China Military Drill: తైవాన్‌లో చైనా సైనిక విన్యాసాలు.. వారికి స్ట్రాంగ్ వార్నింగ్

తైవాన్ సరిహద్దుల్లో చైనా రెండవ రోజు కూడా భారీ సైనిక విన్యాసాలను కొనసాగిస్తోంది. ఈ విన్యాసాల ఉద్దేశం తైవాన్ వేర్పాటువాద శక్తులకు, వారిని ప్రోత్సహిస్తున్న 'బాహ్య శక్తులకు' స్ట్రాంగ్ వార్నింగ్ పంపడమేనని చైనా స్పష్టం చేసింది. 

New Update
China Military Drill

తైవాన్ సరిహద్దుల్లో చైనా(taiwan-china) రెండవ రోజు కూడా భారీ సైనిక విన్యాసాలను కొనసాగిస్తోంది. ఈ విన్యాసాల ఉద్దేశం తైవాన్ వేర్పాటువాద శక్తులకు, వారిని ప్రోత్సహిస్తున్న 'బాహ్య శక్తులకు' స్ట్రాంగ్ వార్నింగ్ పంపడమేనని చైనా స్పష్టం చేసింది. 

Also Read :  జన నాయగన్‌’ ఈవెంట్‌ రికార్డు..

రెండవ రోజు కొనసాగుతున్న 'జస్టిస్ మిషన్ 2025'

చైనా(China Military Drill) తన ఈస్టర్న్ థియేటర్ కమాండ్ ఆధ్వర్యంలో 'జస్టిస్ మిషన్ 2025' పేరుతో ఈ యుద్ధ విన్యాసాలను నిర్వహిస్తోంది. రెండవ రోజైన మంగళవారం (డిసెంబర్ 30, 2025), చైనా సైన్యం తైవాన్ చుట్టూ వాయుసేన, నౌకాదళం, రాకెట్ ఫోర్స్ యూనిట్లను రంగంలోకి దించింది. ఈ డ్రిల్స్‌లో సముద్ర,  గగనతలంలో లైవ్-ఫైర్ విన్యాసాలు నిర్వహిస్తున్నారు. చైనా రక్షణ మంత్రిత్వ శాఖ ప్రతినిధి జాంగ్ జియావోగాంగ్ మాట్లాడుతూ.. "చైనా కోర్ ప్రయోజనాలను సవాలు చేసే ఏ ప్రయత్నాన్నైనా తాము సహించబోమని, తైవాన్ ద్వారా చైనాను అణచివేయాలని చూస్తున్న దేశాలు తమ భ్రమలను వీడాలని" హెచ్చరించారు.

ఇటీవల అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తైవాన్‌కు సుమారు 11.1 బిలియన్ డాలర్ల విలువైన భారీ ఆయుధ ప్యాకేజీని ప్రకటించారు. ఇది తైవాన్ చరిత్రలోనే అతిపెద్ద ఆయుధ ఒప్పందంగా భావిస్తున్నారు. తైవాన్‌పై దాడి జరిగితే జపాన్ సైన్యం జోక్యం చేసుకోవాల్సి ఉంటుందని జపాన్ ప్రధాని సనాయె తకాయిచి చేసిన వ్యాఖ్యలు బీజింగ్‌ను ఆగ్రహానికి గురిచేశాయి. చైనా చర్యలను తైవాన్ ప్రభుత్వం తీవ్రంగా ఖండించింది. చైనాను "శాంతికి అతిపెద్ద విఘాతకారి" గా తైవాన్ రక్షణ శాఖ అభివర్ణించింది. తైవాన్ తన సైనిక బలగాలను అత్యున్నత అప్రమత్తతలో ఉంచింది.

ఈ విన్యాసాల కారణంగా తైవాన్ జలసంధి మీదుగా వెళ్లే అంతర్జాతీయ విమాన మార్గాలను మళ్లించాల్సి వచ్చింది. దీనివల్ల సుమారు 1,00,000 మంది అంతర్జాతీయ ప్రయాణికులపై ప్రభావం పడింది. దాదాపు 850 అంతర్జాతీయ మరియు 80 దేశీయ విమాన సర్వీసులు రద్దయ్యాయి. చైనా పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ విడుదల చేసిన పోస్టర్లలో Shield of Justice, Smashing Illusion అనే నినాదాలతో బాహ్య శక్తులు తైవాన్ విషయంలో జోక్యం చేసుకుంటే తీవ్ర పరిణామాలు ఉంటాయని పరోక్షంగా హెచ్చరించింది. ఈ పరిణామాలు ఇండో-పసిఫిక్ ప్రాంతంలో మునుపెన్నడూ లేని విధంగా ఉద్రిక్తతలను పెంచాయి.

Also Read :  బంగ్లాదేశ్ మాజీ ప్రధాని కన్నుమూత!

Advertisment
తాజా కథనాలు