Volcano Erupts: 12 వేల ఏళ్ల తర్వాత బద్ధలైన అగ్నిపర్వతం.. వీడియోలు వైరల్

ఆఫ్రికాలోని ఇథియోపియాలో హైలీ గుబ్బి అనే అగ్నిపర్వతం దాదాపు 12 వేల ఏళ్ల తర్వాత బద్ధలైంది. నవంబర్ 23న ఉదయం డనాకిల్ ప్రాంతంలో ఈ విస్ఫోటనం జరిగినట్లు అధికారులు గుర్తించారు. ఉత్తర భారత్‌ వైపుగా దీని ప్రభావం ఉండే ఛాన్స్ ఉన్నట్లు తెలుస్తోంది.

New Update
Hayli Gubbi Volcano Erupts After 12,000 Years

Hayli Gubbi Volcano Erupts After 12,000 Years

ఆఫ్రికాలోని ఇథియోపియాలో హైలీ గుబ్బి అనే అగ్నిపర్వతం దాదాపు 12 వేల ఏళ్ల తర్వాత బద్ధలైంది. నవంబర్ 23న ఉదయం డనాకిల్ ప్రాంతంలో ఈ విస్ఫోటనం జరిగినట్లు అధికారులు గుర్తించారు. వేల ఏళ్లుగా భూమి కింద నిశబ్ధంగా ఉన్న అగ్నిపర్వతం నుంచి ఏకంగా 15 కిలోమీటర్ల ఎత్తు వరకు బడిద ఎగిసిపడింది. దీనికి సంబంధించిన వీడియోలు కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. 

Also Read: ముస్లిం బ్రదర్ హుడ్ సంస్థలపై ఉగ్రవాద ముద్ర..ట్రంప్ కీలక నిర్ణయం

Hayli Gubbi Volcano Erupts After 12,000 Years

ఇది అత్యంత అరుదైన విస్పోటనమని టూలూస్‌ వోల్కానిక్ యాష్ అడ్వైజరీ సెంటర్ (VAAC) రిపోర్టు వెల్లడించింది. ఈ వోలకనో ఎర్రసముద్రం దాటి యెమెన్, ఒమాన్ వైపు కదులుతున్నట్లు పేర్కొంది. అక్కడ వేడి ఎక్కువగా ఉండటంతో భూగర్భ పరిశోధకులు శాటిలైట్ డేటా, వాతావరణ రీడింగ్స్ ఆధారంగా పరిశీలిస్తున్నట్లు తెలిపింది. అయితే హైలీ గుబ్బి అగ్నిపర్వతం అనేది హోలోసీన్ అంటే ఐస్ ఏజ్ ముగిసిన అనతంరం 11,700 ఏళ్లుగా ఎప్పుడూ కూడా విస్ఫోటనం కాలేదని పరిశోధకులు నిర్ధారించారు. 

Also Read: స్నేహమంటూనే చైనా మరో కుట్ర.. సరిహద్దుల్లో డ్రోన్‌ పరీక్షా కేంద్రం ఏర్పాటు

అగ్నిపర్వతం పేలుడు ప్రభావంతో వాతావరణంలో సల్ఫర్ డయాక్సైడ్ స్థాయిలు పెరిగాయి. దీంతో యెమన్, ఒమన్ ప్రాంతాల వాళ్లు జాగ్రత్తగా ఉండాలని అధికారులు సూచనలు చేశారు. అంతేకాదు పలు మార్గాల్లో విమానాలు కూడా మళ్లించారు. మరోవైపు ఉత్తర భారత్‌ వైపుగా దీని ప్రభావం ఉండే ఛాన్స్ ఉన్నట్లు తెలుస్తోంది. దీంతో భారత విమానయాన అధికారులు అలెర్ట్ అయ్యారు. సోమవారం కన్నూర్ నుంచి అబుదాబీ వెళ్తున్న ఇండిగో విమానాన్ని అహ్మదాబాద్‌కు మళ్లించారు. 

Advertisment
తాజా కథనాలు