అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌కు ప్రధాని మోదీ ఫోన్‌కాల్

ఇండియా ప్రధాని మోదీ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌కు సోమవారం కాల్ చేసి మాట్లాడారు. అమెరికా, భారత్‌ల ద్వైపాక్షిక సంబంధాల గురించి చర్చించారు. ఇల్లీగల్ ఇమిగ్రేషన్, అమెరికాలో భారతీయుల గురించి మోదీ, ట్రంప్‌తో మాట్లాడారు.

author-image
By K Mohan
New Update
_US President Trump

_US President Trump Photograph: (_US President Trump)

అధ్యక్ష బాధ్యతలు స్వీకరించాక డొనాల్డ్ ట్రంప్‌తో ఇండియా ప్రధాని మోదీ ఫస్ట్ మాట్లాడారు. నరేంద్ర మోదీ సోమవారం ట్రంప్‌కు కాల్ చేసి అమెరికా, భారత్‌ల ద్వైపాక్షిక సంబంధాల గురించి చర్చించారు. అమెరికాలో అక్రమ వలసదారులపై ట్రంప్ గవర్నమెంట్ ఉక్కుపాదం మోపుతున్న విషయం తెలిసింది. అమెరికాలో ఉన్న ఇండియన్స్ గురించి మోదీ ట్రంప్‌కు కాల్ చేసి మాట్లాడారు.

అక్రమ ఇమ్మిగ్రేషన్ సమస్యపై ఇరు దేశాల మధ్య చర్చలు జరుగుతున్న నేపథ్యంలో ఈ పరిణామం చోటు చేసుకుంది. అక్రమ వలసలను తాము వ్యతిరేకిస్తున్నామని, అమెరికాలో అక్రమంగా ఉంటున్న వారిలో భాయతీయులు ఉంటే వారిని వెనక్కి తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నామని భారత్ శుక్రవారం తెలిపింది. ప్రపంచశాంతి కోసం అమెరికా, భారత్ కలిసి పనిచేస్తాయని మోదీ ఎక్స్ వేదికగా తెలిపారు. ఇరు దేశాల ప్రయోజనాల కోసం పని చేస్తున్నామని ఇండియా ప్రధానమంత్రి అధికారిక X అకౌంట్‌లో పేర్కొన్నారు.

Advertisment
తాజా కథనాలు