Railways: ఇక నుంచి పది గంటల ముందే ఛార్ట్..రైల్వే కీలక నిర్ణయం

ప్రయాణికుల సౌకర్యం కోసం రైల్వే మార్పులు చేసుకుంటూ వస్తోంది. ఇందులో భాగంగా తాజాగా టికెట్ రిజర్వేషన్ చార్ట్ షెడ్యూల్ ను పది గంటల ముందే ఖరారు చేయాలని నిర్ణయించింది. 

New Update
Indian Railways

Indian Railways

టిక్కెట్ రిజర్వేషన్ చార్ట్ ప్రిపరేషన్ షెడ్యూల్‌లో రైల్వే మంత్రిత్వ శాఖ మరోసారి మార్పులు చేసింది. ఇప్పటి వరకు 8 గంటల ముందు పెడుతున్న చార్ట్ ను ఇకపై పది గంటల ముందే ఖరారు చేయాలని నిర్ణయించింది. ప్రయాణాల్లో అనిశ్చితి తొలగించడానికి ఈ నిర్ణయం తీసుకున్నామని రైల్వేశాఖ తెలిపింది. దీనికి సంబంధించి షెడ్యూల్ ను రైల్వే బోర్డు అప్ డేట్ చేసింది. 10 గంటల ముందే టికెట్‌ కన్ఫర్మ్ అయ్యింది? లేనిదీ? తెలుసుకోవడం ద్వారా ప్రయాణానికి ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసుకునే అవకాశం ఉంటుందని చెప్పింది. 

ప్రయాణికుల సౌకర్యం కోసం..

కొత్త షెడ్యూల్ ప్రకారం.. ఉదయం 5 నుంచి మధ్యాహ్నం 2 గంటల మధ్య బయల్దేరే రైళ్లకు రిజర్వేషన్ చార్టు ముందు రోజు రాత్రి 8 గంటలకల్లా ఖరారవుతుంది. అలాగే మధ్యాహ్నం 2.01 నుంచి రాత్రి 11.59 గంటలు; అర్ధరాత్రి 12 నుంచి ఉదయం 5 గంటల మధ్య బయల్దేరే రైళ్లకు కనీసం 10 గంటల ముందు చార్జును సిద్దం చేయాలని రైల్వే బోర్డు స్పష్టం చేసింది.  దీనిపై వెంటనే చర్యలు తీసుకోవాలని అన్ని రైల్వే జోన్లకు బోర్డు లేఖ రాసింది. దీనివల్ల ప్రయాణికుల్లో చివరి నిమిషం ఆందోళనలు తగ్గుతాయని రైల్వే శాఖ చెబుతోంది. ముఖ్యంగా దూరప్రాంతాలకు ప్రయాణించే వారు..ప్రత్యామ్నాయ ఏర్పాటల్ను చేసుకోవడానికి వీలవుతుందని తెలిపింది. 

ఈ వాలెట్ లో డబ్బులు డ్రా చేయలేరు..

ఇప్పటికే తత్కాల్ టిక్కెట్ బుకింగ్‌కు ఆధార్ అథెంటిఫికేషన్ తప్పనిసరి చేసింది రైల్వే శాఖ. అలాగే ఐఆర్సీటీసీ ఇ-వాలెట్‌లో డిపాజిట్‌ చేసిన నగదు విత్‌డ్రా చేయడం కుదరదని రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్‌ స్పష్టంచేశారు. దీని ద్వారా కేవలం రైల్ టికెట్లను మాత్రమే బుక్ చేసుకోగలుగుతారని తెలిపారు. ఒకవేళ అకౌంట్ పూర్తిగా క్లోజ్ చేస్తే..దానిలో ఉన్న మొత్తం యూజర్ బ్యాంక్ ఖాతాలోకి వెళిపోతుందని చెప్పారు. ప్రీపెయిడ్‌ పేమెంట్‌ ఇన్‌ స్ట్రుమెంట్స్‌కు సంబంధించి ఆర్బీఐ మార్గదర్శకాలు విత్‌డ్రాకు అనుమతించవని కేంద్ర మంత్రి స్పష్టం చేశారు. 

Advertisment
తాజా కథనాలు