USA: కలలు కల్లలుగానే మిగిలిపోతాయా..ఆందోళనలో అమెరికా విద్యార్థులు

అమెరికా అధ్యక్షుడు ట్రంప్ మరో బాంబ్ పేల్చనున్నట్లు తెలుస్తోంది. హెచ్‌-1బీ వీసా జారీకి కీలకమైన ఆప్షనల్‌ ప్రాక్టికల్‌ ట్రైనింగ్‌ ఓపీటీని రద్దు చేసే యోచనలో ఉన్నారని చెబుతున్నారు. అదే కనుక నిజమైతే అమెరికాలో చదువుకుంటున్న విద్యార్థులపై తీవ్ర ప్రభావం పడనుంది. 

New Update
usa

Students In USA

అమెరికాలో చదువుకుంటున్న విద్యార్థుల కలలన్నీ కల్లలుగానే మిగిలిపోనున్నాయా అంటే అవుననే అంటున్నారు. ఇప్పటికే అన్ని రకాలుగా కట్టుదిట్టం చేసేసి, రూల్స్ పెట్టేసిన ట్రంప్ ఇప్పుడు ఓపీటీ విధాన్ని కూడా రద్దు చేయనున్నారని తెలుస్తోంది. ఇది కనుక పోతే అమెరికాలో చదువుకుని ఇక్కడే సెటిల్ అవ్వాలనుకుంటున్న విద్యార్థులకు పెద్ద దెబ్బ తగిలినట్టు అవుతుంది. ముఖ్యంగా ఇక్కడ స్టెమ్ కోర్సులు చేస్తున్న విద్యార్థులపై ఓపీటీ రద్దు ప్రతికూల ప్రభావం చూపనుంది. ఓపీటీని ముగించాలని కోరుతూ అమెరికా కాంగ్రెస్‌లో ప్రవేశపెట్టిన కొత్త బిల్లు వారిలో ఆందోళన రేపుతోంది.

ఓపీటీ అంటే ఏంటి?

అమెరికాలో చదువుకోవడానికి వచ్చే విద్యార్థులు..చదువు అయిపోయాక వృత్తి పరమైన అనుభవాన్ని పొందడానికి, దీర్ఘకాలిక ఉపాధి వీసాల కిద మారడానికి ఓపీటీ పై ఆధారపడతారు. దీనిపై అక్కడ వేలాది మంది ఇప్పటికే ఆధారపడి ఉన్నారు. ఓపీటీ అంటే ఆప్షనల్‌ ప్రాక్టికల్‌ ట్రైనింగ్‌. దీని ద్వారా వారు కొత్త కోర్సులు చేస్తారు. దీనిని వారు ఎఫ్ 1 వీసా మీదనే చేస్తారు . ఎఫ్‌-1 వీసాలపై ఉన్న విదేశీ విద్యార్థులు తమ చదువుకు సంబంధించిన రంగాల్లో 12 నెలల వరకూ పని చేయడానికి ఓపీటీ అనుమతిస్తుంది. స్టెమ్‌ గ్రాడ్యుయేట్లకు అయితే ఈ గడువు మరో 24 నెలలు అదనంగా పొడిగించుకోవచ్చును. దీంతో వారు చదువు అయ్యాక కూడా మూడేళ్లు అమెరికాలో ఉండొచ్చును. హెచ్‌-1బీ వీసా కోసం దరఖాస్తు చేసే సమయంలో ఈ పని అనుభవం వారికి ఎంతగానో ఉపయోగపడుతుంది. హెచ్ 1 వచ్చాక మరో ఆరేళ్లు ఉద్యోగం చేసుకోవచ్చును. 

అమెరికాలో చదివిన అందరికీ వెంటనే ఉద్యోగాలు వచ్చేయవు. మంచి ఉద్యోగం రావడానికి కాస్త టైమ్ పడుతుంది. ఈలోపు ఖాళీగా ఉండకుండా ఈ ట్రైనింగ్ చేస్తుంటారు. ఇప్పుడు ఇది కనుక రద్దు అయితే వేలాది మంది వెనక్కు తిరిగి వచ్చేయాల్సి ఉంటుంది. 2023-24 విద్యా సంవత్సరంలో భారత్‌కు చెందిన 3,31,602 మంది విద్యార్థులు అమెరికాలో విద్యనభ్యసిస్తున్నారని నివేదికలు చెబుతున్నాయి. అంతకుముందు సంవత్సరంతో పోలిస్తే ఇది 23% ఎక్కువ. వీరిలో దాదాపుగా  97,556 మంది ఓపీటీలో ఉన్నవారే. ఇప్పుడు ఓపీటీ వ్యతిరేక బిల్లు తెరమీదకు రావడంతో ఎఫ్ 1, ఎం 1 విసీదారులు అర్జంటుగా ఉద్యోగాలకు అప్లై చేసుకుంటున్నారు. భారతీయ టెక్ సంస్థలకు అప్లికేషన్లతో పోటెత్తుతున్నారు. కంపెనీలు కూడా విదేశీ విద్యార్థులు తక్షణం అమెరికాను వీడాల్సి రావచ్చని హెచ్చరిస్తున్నాయి. కాబట్టి ఓపీటీ హోదాలో ఉన్న విద్యార్థులు వెంటనే హెచ్‌-1బీకి మారాలని, లేదా ఇతర దేశాల్లో అవకాశాలను పరిశీలించాలని సూచిస్తున్నారు.ఒకవేళ విద్యార్థులు చదువు అయిన వెంటనే తమ దేశాలకు వెళ్ళిపోవాల్సి వస్తే కనుక వారిపై ఆర్థిక భారం పెరుగుతుంది. ఇక్కడ చదువు కోసం బోలెడంత లోన్లు పెట్టుకుని వస్తారు. అవి ఇక్కడ ఉద్యోగాలు చేస్తేనే తీర్చగలరు. అలాగే ఇప్పుడు పరిస్థితుల్లో ఒకసారి అమెరికా విడిచి వెళితే తిరిగి రావడం కష్టం అని కూడా వేసవి సెలవుల్లో స్వదేశాలకు వెళ్లొద్దని కార్నెల్‌, కొలంబియా, యేల్‌ తదితర ప్రతిష్ఠాత్మక సంస్థలు విదేశీ విద్యార్థులకు అనధికారికంగా చెబుతున్నాయి. 

today-latest-news-in-telugu | usa | students | indians 

Also Read: Chiru Family: సింగపూర్ కు బయలుదేరిన చిరంజీవి దంపతులు

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు