India’s Richest Billionaires : ‘ప్రపంచ కుబేరుల జాబితా'లో మన స్థానం ఎంతో తెలుసా?

 ప్రపంచ కుబేరుల జాబితాలో మరోసారి మనదేశం తన స్థానాన్ని నిలుపుకుంది. ఈసారి కూడా మనదేశం మూడోస్థానంలో నిలిచింది. ఇక వ్యక్తిగతంగా రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ చైర్మన్‌ ముకేశ్‌ అంబానీ దేశంలోనే అగ్రస్థానంలో నిలిచారు. ఆసియాలోనే అత్యంత సంపన్నుడిగా ముకేశ్‌ నిలిచారు.

New Update
FotoJet (30)

'World's Richest List

India’s Richest Billionaires : ప్రపంచ కుబేరుల జాబితాలో మరోసారి మనదేశం తన స్థానాన్ని నిలుపుకుంది. ఈసారి కూడా మనదేశం మూడోస్థానంలో నిలిచింది. ఇక వ్యక్తిగతంగా రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ చైర్మన్‌ ముకేశ్‌ అంబానీ దేశంలోనే అగ్రస్థానంలో నిలిచారు. దేశంలోనే కాదు ఆసియాలోనే అత్యంత సంపన్నుడిగా ముకేశ్‌ నిలిచారు. ఇక ప్రపంచ వ్యాప్తంగా చూస్తే మాత్రం ముకేశ్‌ది 17వ స్థానం. అంబానీ కుటుంబ సంపద గడిచిన ఏడాదితో పోలిస్తే 9 శాతం వృద్ధి చెంది రూ.9.8 లక్షల కోట్లకు  చేరుకుంది.  భారతీయ పారిశ్రామిక వేత్తలు అన్నిరంగాల్లోనూ ప్రపంచంతో పోటీ పడుతున్నారని హురున్‌ ఇండియా గ్లోబల్‌ రిచ్‌ లిస్ట్‌ -2026 వెల్లడించింది. 

ఇక ప్రపంచవ్యాప్తంగా కృత్రిమ మేధ (ఏఐ) విప్లవం అత్యంత వేగంగా విస్తరిస్తున్న ప్రస్తుత తరుణంలో ఆయా రంగల్లో  కొత్త బిలియనీర్లు వేగంగా పుట్టుకొస్తున్నారు. ప్రపంచ బిలియనీర్లలో కృత్రిమ మేధ (ఏఐ) కంపెనీలకు చెందిన వారు ఏకంగా114 మంది ఉన్నారంటే ఏఐ విప్లవం ఎంతగా వృద్ధి చెందితో అర్థం చేసుకోవచ్చు. ఏఐతో ప్రపంచ వ్యాప్తంగా సంపద సృష్టించే వారి సంఖ్య పెరగుతూనే ఉంది. చరిత్రలో తొలిసారిగా 1 బిలియన్‌ డాలర్ల (రూ.9100 కోట్ల)కు పైగా సంపద కలిగిన వారి సంఖ్య 4,020కు చేరుకుంది. ఇందులో భారతీయులు కుబేరుల సంఖ్య 308. అంతేకాదు మనదేశం నుంచి కుబేరులుగా ఎదిగిన వారిలో కొత్తగా 24 మంది ఈ జాబితాలో చేరారు. భారత కుబేరుల సంపద విలువ గత ఏడాదితో పోలిస్తే10% వృద్ధి చెంది రూ.112.6 లక్షల కోట్లకు చేరుకుంది.

Also Read: నేపాల్ కొత్త పీఎంగా ర్యాపర్.. భారత్ కు ఇబ్బందేనా?

