Online Games: అమల్లోకి వచ్చిన చట్టం.. ఆన్ లైన్ మనీ గేమింగ్ బంద్

రెండు రోజుల క్రితం లోక్ సభలో ప్రవేశపెట్టిన ఆన్ లైన్ గేమింగ్ చట్టం రాష్ట్రపతి ఆమోదం పొంది అమల్లోకి వచ్చింది. దీని ప్రకారం దేశంలో అన్ని రకాల ఆన్ లైన్ మనీ గేమ్స్ పై నిషేధం విధించారు. అయితే ఇ-స్పోర్ట్స్, ఆన్‌లైన్‌ సోషియల్‌ గేమింగ్‌ను ప్రోత్సహించనున్నారు. 

New Update
Online Betting

Online Betting

ఆన్ లైన్ గేమింగ్స్ నిర్వహించే వారి ఆట ఇకపై కట్టవనుంది. ఇది ఆడితే మనీ ఇస్తాము అనే యాడ్స్ ఇక కనిపించవు. దేశంలోకి కొత్త చట్టం అమల్లోకి వచ్చింది.  ఇస్పోర్ట్స్, ఆన్‌లైన్‌ సోషియల్‌ గేమ్స్‌ ప్రోత్సాహం, నియంత్రణ విషయంలో ఐటీ శాఖ ఒక వ్యవస్థను తీసుకురానుంది. దాంతో పాటూ ప్రమోషన్ అండ్ రెగ్యులేషన్ ఆఫ్ ఆన్ లైన్ గేమింగ్ బిల్ 2025 లో చెప్పిన నియంత్రణ ఏర్పాటు చేయనున్నారని ఐటీ కార్యదర్శి ఎస్.కృష్ణన్ తెలిపారు. ఈ కొత్త చట్టంతో దేశంలో అన్ని రకాల ఆన్ లైన్ మనీ గేమ్స్ పై నిషేధం విధిస్తున్నారు. అయితే ఇప్పటికే పలు సంస్థలు రియల్ మనీ గేమ్ లను నిలిపేశాయి. అదే సమయంలో ఇ-స్పోర్ట్స్, ఆన్‌లైన్‌ సోషియల్‌ గేమింగ్‌ను ప్రోత్సహించనున్నారు. 

అన్ని ఆటలూ బంద్..

ఈ కొత్త చట్టం ప్రకారం పోకర్ బాజీ, రమ్మీ, ఫాంటసీ క్రికెట్, పోకర్‌ వంటి 100కు పైగా రియల్‌ మనీ గేమ్స్‌ ఉన్న విన్‌జో కూడా నిలిచిపోనున్నాయి. వీటితో పాటూ నిలిపివేసింది. ఆసియా, ఐరోపా, ఉత్తర అమెరికాల్లో 12 కోట్ల మంది వినియోగదార్లున్న మొబైల్‌ ప్రీమియర్‌ లీగ్‌ పై సైతం వేటు పడనుంది. జుపీ కూడా అన్ని పెయిడ్ గేమ్స్ నూ నిలిపేసింది. ఆన్ గేమింగ్ ఆగిపోవడంతో నజరానా షేర్లు ఒక్కసారికి పడిపోయాయి. ఇవి మూడు రోజుల్లో 17.52 శాతం విలువను కోల్పోయాయి. 

రూ. 20,000 కోట్ల వరకు జీఎస్టీ

ఈ కంపెనీలలో చాలా వరకు స్టార్టప్‌లు ఉన్నాయి, ఇవి విదేశీ పెట్టుబడులను ఆకర్షించాయి.  ఈ రంగంలో సుమారు రూ. 25,000 కోట్ల పెట్టుబడులు, ముఖ్యంగా విదేశీ పెట్టుబడులు, వృథా అయ్యే ప్రమాదం ఉంది. భవిష్యత్తులో ఈ రంగంలో కొత్త పెట్టుబడులు రావడం కూడా ఆగిపోవచ్చు. ఆన్‌లైన్ గేమింగ్ పరిశ్రమ ప్రతి సంవత్సరం రూ. 20,000 కోట్ల వరకు జీఎస్టీ ద్వారా ప్రభుత్వానికి ఆదాయాన్ని అందిస్తుంది. నిషేధం కారణంగా ఈ ఆదాయం భారీగా తగ్గుతుంది. చట్టబద్ధమైన భారతీయ కంపెనీలు మూతపడితే, వినియోగదారులు అంతర్జాతీయ, చట్టవిరుద్ధమైన బెట్టింగ్ వెబ్‌సైట్లు మరియు యాప్‌ల వైపు మళ్లే అవకాశం ఉంది. దీనివల్ల ఆర్థిక మోసాలు, మనీ లాండరింగ్ వంటి అక్రమ కార్యకలాపాలు పెరిగే ప్రమాదం ఉంది. ఆన్‌లైన్ గేమింగ్ కంపెనీలు ముఖ్యంగా క్రికెట్, కబడ్డీ, ఫుట్‌బాల్ వంటి క్రీడలకు భారీగా స్పాన్సర్‌షిప్ అందిస్తున్నాయి.

ఈ బిల్లు వల్ల ఈ స్పాన్సర్‌షిప్‌లు నిలిచిపోయి, క్రీడా రంగానికి నష్టం వాటిల్లవచ్చు.  ఈ బిల్లు రియల్ మనీ గేమింగ్‌ను నిషేధిస్తున్నప్పటికీ, ఈ-స్పోర్ట్స్‌ను ప్రోత్సహిస్తుంది. అయితే, చాలా కంపెనీలు ఈ-స్పోర్ట్స్‌తో పాటు రియల్ మనీ గేమింగ్ సేవలను కూడా అందిస్తున్నాయి. కొత్త చట్టం వల్ల ఈ మొత్తం వ్యాపార నమూనా దెబ్బతింటుంది. ఈ బిల్లు వలన యువతలో పెరుగుతున్న ఆన్‌లైన్ గేమింగ్ వ్యసనాన్ని, ఆర్థిక నష్టాలను అరికట్టాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. 

Also Read:Trump New Plan: భారతదేశంలో అమెరికా రాయబారిగా సెర్గియో గోర్.. ట్రంప్ కుట్ర అదేనా?

Advertisment
తాజా కథనాలు