ప్రపంచవ్యాప్తంగా భారతదేశ ప్రభావం రోజురోజుకి పెరిగిపోతోంది. ఇటీవల రష్యాలో నిర్వహించిన బ్రిక్స్ సమావేశంలో ప్రధాని మోదీ.. రష్యా అధ్యక్షుడు పుతిన్, చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్ తదితర దేశాధినేతలో చర్చలు జరపడం కూడా ఇందుకు ప్రధాన కారణం. ఈ సమావేశంలో భారత్.. పశ్చిమ దేశాలతో కూడా ద్వైపాక్షిక సంబంధాలను కొనసాగిస్తూనే.. తూర్పు దేశాలైన చైనా రష్యాలతో కూడా సంబంధాలు పెట్టుకుంది. చైనాతో సరిహద్దు వివాదాలు ఉన్నప్పటికీ కూడా చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్‌తో ప్రధాని మోదీ మాట్లాడటం ప్రాధాన్యం సంతరించుకుంది. దీంతో సరిహద్దు వివాదాలను పరిష్కరించడంపై దృష్టి పెట్టడంతో పాటు కఠినమైన సమస్యలను పరిష్కరించడం, అగ్రదేశాలతో సంబంధాలను బ్యాలెన్స్ చేయడంలో భారత్ మధ్యవర్తిత్వ పాత్ర ప్రతిబింబింపజేస్తోంది.
Also Read: ఉత్తరాఖండ్‌లో ఘోర రోడ్డు ప్రమాదం.. లోయలో బస్సు పడి..
India
ప్రస్తుతం రష్యా-ఉక్రెయిన్ మధ్య ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్న సంగతి తెలిసిందే. ఈ వ్యవహారంలో భారత్ న్యూట్రల్ మధ్యవర్తిగా ఉండటంతో దీని ప్రతిష్ట మరింత పెరిగింది. రష్యా, ఉక్రెయిన్ దేశాధినేతలు కూడా గౌరవించే నాయకుడిగా మోదీ స్థానం కీలకంగా ఉంది. ఈ సమావేశంలో మోదీ ఇరాన్ అధ్యక్షుడు మసౌద్ పెజిష్కియాన్‌తో కూడా చర్చలు జరిపారు. ప్రపంచవ్యాప్తంగా శాంతిని నెలకొల్పడం, ఉగ్రవాదంపై ఉక్కపాదం మోపడం లాంటి భారత్ నిబద్ధతను చాటిచెప్పారు. బ్రిక్స్ సమావేశంలో భారత దేశ పాత్ర అనేది దౌత్యపరంగా ఎదగడాన్ని సూచిస్తోంది. డిజిటల్ టెక్నాలజీ, సుస్థిర అభివృద్ధి, ఉగ్రవాదాన్ని నిరోధించడం లాంటి ప్రయాత్నాల్లో కీలక కార్యక్రమాలు చేపట్టేందుకు సిద్ధమవుతోంది.
Also Read : ఫస్ట్ టైం నెగిటివ్ రోల్ లో ప్రభాస్.. డార్లింగ్ తో పాన్ ఇండియా డైరెక్టర్ భారీ ప్లానింగ్?
భారతదేశ సమతుల్య విదేశాంగ విధానం కూడా బ్రిగ్స్‌తో పాటు జీ7 దేశాలతో (కెనడా తప్ప) సంబంధాలు పెట్టుకునేలా చేస్తోంది. వాణిజ్యం, వలసవాదంలో వివాదాలు ఉన్నప్పటికీ.. జీ7 దేశాలతో ఇండియా నిరంతరం సంబంధాలను కొనసాగిస్తూ కీలక దౌత్య భాగస్వామిగా గుర్తింపు తెచ్చుకుంటోంది. ఇండో పసిఫిక్ సముద్ర భద్రత, తీవ్రవాద వ్యతిరేకత వంటి సమస్యలపై పోరాడటంలో జీ7 దేశాలతో ఇండియా కలవడం కూడా దేశ నిబద్ధతను ప్రపంచానికి చాటిచెప్పుతోంది.
Also Read : తిరుపతిలో శిల్పారామంలో విషాదం.. ప్రాణం తీసిన క్రాస్ వీల్
రష్యా అర్కిటక్, నార్తర్న్ సీ రూట్ (NSR)లో భారత్ ఆసక్తి చూపడం అనేది దాని అంతర్జాతీయ దృష్టిని మరింత పెంచుతోంది. బ్రిక్స్ సమావేశంలో.. అర్కిటిక్‌లోని ఇండియా-రష్యా ప్రాజెక్టుల గురించి కూడా చర్చలు జరిగాయి. నౌకలను నిర్మించడం, ధృవ జలాలపై భారతీయ నావికులకు శిక్షణ అందించడం, వనరులు సమృద్ధిగా ఉన్నవాటిలో భారత వ్యూహాత్మకతంగా ముందుకు వెళ్లడం లాంటి ప్రణాళికలపై చర్చలు జరిగాయి. ప్రస్తుతం ఆసియాలోని పలు దేశాల్లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొనండతో.. ఉగ్రవాదాన్ని ఎదుర్కోవడం, సరిహద్దు వివాదాలను పరిష్కరించడం లాంటి అంశాల్లో సమాచారాన్ని పంచుకోవడం, ప్రాంతీయ సహాకారానికి భారత్ పిలుపునివ్వడం కూడా ప్రధాన అంశంగా ఉంది.
Also Read : త్వరలో మళ్లీ పెళ్లి చేసుకుంటా
బ్రిక్స్ సమావేశం అంతటా కూడా ప్రధాని మోదీ శాంతి, దౌత్యం గురించి సూచనలు చేశారు. గాజా ఉద్రిక్తతలతో పాటు అంతర్జాతీయ సమస్యలకు మద్యవర్తిగా ఉండేలా భారత దృష్టికోణాన్ని చూపించారు. ఓవైపు ఇజ్రాయెల్‌తో బలమైన సంబంధాలు కొనసాగిస్తూనే.. మరోవైపు పాలస్తీనాకు కూడా భారత్ మద్దతివ్వడాన్ని మోదీ నొక్కి చెప్పారు. సంక్లిష్ట సమస్యల పట్ల భారత్ చూపిస్తోన్న ద్వంద్వ విధానం సున్నిత అంతర్జాతీయ సంబంధాలను నియంత్రించే సామర్థ్యాన్ని ప్రదర్శిస్తుంది. మొత్తానికి బ్రిక్స్ దేశాలుతో, జీ7 దేశాలతో భారత్ తన సంబంధాలను సమతుల్యం చేసుకుంటూ వెళ్లడాన్ని బట్టి చూస్తే ఇండియా అంతర్జాతీయంగా ఓ కీలక పాత్రను పోషిస్తోందనేది స్పష్టమవుతోంది.