అదే సమయంలో గతంలో అగ్రస్థానంలో ఉన్న అమెరికా కుబేరుల జాబితాలో ఈసారి రెండో స్థానానికి పరిమితమైంది. 1,110 మంది కుబేరులతో చైనా అమెరికాను వెనక్కి నెట్టి అగ్రస్థానంలో నిలిచింది. 1,000 మంది బిలియనీర్లతో యూఎస్‌ రెండో స్థానంలో నిలవగా 308 మందితో  భారత్‌ మూడో స్థానంలో ఉంది. ప్రపంచ వ్యాప్తంగా గడచిన ఏడాది కాలంలో 578 మంది కొత్త బిలియనీర్లు హురున్‌ జాబితాలో చేరడం విశేషం. మనదేశంలో ఈ లిస్టులో కొత్తగా 57 మందికి చోటు దక్కగా, గత ఏడాది ఈ జాబితాలో ఉన్న 27 మంది తమ స్థానాన్ని నిలుపుకోలేకపోయారు. నగరాల వారిగా చూస్తే  ముంబై నుంచి అత్యధికంగా 95 మంది బిలియనీర్లకు చోటు దక్కగా, ఢిల్లీ (64 మంది), బెంగళూరు (30 మంది) తో వరుసగా మూడు స్థానాల్లో నిలిచాయి. భారతీయ బిలియనీర్లలో  మహిళలు సైతం చోటు దక్కించుకున్నారు. సంఖ్యపరంగా 23 మందికి జాబితాలో చోటు దక్కగా వారి మొత్తం సంపద రూ.9.8 లక్షల కోట్లుగా ఉంది. 

ఇక భారతీయ సంపన్నుల సగటు వయసు 67 ఏళ్లుగా ఉండగా వారి ఆదాయం రూ.36,570 కోట్లుగా ఉంది. కాగా, ఓయో వ్యవస్థాపకుడు రితేష్‌ అగర్వాల్‌ 32 ఏళ్ల వయసుతో అత్యంత చిన్న వయసు సంపన్నుగా నిలిచాడు. ఆయన నిఖర ఆదాయం రూ.14,440 కోట్లుగా ఉంది. తెలుగువారి విషయానికి వస్తే మనవాళ్లు పదిమంది ఈ జాబితాలో చోటు దక్కించుకోగా దివీస్‌ లేబొరేటరీస్‌ చైర్మన్‌ మురళీ దివి అగ్రస్థానంలో నిలిచారు.
 
ఇక టెస్లా, స్పేస్‌ఎక్స్‌ అధినేత ఎలాన్‌ మస్క్‌(Elon Musk) సంపద గతంతో పోలిస్తే 89% పెరిగి, 792 బిలియన్‌ డాలర్లకు (రూ.72 లక్షల కోట్లకు పైగా) చేరుకోగా వరుసగా ఆరేళ్లలో అయిదోసారి ఆయన ప్రపంచ అత్యంత సంపన్నుడిగా నిలిచాడు. 300 బిలియన్‌ డాలర్లతో రెండోస్థానంలో అమెజాన్‌ వ్యవస్థాపకుడు జెఫ్‌ బెజోస్‌ నిలవగా  ఆల్ఫాబెట్‌కు చెందిన లారీ పేజ్‌ 271 బిలియన్‌ డాలర్లతో మూడోస్థానంలో నిలిచారు. కృత్రిమ మేధతో  ఎన్విడియా సీఈఓ జెన్సన్‌ హువాంగ్‌ తొలిసారిగా ప్రపంచ కుబేరుల జాబితాలో టాప్-10 లో నిలిచారు.  ఆయన సంపద 172 బిలియన్‌ డాలర్లుగా ఉంది.

Also Read: ఇవేం ఎండలు బాబోయ్.. ఇక బతికి బయటపడటం కష్టమే!

దేశంలో ఎవరెవరంటే?

భారతీయ కుబేరుల జాబితా కేవలం ఐటీ, ఫార్మా, ఏఐ రంగాలకే పరిమతం కాలేదు. కాదేదీ సంపదకు అనర్హం అన్నట్లు అన్ని రంగాల్లోనూ కుబేరులు పెరిగారు. వారిలో  బాలీవుడ్‌ హీరో షారుఖ్‌ ఖాన్(Shah Rukh Khan), ఫిజిక్స్‌ వాలా వ్యవస్థాపకులు అలఖ్‌ పాండే, ప్రతీక్‌ మహేశ్వరి, మెరిల్‌ లైఫ్‌ సైన్సెస్‌కు చెందిన షాహిద్‌ బిలాఖియా, ఎం3ఎం ఇండియాకు బసంత్‌ బన్సాలు ఇలా పలు రంగాల వారు కుబేరులా జాబితాలో చేరారు. 
  
