి.

అదే సమయంలో సౌదీ అరేబియాపైనా ఇరాన్‌ 15 డ్రోన్లతో దాడి చేసింది.కువైట్‌లోని ఆయిల్ ట్యాంకర్‌ కర్మాగరంపైనా ఇరాన్ దాడులు చేసింది. అలాగే బహ్రెయిన్‌లోని అమెరికా వార్ హౌస్‌పై..-- మిస్సైళ్లు, డ్రైన్లతో ఇరాన్‌ విరుచుకుపడుతుంది. ఖతర్‌పైనా 10 బాలిస్టిక్ మిస్సైల్స్, 2 క్రూయిజ్‌ మిస్సైల్స్‌తో ఇరాన్ దాడి చేసింది. అలాగే-- బాగ్దాద్‌పైనా ఇరాన్ భీకర దాడులు చేసింది.

ఖమేనీ కుమారుడికి గాయాలు ?

 ఇజ్రాయెల్‌ వాయుసేన జరిపిన దాడుల్లో  ఇరాన్ మాజీ సుప్రీం లీడర్ అయతొల్లా అలీ ఖమేనీ కుమారుడు కూడా ఇజ్రాయెల్ వాయుసేన జరిపిన తొలి దాడుల్లో గాయపడినట్టు తెలుస్తోంది. ఫిబ్రవరి 26న ఇరాన్‌పై ఆపరేషన్ లయన్స్ రోర్ పేరుతో ఇజ్రాయెల్ వాయుసేన దాడులు చేసిన విషయం తెలిసిందే. ఈ దాడుల్లో సుప్రీం లీడర్ అయతొల్లా అలీ ఖమేనీ మరణించిన విషయం కూడా తెలిసిందే.రు. ఆ దాడుల్లో ఆయన కుమారుడు ముజ్తబా హుస్సేనీ ఖమేనీ గాయపడినట్టు తెలుస్తోంది.ఈ దాడిలో 40 మంది కిలక నేతలు మరణించారు. అయితే మజ్తబా మాత్రం ప్రాణాలతో బయటపడ్డారట.అయితే ఆ దాడుల్లో మజ్తబా భార్య జహ్రా ప్రాణాలు కోల్పోయారు. అయితే దీనిపై క్లారిటీ రావలసి ఉంది.
 
 

Advertisment
తాజా కథనాలు