Imran Khan Wife: ఇమ్రాన్ ఖాన్ కోసం ఆయన భార్య ఎలాన్ మస్క్ కు బహిరంగ లేఖ

ప్రపంచ కుబేరుడు, ఎక్స్ అధిపతి ఎలాన్ మస్క్ కు పాకిస్తాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ భార్య బహిరంగ లేఖ రాశారు. తన ఖాతాలో విజిబిలిటీ ఫిల్టరింగ్‌ను సరిచేయాలని విజ్ఞప్తి చేశారు.

New Update
jemima

ఇటీవల కాలంలో పాక్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్(imran-khan) గురించి ఎంత పెద్ద గొడవ అయిందో అందరికీ తెలిసిందే. ప్రస్తుతం ఆయన అడియాలా జైలులో ఉన్నారు. అయితే ఆయనో ఎవరినీ..ఆఖరుకి కుటుంబ సభ్యులను కూడా కలవనీయకపోవడంతో..ఇమ్రాన్ ఖాన్ చనిపోయారని పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. ఆయన కుటుంబ సభ్యులు, ప్రజలు రచ్చ ర్చ చేశారు. ఆందోళనలతో పాకిస్తాన్ ను అట్టుడికించారు. దాదాపు 15 రోజుల పాటూ పాకిస్తాన్ లో ఈ విషయంపై గొడవలు అయ్యాయి. అంత జరుగుతున్నా పాకిస్తాన్ పోలీసులు మాత్రం ఇమ్రాన్ ను ఎవరికీ చూపించలేదు. చివరకు ప్రధాని షెహబాజ్ ప్రత్యేక అనుమతి ఇవ్వడంతో కుటుంబసభ్యలకు మాత్రం ఆయనను చూపించారు.

Also Read :  H-1B Visa-Trump: హెచ్- 1బీ వీసా ఫీజు పెంపును సవాల్ చేసిన 20 స్టేట్స్..

ఎక్స్ ద్వారా మాత్రమే మాటలు..

అయితే ఈ విషయంపై ఇమ్రాన్ కుటుంబ సభ్యులు ఇంకా ఆందోళన చేస్తూనే ఉన్నారు. ఆయనను ఏకాంత నిర్భంధంలో ఉంచారని..ఎవరినీ కలవనీయడం లేదని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయమై ఇమ్రాన్ ఖాన్ భార్య జెమీమా గోల్డ్ స్మిత్...ఏకంగా ఎక్స్ అధిపతి ఎలన్మస్క్(Elon Musk) కు బహిరంగ లేఖ రాశారు. తన ఎక్స్‌ (X) ఖాతాలో విజిబిలిటీ ఫిల్టరింగ్‌ను సరిచేయాలని ఆమె విజ్ఞప్తి చేశారు. చట్ట విరుద్ధంగా తన భర్తను ఏకాంత నిర్భంధంలో ఉంచారని...ఆయనను చూడ్డానికి, మాట్లాడ్డానికి కూడా తన కుమారులకు అనుమతి ఇవ్వడం లేదని చెప్పారు. కేవలం ఎక్స్ ద్వారానే ఇమ్రాన్ గురించి దేశ ప్రజలకు తెలిసేలా చేస్తున్నాం. మా ఆవేదన ప్రపంచానికి చెప్పగలుగుతున్నాం. కానీ పాక్‌ అధికారులు ఇమ్రాన్‌పై వ్యవహరిస్తున్న తీరు గురించి తాను పెడుతున్న పోస్టులు బయటకు రావడం లేదని జెమీమా అన్నారు. అవి ప్రజలకు చేరడం లేదని ఆందోళన వ్యక్తం చేశారు. అందుకే తన ఖాతాకు విజిబిలిటీ ఫిల్టరింగ్ సరిచేయాలని జెమీమా...ఎలాన్ మస్క్ ను కోరారు.

Also Read :  Myanmar: మయన్మార్ లో ఉద్రిక్తతలు..ఆసుపత్రిపై దాడిచేసిన సైన్యం..31 మంది మృతి

Advertisment
తాజా కథనాలు