Garudaseva: బ్రహ్మోత్సవాలలో గరుడ వాహన విశిష్టత ఏంటి?

తిరుమల శ్రీవారికి ప్రియసఖుడు గరుత్మంతుడు. స్వామి వారి బ్రహ్మోత్సవాలలో ఐదో రోజు రాత్రి ఎంతో వేడుకగా జరిగే గరుడసేవ అత్యంత విశిష్టమైంది. దాని గురించి పూర్తి వివరాలు ఈ ఆర్టికల్‌ లో..

New Update
ttd

Garuda Seva: తిరుమల శ్రీవారికి ప్రియసఖుడు గరుత్మంతుడు. స్వామి వారి బ్రహ్మోత్సవాలలో ఐదో రోజు రాత్రి ఎంతో వేడుకగా జరిగే గరుడసేవ అత్యంత విశిష్టమైంది. గరుడవాహనం అధిరోహిచే స్వామిమూర్తి మలయప్పకు మూలవిరాట్టుకున్న మకరకంఠి, సహస్రనామహారం, లక్ష్మీహారం, పచ్చ ఇలా అన్ని నగలను అలంకరిస్తారు. మూలవిరాట్టే ఈ వాహనాన్ని ఆవహించి భక్తులను అనుగ్రహిస్తారని పురాణాలు చెబుతున్నాయని పండితులు చెబుతున్నారు.

Also Read: Ratan Tata కు సీరియస్.. క్లారిటీ!

గరుడసేవ ఊరేగింపు సమయంలో స్వామి ఆలయాన్ని విడిచి వచ్చి తిరుమాడ వీధులలో సంచరిస్తారని భక్తుల నమ్మకం. అందుకే అశేష సంఖ్యలో భక్తులు గరుడసేవకు హాజరు అవుతారు. అంతేకాక గరుత్మంతుడు స్వామికి దాసుడు, సఖుడు, వాహనం, పతాక చిహ్నం, గరుత్మంతునికి తెలియని స్వామి రహస్యాలుండవని ప్రజల విశ్వాసం.

Also Read: 3 తుపాన్ల ముప్పు.. ఏపీలో మరో మూడు రోజుల్లో భారీ వర్షాలు!

గరుడసేవలో స్వామిని దర్శిస్తే కోర్కెలు తీరుతాయని, ముల్లోకాల దేవతలు కూడా గరుడసేవలో స్వామివారిని దర్శించడానికి వస్తారని భక్తులు నమ్ముతారు. తొమ్మిది రోజులు జరిగే బ్రహ్మోత్సవాల్లో ఇది చాలా విశేషమైనది కావడంతో స్వామి వారిని దర్శించుకోవడానికి వేలలో ఉండే భక్తుల సంఖ్య ఇప్పుడు లక్షలకు పెరిగింది.

Also Read: షాకింగ్.. శబరిమల ప్రసాదంలో ఏముందంటే?

బ్రహ్మోత్సవాల్లో స్వామి వారికి అలంకరించే గొడుగులను ప్రత్యేకంగా చెన్నైలో తయారు చేస్తారు.  వాటిని గరుడోత్సవంనాడు నూతన గొడుగులను సమర్పించే విధానం అనాదిగా వస్తోంది. భక్తిశ్రద్ధలతో ఈ గొడుగులను తయారుచేసి చెన్నై నుంచి ఐదు రోజుల పాటు పాదయాత్రతో తిరుమలకు చేరుకుంటారు. ఆలయం ప్రదక్షిణ పూర్తి చేసిన తరువాత తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులకు గొడుగులను అందజేస్తారు. వీటిలో రెండు స్వర్ణకాంతులు, మరో ఏడు శ్వేత కాంతులతో ఉంటాయని పండితులు తెలిపారు.

Also Read: కెనడాలో వెయిటర్‌ ఉద్యోగం కోసం ఎగబడుతున్న వేల మంది భారతీయులు!

Advertisment
Advertisment
తాజా కథనాలు