/rtv/media/media_files/2026/01/06/pentagon-pizza-theory-2026-01-06-20-41-10.jpg)
పెంటగాన్ చుట్టుపక్కల పిజ్జా ఆర్డర్లు పెరిగాయంటే ప్రపంచంలో ఏదో మూల అలజడి మొదలైనట్టే లేదా జరుగుతున్నట్టే. ఇది చాలా ఏళ్ళ నుంచీ ప్రచారంలో ఉంది. అమెరికా ఎవరి మీదనైనా యుద్ధానికి వెళ్ళిన ప్రతీసారీ ఇది నిరూపితం కూడా అవుతోంది. తాజాగా గత శనివారం తెల్లవారుజామున కూడా అమెరికా రక్షణ కార్యాలయం సమీపంలో పిజ్జా అవుట్‌లెట్లకు ఒక్కసారిగా ఆర్డర్లు పెరిగాయి. సరిగ్గా అదే సమయంలో అమెరికా వెనెజువెలాపై అనూహ్య దాడి చేసింది. దీంతో మరోసారి పిజ్జా థియరీ నిజమైంది.
అమెరికా రక్షణ కార్యాలయం పెంటగాన్ చుట్టుపక్కల పిజ్జా రెస్టారెంట్లలో టాక్రర్లు ఉంటారు. వీరు ప్రతీ రోజు ఎన్ని పిజ్జాలు డెలివరీ అయ్యాయి అని ట్రాక్ చేస్తుంటారు. పిజ్జా రిపోర్డ్ పేరుతో తాము ట్రాక్ చేసి వాటిని సోషల్ మీడియాలో కూడా పెడుతుంటారు. శనివారం తెల్లవారుజామున కూడా పెంటగాన్ సమీపంలోని పిజాటో పిజ్జా అవుట్‌లెట్‌లో సేల్స్ పెరిగినట్లు ఓ ట్రాకర్ పోస్ట్ చేశారు. ఆ రోజున తెల్లవారుజామున 2 గంటల నుంచి 3.30 గంటల వరకు విపరీతంగా ఆర్డర్లు వచ్చినట్లు చెప్పారు. గంటన్నర తర్వాత ఆ ట్రాఫిక్ అంతా ఒక్కసారిగా ఆగిపోయింది. కానీ ఈ మయంలోనే అమెరికా దళాలు వెనెజువెలాపై దాడి చేయడం, ఆ దేశ అధ్యక్షుడు మదురో, ఆయన భార్యను అరెస్ట్ చేసి తీసుకొచ్చేయడం అన్నీ అయిపోయాయి.
అసలేంటీ పిజ్జా థియరీ?
వినడానికి విచిత్రంగా ఉన్న ఈ పిజ్జా థియరీ వెనుక నిజంగానే చిన్నపాటి థియరీ ఉంది. అదేంటంటే...ఏ దైశమైనా యుద్ధం చేయాలంటే అప్పటికప్పుడు అనుకుని సడెన్ గా వెళ్ళిపోదు. దానికి సంబంధించిన ఏర్పాట్లు పూర్తిగా చేసుకునే వెళుతుంది. బయట ప్రపంచానికి అది ఎంత అనూహ్యంగా అనిపించినప్పటికీ రక్షణ శాఖ మాత్రం యుద్ధ వ్యూహాలను పక్కా రూపొందించుకుంటుంది. ఈ క్రమంలో దానికి కావాల్సిన ఫోర్స్ ను కూడా ముందే రక్షణ కార్యాలయానికి రప్పించుకుంటుంది కూడా. అన్ని దేశాల్లానే అమెరికా కూడా చేస్తుంది. అదిగే అప్పుడే పెంటగాన్ కు రక్షణశాఖ, ఇంటెలిజెన్స్ అధికారులు అందరూ తరలి వచ్చేస్తారు. ఆ సమయంలో రాత్రంతా కూడా ఉండి శిధులు చేయాల్సి ఉంటుంది. ఎవరైనా తింగడి లేకుండా పని చేయరు కా. అమెరికన్లు క్విక్ ఫుడ్ అనగానే ఎక్కువగా తినేది పిజ్జానే. అందుకే ఏదైనా యుద్ధానికి వెళ్ళే ముందు పెంటగాను చుట్టుపక్కల పిజ్జా రెస్టారెంట్లలో డెలివరీలు పెరుగుతాయి. ఇదే పెంటగాన్ థియరీ వెనుక ఉన్న అసలు కథ. అయితే దీనిని కేవలం ప్రచారం అని కొందరంటారు. మరికొందరు ఏదో అనుకోకుండా అలా జరుగుతుందని చెబుతారు. మరి కొందరు మాత్రం పిజ్జా సేల్స్ రిపోర్టులు నిజమైన సందర్భాలూ ఉన్నాయంటూ కొన్ని ఉదాహరణలు చెబుతారు.
ఎన్నిసార్లు జరిగిందంటే..
ఈ పిజ్జా ట్రెండ్ ఇప్పుడు మొదలైంది కాదని కూడా చెబుతున్నారు. అమెరికా..జపాన్ తో ప్రచ్ఛన్న యుద్ధం చేసినప్పటి నుంచీ ఉందని అంటున్నారు. అప్పట్లో అమెరికా సైనికాధికారుల కదలికలను గమనించేందుకు అగ్రరాజ్య ప్రభుత్వ భవనాల సమీపంలో వచ్చిన పిజ్జా ఆర్డర్లును సమీక్షించినట్లు అప్పట్లో ప్రచారం జరిగింది. అలాగే 1990లో కువైట్‌పై ఇరాక్ దండయాత్రకు ముందు అమెరికా సీఐఏ కార్యాలయానికి పిజ్జా ఆర్డర్లు పెరిగాయట. 1999లో సెర్బియాలో జరిగిన బాంబుదాడులు, 2003 ఇరాక్ యుద్ధం, 1989లో పనామాపై అమెరికా దాడి, 2022 రష్యా-ఉక్రెయిన్ యుద్ధం, 2024-25లో ఇరాన్-ఇజ్రాయెల్ ఉద్రిక్తతలు వంటి సందర్భాల్లోనూ ఈ పిజ్జా ఆర్డర్లు పెరిగినట్లు చెబుతున్నారు.
Follow Us