Game Changer: రామ్ చరణ్ మోస్ట్ అవైటెడ్ ఫిల్మ్ గేమ్ ఛేంజర్ రేపు ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. ఈ నేపథ్యంలో ఈ సినిమా టికెట్ల అడ్వాన్స్ బుకింగ్స్ ఇప్పటికే ప్రారంభమయ్యాయి. అడ్వాన్స్ బుకింగ్స్ లో గేమ్ ఛేంజర్ తెలుగు రాష్ట్రాలతో పాటు ఓవర్ సీస్ లో హవా కొనసాగిస్తోంది. Sacnilk నివేదిక ప్రకారం తెలుగు వెర్షన్ కి సంబంధించి ఇప్పటివరకు 58899 టిక్కెట్లు అమ్ముడయ్యాయి. అంటే దాదాపు రూ. 2.6 కోట్ల అడ్వాన్స్ బుకింగ్ సెల్ జరిగినట్లు తెలుస్తోంది. ఓవర్సీస్‌లోనూ టిక్కెట్ల అడ్వాన్స్ బుకింగ్ జోరుగా సాగుతోంది. నివేదికల ప్రకారం ఓవర్ సీస్ లో ఇప్పటివరకు $651K అడ్వాన్స్ బుకింగ్ అమ్మకాలను నమోదు చేసింది. కర్ణాటక వ్యాప్తంగా ఇప్పటికే చాలా సింగిల్ స్క్రీన్ థియేటర్లలో భారీగా టికెట్లు అమ్ముడయ్యాయి. ఇక ఈ చిత్రానికి సంబంధించి బెనిఫిట్ షోలు, టికెట్ ధరలకు ఏపీ ప్రభుత్వం అనుమతించగా.. తెలంగాణలో ఇంకా నిర్ణయం తీసుకోలేదు.
Also Read: Tripti Dimri: వైట్ బాడీకాన్ గౌనులో త్రిప్తి అందాల విధ్వంసం..! చూస్తే ఫిదా - Rtvlive.com
మూడేళ్ళ తర్వాత..
RRR తర్వాత దాదాపు మూడేళ్ళ గ్యాప్ తో రామ్ చరణ్ ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. దీంతో ఫ్యాన్స్ సినిమా కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. తమిళ్ స్టార్ డైరెక్టర్ శంకర్ ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. ఇప్పటికే విడుదలైన టీజర్, సాంగ్స్ విపరీతమైన హైప్ క్రియేట్ చేశాయి. తమన్ సంగీతం పెద్ద అసెట్ గా నిలిచింది. శ్రీ వెంకటేశ్వర బ్యానర్ పై దిల్ రాజు, శిరీష్, జీ స్థూడియోస్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో రామ్ చరణ్ మూడు డిఫరెంట్ రోల్స్ లో కనిపించబోతున్నారు. కియారా అద్వానీ హీరోయిన్ గా నటించగా .. శ్రీకాంత్, అంజలి, ఎస్. జే సూర్య, సముద్రఖని, సునీల్ తదితరులు కీలక పాత్రలు పోషించారు.
Also Read : మహారాష్ట్రలో ఘోరం.. రూ. 500 కోసం సొంత తమ్ముడి హత్య.. అసలేం జరిగిందంటే ?