Haryana: 20 కౌంటింగ్‌ కేంద్రాలు..1031 మంది అభ్యర్థులు..మూడంచెల భద్రత!

హర్యానా అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి ఓట్ల లెక్కింపు ఉదయం 8 గంటల నుంచే ప్రారంభిస్తామని ఎలక్షన్‌ కమిషన్‌ తెలిపింది. 90 అసెంబ్లీ నియోజకవర్గాలకు ఒకేసారి ఎన్నికలు జరిగాయి. మొత్తం 1,031 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు.

New Update
Haryana - Kashmir Election Results

Election Commission: జమ్మూ కశ్మీర్, హర్యానా అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి ఓట్ల లెక్కింపు మరికాసేపట్లో ప్రారంభం కానుంది. ఈ మేరకు ఎన్నికల అధికారులు అన్ని ఏర్పాట్లను ఇప్పటికే పూర్తి చేశారు. ఉదయం 8 గంటల నుంచే కౌంటింగ్ ప్రారంభిస్తామని ఎలక్షన్‌ కమిషన్‌ ప్రకటించిన సంగతి తెలిసిందే. దీంతో ఎన్నికల బరిలో నిలిచిన పార్టీ ఏజెంట్లందరూ కూడా తెల్లవారుజామున ఐదు గంటలకే ఓట్ల లెక్కింపు కేంద్రాల వద్దకు రావాలని ఎన్నికల కమిషన్‌ ఆదేశాలు జారీ చేసింది.

Also Read: బ్రహ్మోత్సవాలలో గరుడ వాహన విశిష్టత ఏంటి?

కౌంటింగ్ సమయంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలకు తావివ్వకుండా రెండు రాష్ట్రాల్లో గట్టిబందోబస్తు ఏర్పాటు చేసినట్లు సెంట్రల్ ఎన్నికల కమిషన్  ప్రకటించింది. హర్యానాలోని అన్ని పోలింగ్ కేంద్రాల్లో మూడంచెల భద్రత ఏర్పాటు చేసినట్లు స్టేట్ చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్ పంకజ్ అగర్వాల్ వివరించారు. 

Also Read: జమ్మూకశ్మీర్‌ , హర్యానా ఎన్నికల ఫలితాలు..ప్రజల తీర్పుపై ఉత్కంఠ

ఈ నెల 5వ తేదీన హర్యానాలోని 90 అసెంబ్లీ నియోజకవర్గాలకు ఒకేసారి ఎన్నికలు జరిగాయి. మొత్తం 1,031 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. వీరిలో 464 మంది ఇండిపెండెంట్లు, 101 మహిళలు పోటీ చేస్తున్నారు. ఎన్నికల రోజున 67.90 శాతం ఓటింగ్ నమోదైంది. ఇటీవల విడుదలైన ఎగ్జిట్​పోల్ ఫలితాలన్నీ కూడా కాంగ్రెస్​కే అనుకూలంగా ఉన్నాయి. అటు బీజేపీ నేతలు మాత్రం గెలుపుపై ధీమా వ్యక్తం చేస్తున్నారు. 

Also Read: జమ్ముకశ్మీర్‌ లో కొత్త పొత్తు పొడవనుందా?

వరుసగా మూడో సారి బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వస్తుందని అంటున్నారు. అదేవిధంగా, జమ్మూ కశ్మీర్​లోనూ ఓట్ల లెక్కింపునకు ఈసీ అన్ని ఏర్పాట్లు చేసింది. మొత్తం 20 కౌంటింగ్ సెంటర్లను సిద్ధం చేసింది. అభ్యర్థులు, ఎన్నికల సిబ్బంది, ఆయా పార్టీల ఏజెంట్లను మాత్రమే కౌంటింగ్ హాల్​లోకి అనుమతిస్తామని ఎలక్షన్‌ కమిషన్‌ తెలిపింది. 

Also Read: 3 తుపాన్ల ముప్పు.. ఏపీలో మరో మూడు రోజుల్లో భారీ వర్షాలు!

Advertisment
Advertisment
తాజా కథనాలు