/rtv/media/media_files/2025/04/26/dXcmYoE19OICaj9yv1M0.jpg)
modi-and-pak
జమ్మూ కాశ్మీర్‌లోని పహల్గామ్‌లో జరిగిన ఘోరమైన ఉగ్రవాద దాడి తర్వాత, పాకిస్తాన్ ఉగ్రవాదానికి నిధులు సమకూరుస్తోందని ఆరోపిస్తూ భారత ప్రభుత్వం తన చర్యలను ముమ్మరం చేసింది. పాక్ తో దౌత్య సంబంధాలను తెగదెంపులు చేసుకోవడంతో పాటుగా సింధు జలాల రద్దు, పాక్ జాతీయులు వీసాలు రద్దు చేస్తూ కీలక ఆంక్షలు విధించింది. దీనిపై తీవ్రంగా స్పందిస్తూ భారత్‌పై నోరు పారేసుకున్నారు పాక్ మాజీ విదేశాంగశాఖ మంత్రి బిలావల్ భుట్టో. సుక్కూర్‌లో జరిగిన బహిరంగ ర్యాలీలో ఆయన మాట్లాడుతూ.. తన బలహీనతను కప్పి పుచ్చుకోవడానికి, ప్రజలను మోసం చేయడానికి భారత ప్రధాని మోదీ పాక్‌ను నిందిస్తున్నారని భుట్టో వాపోయారు.
“میں آپ سب کو مبارک باد پیش کرتا ہوں کہ جس مقصد کیلئے پاکستان پیپلز پارٹی کے کارکن احتجاج کررہے تھے، شاہراہوں سے لے کر ایوان تک کہ ہمیں سندھو پر نئی نہریں منظور نہیں ہیں۔ کل وزیر اعظم سے ملاقات میں یہ بات طے ہوچکی کہ آپ کی مرضی کے بغیر کوئی نئی نہر نہیں بنے گی۔ یہ پرامن جمہوری… pic.twitter.com/I8sF0IFLXh
— PPP (@MediaCellPPP) April 25, 2025
Also read : Heatwave Warning : బయటకు వెళ్తున్నారా? జాగ్రత్త...ఈ రోజు మండనున్న ఎండలు..అరెంజ్ అలర్ట్
సింధూ పాక్‌దే
సింధూ పాక్‌దేనని, ఇకపై కూడా ఆ నదీ జలాలు తమకే చెందుతాయని వ్యాఖ్యనించారు. సింధూలో నీళ్లు పారకపోతే రక్తం పారుతుందంటూ హెచ్చరికలు జారీ చేశారు. పాకిస్తాన్ కు అతి పిన్న వయస్కుడైన విదేశాంగ మంత్రిగా కూడా పనిచేసిన బిలావల్.. ఇటీవల జరిగిన ఉగ్రవాద దాడిని ఖండించారు. పాకిస్తానీలు కూడా ఉగ్రవాద బాధితులుగా మిగిలిపోయారని అన్నారు. భారత దురాక్రమణ నుండి తమ నదిని రక్షించుకోవడానికి దృఢ సంకల్పంతో కూడిన పోరాటానికి సిద్ధం కావాలనితన మద్దతుదారులను కోరారు.
Also Read : Pahalgam attack : హ్యాట్సాఫ్..ఉగ్రదాడితో ముస్లిం ఆవేదన.. ఇస్లాంను వదిలేస్తూ కోర్టుకు!