/rtv/media/media_files/2025/03/07/UcxI2R1KwdOoDMR78DTp.jpg)
India-china
Trump-China: అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ముట్టించిన సుంకాల సెగ ప్రపంచ దేశాల్లో బాగా అగ్గి రాజుకుంది. దీనివలన తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఛైనాపై ఇప్పటికే 20 శాతం అధిక సుంకాలను బాదిన ట్రంప్...ఏప్రిల్ 2 నుంచి భారత్ మరికొన్ని ప్రతీకార సుంకాలను అమల్లోకి తీసుకువస్తామని చెప్పారు. ఈ క్రమంలో చైనా భారత స్నేహాన్ని కోరుతోంది. చైనా, భారతదేశం భాగస్వాములుగా ఉండి ఒకరి విజయానికి ఒకరు దోహదపడాలని చైనా విదేశాంగ మంత్రి వాంగ్ యి అన్నారు. రెండు దేశాలు కలవడమే సరైన ఎంపిక అని ఆయన అన్నారు. ఒకరి మార్గంలో మరొకరు అడ్డంకులు సృష్టించుకునే బదులు కలిసి ముందు సాగడం మంచిదంటూ వ్యాఖ్యలు చేశారు. ఇలా చేయడం వలన రెండు దేశాలు మంచి ప్రయోజనాలు పొందవచ్చంటూ నీతి వాక్యాలు చెప్పారు.
Also Read: Singer Kalpana: నా భర్తతో నాకేం గొడవలు లేవు..సింగర్ కల్పన వీడియో
Also Read: ముంబైపై గుజరాతీల కుట్ర.. RSS నేతపై దేశద్రోహం కేసు: మాజీ సీఎం సంచలనం!
రెండు దేశాలకూ మంచిది..
భారత్, చైనా చేతులు కలిపితే అంతర్జాతీయంగా ఎక్కువ ప్రభావం చూపించవచ్చని...గ్లోబల్ సౌత్ మరింత బలంగా మారే అవకాశం ఉంటుందని చైనా విదేశాంగ మంత్రి వాంగ్ యి అన్నారు. చర్చల ద్వారా పరిష్కరించలేని సమస్య ఏదీ లేదని, సహకారం లేకుండా ఏ లక్ష్యాన్ని సాధించలేమని ఆయన అన్నారు. రెండు దేశాలు కలిసి ప్రపంచాన్ని మెరుగైన ప్రదేశంగా మార్చగలవు అంటూ మాట్లాడారు. ఇంతకాలం ఇండియా మీద కాలు దువ్విన చైనా ట్రంప్ దెబ్బకు స్వరం మార్చింది. ఇప్పుడు అమెరికాను ఎదుర్కోవడానికి భారత్ అవసరం వచ్చిందని విమర్శకులు అంటున్నారు. మరో వైపు అమెరికాలోని చైనా రాయబార కార్యాలయం ఒక ప్రకటన విడుదల చేసింది. అమెరికా యుద్ధం కోరుకుంటే...దానికి మేము సిద్ధంగా ఉన్నామని తెలిపింది. అది వాణిజ్య యుద్ధం అయినా లేదా మరేదైనా యుద్ధం అయినా సరే అంటోంది. మేము చివరి వరకు పోరాడటానికి సిద్ధంగా ఉన్నామని తేల్చి చెప్పింది.