Pakistan : సింధు నదిలోప్రతీ నీటి చుక్కా మాదే: పాకిస్తాన్ సంచలన ప్రకటన
సింధు జలాల్లోని ప్రతీ నీటి బొట్టుపై తమకు హక్కు ఉందన్నారు పాకిస్తాన్ మంత్రి అవైస్ అహ్మద్ ఖాన్. భారత్ తీసుకున్న ఈ నిర్ణయాన్ని తాము న్యాయపరంగా, దౌత్యపరంగా ఎదుర్కొంటామని తెలిపారు. సింధూ జలాల ఒప్పందాన్ని భారత్ నిర్లక్ష్యంగా నిలిపివేయడం పిరికితనమని అన్నారు.