రహస్యంగా పాక్ ఆర్మీ చీఫ్ కుమార్తె పెళ్లి.. వరుసకు అన్నఅయ్యేవాడితో..

పాక్ ఆర్మీ చీఫ్ జనరల్ ఆసిమ్ మునీర్ కుమార్తె వివాహాన్ని రహస్యంగా జరిపించాడు. రావల్పిండిలోని పాక్ ఆర్మీ హెడ్‌‌క్వార్టర్స్‌లో జరిగిన ఈ వేడుక ఇప్పుడు అంతర్జాతీయంగా చర్చనీయాంశమైంది. మునీర్ తన కుమార్తె మహనూర్‌ వివాహం డిసెంబర్ 26న జరిపించారు.

New Update
Asim Munir

పాక్ ఆర్మీ చీఫ్ జనరల్ ఆసిమ్ మునీర్ కుమార్తె వివాహాన్ని రహస్యంగా జరిపించాడు. రావల్పిండిలోని పాక్ ఆర్మీ హెడ్‌‌క్వార్టర్స్‌లో జరిగిన ఈ వేడుక ఇప్పుడు అంతర్జాతీయంగా చర్చనీయాంశమైంది. జనరల్ మునీర్ తన కుమార్తె మహనూర్‌ను స్వయానా తన సోదరుడి కుమారుడు అబ్దుల్ రెహ్మాన్‌కు ఇచ్చి డిసెంబర్ 26న వివాహం జరిపించారు. ఈ విషయం బయటకు రాకుండా రహస్యంగా ఉంచారు. మునీర్‌కు నలుగురు కుమార్తెలు, ఇది అతని మూడవ కుమార్తె వివాహం. ఈ వివాహానికి 400 మంది అతిథులు హాజరయ్యారు. 

సాధారణంగా అత్యంత కట్టుదిట్టమైన సెక్యురిటీ ఉండే పాక్ ఆర్మీ హెడ్ క్వార్టర్స్, ఈ వివాహ వేడుక కోసం ఘనంగా ముస్తాబు చేశారు. పాక్ ఆర్మీ చరిత్రలో ఆర్మీ చీఫ్ తన కుటుంబ వేడుకను ప్రధాన కార్యాలయంలో నిర్వహించడం ఇదే మొదటిసారి. జనరల్ ఆసిమ్ మునీర్ సోదరుడి కుమారుడినే అల్లుడిగా చేసుకున్నారు. వారి ఆచార సంప్రదాయాల ప్రకారం అన్న వరస అయ్యే వారిని వివాహం చేసుకోవచ్చు. ఈ వివాహం 'నికాతా' పద్ధతిలో ఇస్లామిక్ సంప్రదాయాలను అనుసరించి జరిగింది. పెళ్లి సీక్రెట్‌గా చేశారు. నిఖాకు హాజరైన అతిథులు ఫోన్లు, కెమెరాలు లోపలికి తీసుకురాకుండా కఠినమైన ఆంక్షలు విధించారు. పాక్ ప్రధాని షెహబాజ్ షరీఫ్, రక్షణ మంత్రి, ఇతర ఉన్నతాధికారులు, పలువురు విదేశీ ప్రతినిధులు హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు.

సోషల్ మీడియాలో రచ్చ

ఓ పాకిస్థాన్ తీవ్ర ఆర్థిక సంక్షోభంలో కొట్టుమిట్టాడుతుండగా, మరోవైపు దేశ రక్షణకు కేంద్రబిందువైన ఆర్మీ ఆర్మీ హెడ్‌క్వార్టర్స్‌లో భారీ ఖర్చుతో వేడుకలు నిర్వహించడంపై నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దేశ ప్రజలు నిత్యావసరాల కోసం ఇబ్బందులు పడుతుంటే, ఆర్మీ చీఫ్ హోదాలో ప్రభుత్వ డబ్బు పర్సనల్ సెలబ్రేషన్లకు వాడుకోవడంపై విమర్శలు వస్తున్నాయి. ఇమ్రాన్ ఖాన్ మద్దతుదారులు ఈ వివాహ ఫోటోలను షేర్ చేస్తూ, సైన్యం దేశం కంటే తమ సొంత ప్రయోజనాలకే పెద్దపీట వేస్తోందని ఆరోపిస్తున్నారు.

ఆసిమ్ మునీర్ తన కుమార్తెను తన సోదరుడి కుమారుడికి ఇచ్చి వివాహం చేయడం ద్వారా కుటుంబ బంధాలను మరింత బలోపేతం చేసుకున్నారు. పాకిస్థాన్‌లోని సంప్రదాయ ముస్లిం కుటుంబాల్లో మేనరికం లేదా సమీప బంధువుల మధ్య వివాహాలు సర్వసాధారణం.

Advertisment
తాజా కథనాలు