/rtv/media/media_files/2025/03/07/3IXhpAGAiuu5D5sTqZFC.jpg)
H-4 dependent Visa
అమెరికాలో స్వీయ బహిష్కరణ ముప్పు పెద్ద దుమారం రేపుతోంది. ఇంతకు ముందు హెచ్ 4 వీసా మీద అమెరికాకు వచ్చిన మైనర్లకు 21ఏళ్ల వయసు రావడంతో ఆందోళన మొదలైంది. అమెరికా ఇమ్మిగ్రేషన్స్ రూల్స్ ప్రకారం ఇక మీదట వీరంతా హెచ్-1బీ వీసాదారులైన తల్లిదండ్రులపై ఆధారపడిన వారిగా అర్హత కోల్పోతారు. దీంతో వారంతా అమెరికాలో ఉండడానికి అర్హతను కోల్పోతారు.
స్వీయ బహిష్కరణ..
మైనర్లుగా వచ్చిన వారు 21 ఏళ్ళ వరకు హెచ్ 1 బీ వీసాదారులైన తల్లిదండ్రులపై ఆధారపడి ఉండవచ్చును. ఆ తరువాత వాళ్ళు మరో వీసా హోదాకు మారవలసి ఉంటుంది. దీనికి రెండేళ్లు గడువు ఉంటుంది. ఇప్పటి వరకు ఇందులో ఎలాంటి సమస్యా లేదు. అయితే ట్రంప్ వచ్చాక అమెరికా ఇమ్మిగ్రేషన్ రూల్స్ అన్నీ మారాయి. ఈ క్రమంలో వీరి భవిష్యత్తు ప్రశ్నార్ధకంగా మారింది. గ్రీన్‌కార్డు దరఖాస్తుల్లో బ్యాక్‌లాగ్ భారీగా ఉండటం కూడా భారతీయ వలసదారులపై ప్రతికూల ప్రభావం చూపిస్తోంది. 2023 మార్చి నాటికి డిపెండెంట్ వీసా గడువు ముగింపు దశకు చేరుకున్న భారతీయుల పిల్లలు దాదాపు 1.35 లక్షల మంది వరకూ ఉన్నారు. ఇప్పుడు వీరికి స్టూడెంట్ వీసా అయిన ఎఫ్ 1 తీసుకోవచ్చును. అయితే దీని వలన వీరు అమెరికా యూనివర్శిటీలు ఇచ్చే స్కాలర్ షిప్ లను కోల్పోతారు. బయట దేశాల నుంచి విద్యార్థులు ఎలా అయితే బోలెడు ఫీజులు కడుతూ చదువుకుంటారో అలానే చదువుకోవాల్సి ఉంటుంది. అమెరికాలో సెటిల్ అవ్వాలనుకుంటున్న వారికి పెద్ద దెబ్బే అవుతుంది.
Also Read: China: భారత్ స్నేహం కోరుతున్న చైనా..ట్రంప్ సుంకాల దెబ్బ ప్రభావం