Israel: సజీవంగానే హమాస్‌ అధినేత!

హమాస్‌ అధినేత యహ్యా సిన్వార్‌ ఇజ్రాయెల్‌ దాడుల్లో మృతి చెందినట్లు అనుమానాలు వ్యక్తం అయ్యాయి. కానీ ఆయన సజీవంగానే ఉన్నారని, ఖతార్‌ తో రహస్యంగా సంబంధాలను ఏర్పర్చుకుంటున్నారని సమాచారం.

New Update
quatar

Israel : అక్టోబర్‌ 7 నాటి దాడుల రూపకర్త, హమాస్‌ అధినేత యహ్యా సిన్వార్‌ ఇజ్రాయెల్‌ దాడుల్లో మృతి చెందినట్లు అనుమానాలు వ్యక్తం అయ్యాయి. కానీ ఆయన సజీవంగానే ఉన్నారని, ఖతార్‌ తో రహస్యంగా సంబంధాలను ఏర్పర్చుకుంటున్నారని సమాచారం. ఈ మేరకు ఇజ్రాయెల్‌ కు చెందిన పలు మీడియా కథనాలు ఈ విషయాన్ని వెల్లడించాయి.

Also Read: అజ్మేర్‌ లో  విజయవాడ న్యాయవాదుల బస్సుకు ప్రమాదం..ఒకరి మృతి!

హమాస్‌ అధినేత యహ్యా సిన్వార్‌ సజీవంగా ఉన్నారని ఓ సీనియర్‌ ఖతర్‌ దౌత్యవేత్త తన సామాజిక మాధ్యమంలో పోస్ట్‌ చేసినట్లు మీడియా కథనాలు వెల్లడించాయి. అయితే ఆయన చుట్టూ ఇజ్రాయెల్‌ బందీలను తనకు రక్షణ కవచంగా ఉంచుకున్నటల్ఉ ఖతర్‌ అధికారులు గతంలో పేర్కొన్నట్లు సమాచారం.

Also Read:  బ్రహ్మోత్సవాలలో గరుడ వాహన విశిష్టత ఏంటి?

గతనెల 21న ఇజ్రాయెల్‌ హమాస్‌ కమాండ్‌ సెంటర్‌ లక్ష్యంగా భీకర దాడులు చేసినట్లు ఇజ్రాయెల్‌ దళాలు తెలిపాయి. వీటిలో సిన్వార్‌ మృతి చెందినట్లు అంతా భావించారు. కానీ వారి నుంచి ఎలాంటి ప్రకటనలు వెలువడకపోవడంతో అవి మరింత బలపడ్డాయి.

Also Read: 20 కౌంటింగ్‌ కేంద్రాలు..1031 మంది అభ్యర్థులు..మూడంచెల భద్రత!

ఇజ్రాయెల్‌ జరిపిన దాడుల్లో 22 మంది మృతి చెందినట్లు పాలస్తీనా ఆరోగ్యశాఖ అధికారులు చెప్పారు. అక్టోబర్‌ 7న ఇజ్రాయెల్‌ పై దాడులకు ప్రధాన సూత్రధారి అయిన సిన్హార్‌...ఈ ఏడాది ఆగస్టులో హమాస్‌ అధినేతగా నియమితులయ్యారు.  

Also Read: జమ్ముకశ్మీర్‌ లో కొత్త పొత్తు పొడవనుందా?

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు