Accident: హిమాచల్ లో దారుణం..రాయిని ఢీకొట్టిన కారు..ఆరుగురు మృతి

హిమాచల్ ప్రదేశ్ లో దారుణమైన రోడ్డు ప్రమాదం జరిగింది. పై నుంచి పడిన రాయి ఢీకొట్టిన కారు లోయలో పడింది. దీంట్లో ఒకే కుటుంబానికి చెందిన ఆరుగురు మృతి చెందారు.

New Update
accident

Himachal Pradesh

ఒక రాయి ఒకే కుటుంబానికి చెందిన ఆరుగురిని పొట్టనపెట్టుకుంది. హిమాచల్ ప్రదేశ్ లో జరిగిన ఘోరం మొత్తం కుటుంబాన్ని విషాదంలో నింపింది. శుక్రవారం రాత్రి చంబా అనే ప్రాంతంలో తన కుటుంబసభ్యులతో వెళుతున్న రాజేష్ వ్యక్తి కారును రాయి ఢీకొట్టడంతో ఈ ఘటన చోటుచేసుకుంది. కొండ ప్రాంతంలో వెళుతున్న వారికి పై నుంచి రాయి అడ్డుగా పడింది. చీకటిలో వారికి అది ముందుగానే కనిపించకపోవడంతో రాజేష్ కారు దాన్ని ఢీకొట్టింది. దీంతో ఆ కారు అదుపు తప్పి పెద్ద లోయలోకి పడిపోయింది.  ఈ ఘటనలో ఒకే కుటుంబానికి చెందిన రాజేష్‌, హన్సో (36) దంపతులు, వారి కుమార్తె ఆర్తి (17), కుమారుడు దీపక్‌ (15), బావమరిది హిమరాజ్‌, మరో వ్యక్తి మృతి చెందారు.  

ఇంకా కోలుకోని ధారాలీ..

హిమాచల్ ప్రదేశ్ లో వర్షాల కారణంగా అక్కడ కొండప్రాంతాలు డేంజరస్ గా మారాయి. కొండల నుంచి రాళ్ళు పడుతున్నాయి. ఎన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నా ఎక్కడో ఒక చోట ప్రమాదం జరుగుతూనే ఉంది. మరోవైపు ధారాలీలో సడెన్ గా ఏర్పడిన క్లౌడ్ బరస్ట్ కారణంగా కొట్టుకుపోయిన వారి గురించి గాలింపు చర్యలు ఇంకా కొనసాగుతున్నాయి. 11 మంది సైనికులతో పాటూ మరికొంత మంది వరదల్లో కనిపించకుండా పోయారు. అక్కడ విపరీతంగా బురద పేరుకుపోవడంతో కొట్టుపోయినవారిని కనిపెట్టడం కష్టంగా మారింది. దాంతో పాటూ మొత్తం ఊరు కొట్టుకుపోయింది. దీంతో అక్కడున్న స్థానికులు నానా ఇబ్బందులు పడుతున్నారు. సరైన ఆహారం, ఉండడానికి వసతి కూడా లేదని వారు ఫిర్యాదు చేస్తున్నారు. మాకు ఇల్లు లేదు, భూమి లేదు, బట్టలు లేవు అంటూ స్థానికులు గగ్గోలు పెడుతున్నారు. అదే ఊర్లో ఉన్న సోమేశ్వర ఆలయంలో 150 మందికి పైగా తలదాచుకుంటున్నారు. ప్రభుత్వం తమ గురించి పట్టించుకోవాలని కోరుకుంటున్నారు. ఆకస్మిక వరదలు వచ్చి ధారాలీని ముంచెత్తడంతో, ఇళ్లు, వాహనాలు, ఒక పురాణ ఆలయం కూడా శిథిలాల కింద మునిగిపోవడంతో అక్కడ ఉన్న వారందరూ తమ వద్ద ఉన్నదంతా కోల్పోయారు.

Advertisment
తాజా కథనాలు