/rtv/media/media_files/2025/02/03/18Pg9f430aYZFomd7wxu.jpg)
chandrika tandon Photograph: (chandrika tandon)
అమెరికాలోని లాస్ ఏంజెలెస్‌లో ఆదివారం గ్రామీ అవార్డుల ప్రదానోత్సవం ఘనంగా నిర్వహించారు. వరల్డ్ వైడ్ ఫేమస్ సింగర్స్, మ్యూజిక్ డైరెక్టర్స్ ఈ వేడుకల్లో సందడి చేశారు. ప్రపంచ సంగీత రంగంలో ప్రతిష్టాత్మకంగా భావించే ఈ అవార్డ్‌కు చెన్నైలో పుట్టి పెరిగిన ఓ మహిళా సింగర్ ఎంపికైంది. భారతీయ సంతతికి చెందిన అమెరికన్ సింగర్ చంద్రికా టాండన్‌కు ఈ గ్రామీ అవార్డ్ దక్కింది. ఆమె క్రియేట్ చేసిన త్రివేణి ఆల్బమ్ బెస్ట్ న్యూ ఏజ్ యాంబియంట్ ఆర్ చాంట్ ఆల్బమ్‌గా ఈ అవార్డ్ సొంతం చేసుకుంది.
Congrats @wouterkellerman Eru Matsumoto and Chandrika Tandon - Grammy win for “Triveni”: Best New Age, Ambient or Chant Album #Grammys #GRAMMYS2025 pic.twitter.com/9su1DJLrbO
— Jennifer Su (Jen Su) (@jennifer_su) February 2, 2025
ఇది కూడా చూడండి: India vs England 5th T20I: టీమిండియా ఘన విజయం.. ఇంగ్లండ్ చిత్తు చిత్తు!
చంద్రికకు ఇదివరకే గ్రామీ అవార్డ్ వచ్చింది. ఇది ఆమె రెండో గ్రామీ అవార్డ్. చైన్నైలో పెరిగిన చంద్రిక టాండన్ అమెరికాలో సెట్టిలై సింగర్, వ్యాపారవేత్తగా రాణిస్తు్న్నారు. అమెరికా మాజీ అధ్యక్షుడు జిమ్మీ కార్టర్‌కు కూడా గ్రామీ అవార్డ్ దక్కింది. జిమ్మీ రాసిన ది లాస్ట్ సండేస్ ఆన్ ప్లేన్స్ బెస్ట్ ఆడియోబుక్ నేరేషన్ విభాగంలో ఎంపికైంది. ఆయన ఇటీవల చనిపోగా.. జిమ్మీ మనవడు జేసన్ కార్టర్ ఈ అవార్డ్‌ను తీసుకున్నాడు.ఇటీవల కాలిఫోర్నియా రాష్ట్రంలో కార్చిచ్చు సృష్టించిన బీభత్సం గురించి తెలిసిందే. లాస్ ఏంజెలెస్ మొత్తం కాలి బూడిదైంది. ఆ కార్చి్చ్చులో ప్రాణాలు కోల్పోయిన బాధితులకు గ్రామీ అవార్డుల వేడుకల్లో సంతాపం తెలిపారు.
ఇది కూడా చూడండి: Israel: నెతన్యాహు సతీమణి పై నేర విచారణ!