/rtv/media/media_files/2026/01/13/supreme-court-2026-01-13-16-36-17.jpg)
Supreme Court's big warning to states, feeders on Street dogs issue
వీధి కుక్కల వ్యవహారానికి సంబంధించి మంగళవారం విచారణ జరిపిన సుప్రీంకోర్టు సంచలన వ్యాఖ్యలు చేసింది. కుక్కల బెడదను అడ్డుకునేందుకు చర్యలు తీసుకోకపోతే ఆయా రాష్ట్రాలపై భారీగా జరిమానాలు విధిస్తామని హెచ్చరించింది. ప్రతి కుక్క కాటుకు కూడా పరిహారం చెల్లించాల్సిందేనని తేల్చిచెప్పింది. కుక్క కరిచిన ప్రభావం బాధిత వ్యక్తిపై జీవితకాలం ఉంటుందని వ్యాఖ్యానించింది. వీధి కుక్కలకు అన్నం పెడుతున్న వాళ్లపై కూడా కోర్టు అసహనం వ్యక్తం చేసింది. ఏదైన సంస్థ ఆహారం అందిస్తున్న కుక్కల దాడి వల్ల ఓ చిన్నారి మరణిస్తే ఎవర్ని బాధ్యుల్ని చేయాలని ప్రశ్నించింది. సదరు సంస్థ బాధ్యత వహించదా అంటూ ధ్వజమెత్తింది.
Also read: కశ్మీర్‌లో తగ్గిపోతున్న మంచు.. ముప్పు తప్పదంటూ హెచ్చరిస్తున్న పర్యావరణవేత్తలు
వీధి కుక్కల బెడదను నివారించేందుకు అన్ని రాష్ట్రాలు చర్యలు తీసుకోవాలని సూచించింది. లేకపోతే ప్రతికుక్క కాటుకు, కుక్క దాడి వల్ల జరిగే ప్రతి మరణానికి ఆయా రాష్ట్రాలు మేము నిర్దేశించిన భారీ పరిహారం చెల్లించాలని ఆదేశించింది. వీధి కుక్కులపై అంత ప్రేమ ఉంటే వాటిని మీ ఇంటికి తీసుకెళ్లి పెంచుకోండని డాగ్ లవర్స్‌కు సూచించింది. మీ భావోద్వేగం కుక్కలపై మాత్రమేనా ? మేం మనుషుల గురించి కూడా సమానంగా ఆందోళన చెందుతున్నామని తెలిపింది. వీధుల్లో కుక్కలు తిరుగుతూ ప్రజలను భయపెట్టే పరిస్థితిని మేము ఆమోదించమని సుప్రీం ధర్మాసనం స్పష్టం చేసింది.
దేశంలో వీధి కుక్కల దాడులు పెరుగుతున్న నేపథ్యంలో గతేడాది నవంబర్‌లో కూడా సుప్రీంకోర్టు కీలక ఉత్తర్వులు జారీ చేసింది. స్కూళ్లు, బస్టాండ్లు, రైల్వేస్టేషన్లు, క్రీడా సముదాయాలు, ఇతర బహిరంగ ప్రదేశాల వద్ద ఉంటున్న కుక్కలను షెల్టర్లకు తరలించాలని ఆదేశించింది. ప్రస్తుతం దీనిపై కూడా అత్యున్నత న్యాయస్థానంలో విచారణ జరుగుతోంది.
Also Read: పది నిమిషాల డెలివరికీ బ్లింకిట్ గుడ్‌బై...30 వేల ఉత్పత్తులు డెలివరీకి శ్రీకారం
దేశవ్యాప్తంగా వీధి కుక్కల దాడుల ఘటనలు పెరుగుతున్న నేపథ్యంలో గతేడాది నవంబరులో సుప్రీంకోర్టు కీలక ఉత్తర్వులు జారీ చేసిన సంగతి తెలిసిందే. విద్యాసంస్థలు, బస్టాండ్లు, రైల్వేస్టేషన్లు, క్రీడా సముదాయాలు, ఇతర బహిరంగ ప్రదేశాల సమీపంలోని వాటిని షెల్టర్లకు తరలించాలని ఆదేశించింది. ఈ అంశంపై సుప్రీంకోర్టులో విచారణ కొనసాగుతోంది.
Follow Us