Bangladesh: షేక్ హసీనాను అప్పగించండి.. రెచ్చిపోతున్న బంగ్లాదేశ్‌ తీవ్రవాదులు, రాయబార కార్యాలయంపై దాడులు

బంగ్లాదేశ్‌ రాజధాని ఢాకాలో ఉద్రిక్త పరిస్థితులు చోటుచేసుకున్నాయి. అక్కడి భారత హైకమిషన్ సమీపంలో ఛాందసవాదులు నిరసనలకు దిగారు. హసీనాకు ఆశ్రయం ఇచ్చే భారత్‌ను విచ్ఛిన్నం చేయండి అంటూ నినాదాలు చేశారు.

New Update
India summons Bangladesh envoy over security concerns in Dhaka

India summons Bangladesh envoy over security concerns in Dhaka

బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనా ప్రస్తుతం భారత్‌లో ఆశ్రయం పొందుతున్న సంగతి తెలిసిందే. ఆమెను తమకు అప్పగించాలని ఇప్పటికే బంగ్లా ప్రభుత్వం భారత్‌కు లేఖ రాసింది. కానీ భారత్‌ షేక్‌ హసీనాను అప్పగించకూడదని భావిస్తోంది. ఈ క్రమంలోనే తాజాగా బంగ్లాదేశ్‌ రాజధాని ఢాకాలో ఉద్రిక్త పరిస్థితులు చోటుచేసుకున్నాయి. అక్కడి భారత హైకమిషన్ సమీపంలో ఛాందసవాదులు నిరసనలకు దిగారు. హసీనాకు ఆశ్రయం ఇచ్చే భారత్‌ను విచ్ఛిన్నం చేయండి అంటూ నినాదాలు చేశారు. రంగంలోకి దిగిన పోలీసులు నిరసనాకారులను చెదరగొట్టారు. దీనికి సంబంధించి వీడియోలు కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అక్కడ చెలరేగిన ఉద్రిక్త పరిస్థితులపై కేంద్ర విదేశాంగ శాఖ సీరియస్ అయ్యింది. బంగ్లాదేశ్‌ హైకమిషనర్ రియాజ్‌ హమీదుల్లాకు సమన్లు జారీ చేసింది. 

Also Read: మా నాన్నను జైల్లో చిత్రహింసలు పెడుతున్నారు.. ఇమ్రాన్ ఖాన్ కొడుకులు తీవ్ర ఆవేదన

జులై ఓయిక్య అనే సంస్థకు చెందిన ఛాందసవాదులు ఈ నిరసనలకు పిలుపునిచ్చారు. భారత హై కమిషన్ కార్యలయంలోకి వెళ్లేందుకు ప్రయత్నించారు. పోలీసులు బారికేట్లు ఏర్పాటు చేయగా వాటిని తోసుకుంటూ ముందుకెళ్లేందుకు యత్నించారు. దీంతో ఆ ప్రాంతంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఇదిలాఉండగా గతేడాది బంగ్లాదేశ్‌లో అల్లర్లు చెలరేగడంతో మాజీ ప్రధాని షేక్ హసీనా తన పదవికి రాజీనామా చేసి భారత్‌కు తరలివచ్చిన సంగతి తెలిసిందే. ఇప్పటికే బంగ్లాదేశ్‌కు చెందిన అంతర్జాతీయ నేరాల ట్రైబ్యునల్ (ICT) కోర్టు హసీనాకు మరణశిక్ష విధించింది. దీంతో ఆమెను తమ దేశానికి అప్పగించాలని అక్కడి వారు డిమాండ్ చేస్తున్నారు.  

Also read: ఇక నుంచి పది గంటల ముందే ఛార్ట్..రైల్వే కీలక నిర్ణయం

Advertisment
తాజా కథనాలు