Trump: ఇరాన్‌పై దాడులు చేస్తాం.. ట్రంప్ సంచలన హెచ్చరిక

ఇరాన్‌, ఇజ్రాయెల్ మధ్య తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న సంగతి తెలిసిందే. అయితే ఈ దాడుల్లో అమెరికా ప్రమేయం లేదని ఆ దేశ అధ్యక్షుడు ట్రంప్‌ క్లారిటీ ఇచ్చారు. ఒకవేళ అమెరికాపైకి దాడులకు దిగితే తమ బలగాలు ఇరాన్‌పై విరుచుకుపడతాయని హెచ్చరించారు.

New Update
Trump

Trump

ఇరాన్‌, ఇజ్రాయెల్ మధ్య తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న సంగతి తెలిసిందే. అయితే ఈ దాడుల్లో అమెరికా ప్రమేయం లేదని ఆ దేశ అధ్యక్షుడు ట్రంప్‌ క్లారిటీ ఇచ్చారు. ఒకవేళ అమెరికాపైకి దాడులకు దిగితే తమ బలగాలు ఇరాన్‌పై విరుచుకుపడతాయని హెచ్చరించారు. ఇరాన్ ఏ విధంగా దాడి చేసినా కూడా తాము తిప్పి కొడతామని పేర్కొన్నారు. ఇరాన్, ఇజ్రెయెల్ మధ్య జరుగుతున్న యుద్ధాన్ని ఆపడం తనకు చాలా సులభమని తెలిపారు.  

Also Read: భార్యపై ఇంత ప్రేమ.. ఏకంగా మరో ‘తాజ్ మహల్’ను కట్టించిన భర్త - వీడియో చూశారా?

 ఇజ్రాయెల్ దాడుల్లో ఇరాన్ పూర్తిగా నాశనం కాకముందే తమతో అణు ఒప్పందం చేసుకోవాలని ఇప్పటికే ట్రంప్‌ ఇరాన్‌కు హెచ్చరించారు. ఈ దాడులు ఇలాగే కొనసాగితే ఇరాన్‌లో ఏమీ కూడా మిగలదని చెప్పారు. ఒకప్పుడు ఇరాన్ సామ్రాజ్యంగా పేరుపొందిన దేశాన్ని కాపాడుకునేందుకు అక్కడి పాలకులు ముందుకు రావాలన్నారు. మరోవైపు ప్రస్తుత పరిస్థితుల్లో అమెరికాతో చర్చలు చేయడం వ్యర్థమని ఇరాన్ విదేశాంగ శాఖ మంత్రి అబ్బాస్ అరాగ్చీ పేర్కొన్నారు. ఓవైపు తమపై దాడులు చేస్తే మద్దతిస్తూ.. మరోవైపు అణు ఒప్పందంపై చర్చలకు ఆహ్వానించడం సరికాదని పేర్కొన్నారు. తాము ఇజ్రాయెల్‌పై చేస్తున్న దాడులు ఆపేందుకు అమెరికా, యూకే, ఫ్రాన్స్‌ లాంటి దేశాలు దేశాలు ఇజ్రాయెల్‌కు సపోర్ట్ చేస్తే ఆయా దేశాల స్థావరాలపై దాడులు చేస్తామని హెచ్చరించారు.   

Also Read: ఇరాన్ ఆయిల్ గోడౌన్స్ నుంచి గ్యాస్, అణు కర్మాగారం వరకు.. దేన్నీ వదలని ఇజ్రాయెల్.. వీడియోలు వైరల్!

ఈ క్రమంలోనే ట్రంప్‌ ఇరాన్‌కు ఇలా మరోసారి హెచ్చరికలు జారీ చేయడం ప్రాధాన్యం సంతరించుకుంది. ఇదిలాఉండగా గత కొన్నిరోజులుగా ఇరాన్, అమెరికా మధ్య అణుఒప్పందం కోసం ఒమన్ మధ్యవర్తిత్వంలో చర్చలు కొనసాగుతున్నాయి. అయితే ఇప్పటిదాకా ఇరుదేశాల మధ్య 5 సమావేశాలు జరిగాయి. కానీ ఇప్పటిదాకా ఎలాంటి తుది నిర్ణయం తీసుకోలేదు. ప్రస్తుతం ఇజ్రాయెల్, ఇరాన్‌ మధ్య యుద్ధం నడుస్తున్న నేపథ్యంలో ఒమన్‌లో ఆదివారం జరగాల్సిన ఆరో విడత చర్చలను రద్దు చేసుకున్నారు.  

Advertisment
Advertisment
తాజా కథనాలు