BIG BREAKING: వెళ్లి భారత్ తో మాట్లాడండి.. పాక్ కు అమెరికా కీలక సూచన!

భారత్, పాకిస్థాన్ ల మధ్య ఉద్రిక్తల నేపథ్యంలో పరిస్థితి మరింత చేయి దాటక ముందే భారత్‌తో తక్షణం చర్చలు జరపాలని పాకిస్థాన్‌ను అమెరికా కోరింది. ఈమేరకు పాక్‌ ఆర్మీ చీఫ్‌ ఆసిమ్‌ మునీర్‌తో అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో ఫోన్‌లో మాట్లాడినట్లు తెలిసింది.

New Update

పహల్గాంలో పాక్‌ ప్రేరేపిత ఉగ్రవాదులు 26 మంది టూరిస్టులను పొట్టన పెట్టుకున్నారు. దీంతో భారత్‌ ప్రతీకార దాడులకు దిగింది. పలు ఉగ్రస్థావరాలపై మెరుపుదాడులు చేసింది. దాంతో పాక్‌ భారత్‌పై దాడులకు దిగింది. ఆ దాడులను సమర్థవంతంగా తిప్పికొట్టిన భారత్‌ పాక్‌ లోని పలు వ్యవస్థలను చిన్నాభిన్నాం చేసింది. ఈ క్రమంలో  రెండు దేశాలను మొదటి నుంచి గమనిస్తున్న అగ్రరాజ్యం అమెరికాయుద్ధ విరమణకు ప్రయత్నిస్తోంది. ట్రంప్‌ ఆదేశాలతో రంగంలోకి దిగిన అమెరికా విదేశాంగ ప్రధాన కార్యదర్శి రూబేనా ఇరు దేశాలు ఉద్రిక్తతలను తగ్గించుకోవాలని చూచించారు.

ఇది కూడా చూడండి:BIG BREAKING: పాక్ ఫైటర్ జెట్ పైలెట్ ను సజీవంగా పట్టుకున్న భారత్

పరిస్థితి మరింత చేయి దాటక ముందే భారత్‌తో తక్షణం చర్చలు జరపాలని పాకిస్థాన్‌ను అమెరికా కోరింది. ఈమేరకు పాక్‌ ఆర్మీ చీఫ్‌ ఆసిమ్‌ మునీర్‌తో అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో ఫోన్‌లో మాట్లాడినట్లు తెలిసింది. భారత్- పాక్‌ల మధ్య ఉద్రిక్తతలు కొనసాగుతున్న నేపథ్యంలో రూబియో కాల్‌ చేసి పరిస్థితులపై ఆరా తీశారు. పెరుగుతున్న సైనిక ఉద్రిక్తతలను తగ్గించడానికి తక్షణం చర్యలు తీసుకోవాలని రూబియో పాక్‌కు సూచించారని విదేశాంగశాఖ తెలిపింది. 

ఇది కూడా చూడండి: Pakistan: 'మా రాజకీయ నేతల ఇళ్లపై దాడులు చేయండి'.. పాక్‌లో ప్రజల తిరుగుబాటు

రెండు దేశాల మధ్య ఉద్రిక్తతలు మరింత తీవ్రతరం కాకుండా ఉండేందుకు ఇరు దేశాల మధ్య తాము మధ్యవర్తిత్వం చేస్తామని అమెరికా ప్రతిపాదించింది.  మరో వైపు భారత విదేశాంగ మంత్రి జై శంకర్‌తోనూ రూబియో ఫోన్‌లో మాట్లాడారు. భారత్‌- పాక్‌ల మధ్య ఉద్రిక్తతలు సద్దుమణిగేలా చర్యలు చేపట్టి శాంతియుత వాతావరణానికి కృషి చేయాలని సూచించారు. ఇరుదేశాల మధ్య వివాదాలు ముగింపునకు అమెరికా సహకారం అందించేందుకు సిద్ధంగా ఉందన్నారు. కాగా  ఈ విషయమై జై శంకర్ మాట్లాడుతూ భారత్‌ విధానం ఎప్పుడూ బాధ్యతాయుతంగానే ఉంటుందని స్పష్టం చేశారు.

ఇది కూడా చూడండి: IND-PAK WAR: వైమానిక దాడులు పగలు కాకుండా రాత్రే ఎందుకు జరుగుతాయి.. సీక్రెట్ ఇదే!

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు