Jammu Kashmir: జమ్ముకశ్మీర్‌ లో కొత్త పొత్తు పొడవనుందా?

జమ్మూ కశ్మీర్‌లో ఏ పార్టీ కూడా మెజారిటీ మార్కును అందుకోదని.. ఎగ్జిట్ పోల్స్ అన్నీ దాదాపు హంగ్ వైపే మొగ్గు చూపాయి. జమ్మూలో బీజేపీకి, కశ్మీర్‌ లోయలో మాత్రం నేషనల్ కాన్ఫరెన్స్(ఎన్సీ)-కాంగ్రెస్ కూటమి ఎక్కువ స్థానాలు గెలుచుకుంటుందని పోల్స్‌ అంచనా వేశాయి.

New Update
Haryana - Kashmir Election Results

Jammu Kashmir: జమ్ముకశ్మీర్‌ లో కొత్త పొత్తులు ఏర్పడే సూచనలు చాలా కనపడుతున్నాయి. నిన్నటి వరకు బద్ధ శత్రువులుగా ఉన్నవారు కూడా...ఎన్నికల రిజల్ట్స్‌ వచ్చిన తరువాత మిత్రులు అయ్యే అవకాశాలు చక్కగా కనపడుతున్నాయి.  జమ్మూ కశ్మీర్ ఎన్నికల్లో ఏ పార్టీకి అక్కడి ప్రజలు పట్టం కట్టేలా కనిపించడం లేదని ఇప్పటివరకు విడుదలైన మెజారిటీ ఎగ్జిట్ పోల్ అంచనాలను చూస్తే తెలుస్తుంది. ఈ నేపథ్యంలోనే నేడు వెలువడనున్న జమ్మూ కశ్మీర్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. 

Also Read: హాంకాంగ్ సిక్సెస్ టోర్నీలో పాల్గొననున్న భారత్, పాక్ జట్లు

ఏ ఎన్నికలైనా ఎగ్జిట్ పోల్స్ వచ్చిన తర్వాత ఒక కొలిక్కి వస్తాయి. కానీ జమ్మూ కశ్మీర్‌ ఎగ్జిట్ పోల్స్ మాత్రం ఏ పార్టీకి పట్టం కట్టకుండా హంగ్ అనే సంకేతాలు ఇవ్వడంతో ఇప్పటికే కాంగ్రెస్‌తో జట్టుకట్టిన ఫరూక్ అబ్దుల్లా నేతృత్వంలోని నేషనల్ కాన్ఫరెన్స్ కూటమి.. విధి లేని పరిస్థితుల్లో మెహబూబా ముఫ్తీ నేతృత్వంలో పీడీపీతో పొత్తు పెట్టుకోవాల్సిన అనివార్య పరిస్థితులు ఏర్పడ్డాయి. అయితే ఇవన్నీ తేలాలంటే మరి కొద్దిసేపు ఆగాల్సిందే.

Also Read: కాంగ్రెస్ పునరుజ్జీవం..హర్యానాలో ఓట్లన్నీ అటేనా?

జమ్మూ కశ్మీర్‌లో ఏ పార్టీ కూడా మెజారిటీ మార్కును అందుకోదని.. దాదాపు ఎగ్జిట్ పోల్స్ అన్నీ హంగ్ అసెంబ్లీ వైపే మొగ్గు చూపాయి. జమ్మూలో బీజేపీకి గణనీయమైన సీట్లు వస్తాయని.. కశ్మీర్‌ లోయలో మాత్రం నేషనల్ కాన్ఫరెన్స్(ఎన్సీ)-కాంగ్రెస్ కూటమి ఎక్కువ స్థానాలు గెలుచుకుంటుందని అంచనా వేశాయి. ఇక మెహబూబా ముఫ్తీకి చెందిన పీడీపీ కేవలం సింగిల్ డిజిట్‌కే పరిమితమవుతుందని సర్వేలు అంచనా వేశాయి. అయితే అటు బీజేపీకి గానీ, ఇటు కాంగ్రెస్ ఎన్‌సీ కూటమికి గానీ మెజార్టీ స్థానాలు దక్కవని ఎగ్జిట్ పోల్స్ పేర్కొనడంతో కాంగ్రెస్ ఎన్‌సీ కూటమి, పీడీపీ కలిసే అవకాశాలు భారీగానే కనపడుతున్నాయి.

Also Read: జమ్మూ–కాశ్మీర్‌‌లో మళ్ళీ హంగ్ తప్పదా..మరికాసేట్లో తేలనున్న భవితవ్యం

ఇలాంటి పరిస్థితుల్లో నేషనల్ కాన్ఫరెన్స్ అధ్యక్షుడు ఫరూక్ అబ్దుల్లా ఆదివారం ఈ ఎన్నికల ఫలితాల గురించి కీలక వ్యాఖ్యలు చేశారు. అవసరమైతే మెహబూబా ముఫ్తీకి చెందిన పీడీపీ మద్దతుతో జమ్మూ కశ్మీర్‌లో ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి తమ పార్టీ సిద్ధంగా ఉందని ఆయన తేల్చి చెప్పారు. పీడీపీ నుంచి మద్దతు తీసుకుంటారా అని మీడియా అడిగిన ప్రశ్నకు ఫరూక్ అబ్దుల్లా ఈ సమాధానం ఇచ్చారు. జమ్మూ కశ్మీర్ ప్రజల స్థితిగతులను మెరుగుపరచడం కోసం.. యువతలో నిరుద్యోగం తొలగించడం కోసం.. గత 10 ఏళ్లలో నెలకొన్న అన్ని సమస్యలను తొలగించడం కోసం.. మనమందరం ఒకే లక్ష్యం కోసం పనిచేయాలని అన్నారు. 

Also Read:  నేడే హర్యానా, జమ్మూకశ్మీర్‌ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు..

ఇందుకోసం మనం చేయవలసిన మొదటి పని జమ్మూ కశ్మీర్‌కు రాష్ట్ర హోదా పునరుద్ధరించడం.. పత్రికా స్వేచ్ఛను పునరుద్ధరించడం అని పేర్కొన్నారు. ఎన్నికల్లో ఏది నిజం, ఏది అబద్ధమో చెప్పే హక్కు ఉండాలని.. మేము ఎన్నికల్లో ప్రత్యర్థులం అని పీడీపీని ఉద్దేశించి అన్నారు. పీడీపీ మద్దతుకు తనకు ఎలాంటి అభ్యంతరం లేదని.. కాంగ్రెస్‌ పార్టీకి కూడా ఎలాంటి అభ్యంతరం ఉండకపోవచ్చని ఫరూఖ్ అబ్దుల్లా తెలిపారు.

Also Read: దేశంలో కాంగ్రెస్ గ్రాఫ్ పెరుగుతోందా..పార్టీ పునర్వైభవం సాధిస్తుందా?

అయితే ఫరూఖ్ అబ్దుల్లా కుమారుడు, మాజీ సీఎం ఒమర్ అబ్దుల్లా మాత్రం కాంగ్రెస్-ఎన్‌సీ కూటమికి మెహబూబ్ ముఫ్తీ పార్టీ మద్దతు వార్తల్ని ఊహాగానాల్ని వారు కొట్టిపారేశారు. ఎగ్జిట్ పోల్స్ వెలువడిన తర్వాత ఎన్సీ-కాంగ్రెస్ కూటమికి పీడీపీ మద్దతు ఇస్తుందనే వార్తలు గట్టిగా వినపడుతున్న వేళ ఒమర్ అబ్దుల్లా వాటిని ఖండించారు. 

Also Read: జమ్మూకశ్మీర్‌ , హర్యానా ఎన్నికల ఫలితాలు..ప్రజల తీర్పుపై ఉత్కంఠ

ఇక పీడీపీ నాయకురాలు మొహబూబా ముఫ్తీ కుమార్తె ఇల్తిజా ముఫ్తీ కూడా ఈ వార్తలను ఖండించారు. జమ్మూ కశ్మీర్‌కు ప్రత్యేక ప్రతిపత్తి కల్పించే ఆర్టికల్ 370ని 2019లో నరేంద్ర మోదీ ప్రభుత్వం.. రద్దు చేసిన తర్వాత అక్కడ జరుగుతున్న తొలి అసెంబ్లీ ఎన్నికలు ఇవే కావడంతో విజయం ఎవర్ని వరిస్తుందనేదానిపై సర్వత్రా ఉత్కంఠ ఏర్పడింది.

Also Read: రాష్ట్ర పరిణామాలు ప్రధానికి వివరించా– సీఎం చంద్రబాబు

Advertisment
Advertisment
తాజా కథనాలు