/rtv/media/media_files/2025/06/24/israel-pm-netanyahu-2025-06-24-14-40-15.jpg)
Israel PM Netanyahu
ఇజ్రాయెల్ ప్రధాని బెంజిమన్ నెతన్యాహు. ప్రపంచ మోనార్క్ నేతల్లో ఈయన ఒకరు. ఎవరు ఎంత చెప్పినా అబ్బే నేను వినను అంటూ రెండేళ్ళుగా గాజాను సర్వనాశనం చేస్తూనే ఉన్నారు. ఐక్యరాజ్య సమితి, ప్రపంచ దేశాలు గాజా పరిస్థితి దారుణంగా ఉందని...దాన్ని వదిలేయండి అని ఇజ్రాయెల్ కు చెబుతున్నారు. సొంత దేశంలో కూడా మాజీ అధికారులు, సైన్యం అందరూ గాజా మీద జాలిని చూపిస్తున్నారు. కానీ నెతన్యాహు మాత్రం దాన్ని పూర్తిగా ఆక్రమించడానికి రెడీ అయ్యారు. ఈ విషయంలో జిగిరీ దోస్త్ అయిన అమెరికా అధ్యక్షుడు ట్రంప్ మాట కూడా వినలేదు. కానీ ఇప్పుడు మాత్రం భారత ప్రధాని మోదీకి సలహాలు ఇవ్వడానికి తయారయ్యారు నెతన్యాహు.
మోదీకి మాత్రమే చెబుతా..
ప్రస్తుతం ప్రపంచం దృష్టి అంతా భారత్ వైపు మళ్ళింది. రష్యా నుంచి చమురు దిగుమతి చేస్తూ ఉక్రెయిన్ తో యుద్ధానికి పరోక్షంగా సహాయపడుతోందనే నెపంతో ఇండియాపై 50 అదనపు సుంకాలను విధించారు అమెరికా అధ్యక్షుడు ట్రంప్. దీన్ని భారత్ గట్టిగా అడ్డుకుంటోంది. ఏం చేసినా ట్రంప్ మాట వినేదే లేదు అని ధీటుగా సమాధానం చెబుతోంది. ఈ వాణిజ్య యుద్ధంలో భారత్ కు అండగా రష్యా, చైనాలు నిలిచాయి. మరికొన్ని దేశాలు కూడా ఇండియా మద్దతు పలుకుతున్నాయి. ఇప్పుడు ఇదే విషయంలో ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు కూడా స్పందించారు. ట్రంప్ తో ఎలా వ్యవహరించాలో భారత ప్రధాని మోదీకి చెబుతానంటూ నెతన్యాహు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. మోదీ, ట్రంప్..ఇద్దరూ నాకు ప్రియ మిత్రులు. కానీ మోదీకి మాత్రమే వ్యక్తిగతంగా కొన్ని చెబుతా అంటూ మాట్లాడారు. ఇప్పటి వరకు అమెరిక, భారత సంబంధాలు చాలా దృఢంగా ఉన్నాయని..సుంకాల సమస్యను పరిష్కరించుకుని భవిష్యత్తులో కూడా అలాగే ఉండాలని నెతన్యాహు రెండు దేశాలకు విజ్ఞప్తి చేశారు.
Also Read: Accident: హిమాచల్ లో దారుణం..రాయిని ఢీకొట్టిన కారు..ఆరుగురు మృతి