ముకేశ్‌ అంబానీ(Mukesh Ambani) తర్వాత వరుసగా రూ.7.5 లక్షల కోట్లతో గౌతమ్‌ అదానీ ఫ్యామిలీ, రూ.3.2 లక్షల కోట్ల తో హెచ్‌సీఎల్‌ టెక్‌ చైర్మన్‌ రోష్నీ నాడార్‌ కుటుంబం వరుసగా 2,3 స్థానాల్లో ఉండగా సీరమ్‌ ఇన్‌స్టిట్యూట్‌ స్థాపకుడు సైరస్‌ పూనావాలా (రూ.3 లక్షల కోట్లు), ఆదిత్య బిర్లా గ్రూప్‌ అధిపతి కుమార మంగళం బిర్లా (రూ.2.5 లక్షల కోట్లు) లు తరువాతి స్థానం(4,5) లో ఉన్నారు. ఇక ఆ తరువాతి స్థానాల్లో  సన్‌ఫార్మా దిలీప్‌ సంఘ్వీ, విప్రో వ్యవస్థాపకులు అజీమ్‌ ప్రేమ్‌జీ, నీరజ్‌ బజాజ్‌ ఫ్యామిలీ, ఆశోక్‌ హిందుజా కుటుంబం, డీమార్ట్‌ ఫౌండర్‌ రాధాకిషన్‌ దమానీ వరుసగా 6 నుంచి 10 వరకు స్థానాల్లో నిలిచారు.   

మనవాళ్లేం తక్కువ కాదు...

]ప్రపంచ కుబేరుల జాబితాలో తెలుగువారేం తీసిపోలేదు.ఇందులో.. మురళి దివి (దివీస్‌ లేబొరేటరీస్‌) మొదటి స్థానంలో నిలవగా, పి.పిచ్చి రెడ్డి, పి.వి. కృష్ణా రెడ్డి (మేఘా ఇంజినీరింగ్‌ అండ్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌) రెండోస్థానంలో ఉన్నారు. ఇక వరుసగా, జీఎం రావు (జీఎంఆర్‌), బి.పార్థసారథి రెడ్డి (హెటిరో), పీవీ రామ్‌ప్రసాద్‌ రెడ్డి (అరబిందో ఫార్మా), సురేందర్‌ పాల్‌ సింగ్‌ సులజ (ప్రీమియర్‌ ఎనర్జీస్‌), ఎం.సత్యనారాయణ రెడ్డి (ఎంఎస్‌ఎన్‌ లేబొరేటరీస్‌), సి.వెంకటేశ్వర రెడ్డి, ఎస్‌.సుబ్రమణ్యం రెడ్డి (అపర్ణ కన్‌స్ట్రక్షన్స్‌ అండ్‌ ఎస్టేట్స్‌), రామేశ్వర రావు జూపల్లి (మైహోం ఇండస్ట్రీస్‌), కె.సతీష్‌ రెడ్డి (డాక్డర్‌ రెడ్డీస్‌), సి.సత్యనారాయణ (లారస్‌ ల్యాబ్స్‌), జీవీ ప్రసాద్‌ (డాక్టర్‌ రెడ్డీస్‌), మహిమా దాట్ల (బయోలాజికల్‌ ఇ.), జి.రవీంద్ర రావు (యశోదా హెల్త్‌కేర్‌ సర్వీసెస్‌), శ్రీనివాస్‌ బొమ్మడిదల (జీఎంఆర్‌), ప్రతాప్‌ రెడ్డి (అపోలో హాస్పిటల్స్‌ ఎంటర్‌ప్రైజ్‌), ఎన్‌.విశ్వేశ్వర రెడ్డి (షిర్డీ సాయి ఎలక్ట్రికల్స్‌), ఎ.అయోధ్య రామి రెడ్డి (రాంకీ గ్రూపు), వెంకటేశ్వర్లు జాస్తి (సువెన్‌ ఫార్మా), బి.భాస్కర రావు (కృష్ణా ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మెడికల్‌ సైన్సెస్‌)లు కుబేరుల జాబితాలో చోటు దక్కించుకున్నారు.

Advertisment
తాజా కథనాలు