/rtv/media/media_files/2026/02/27/russia-ukraine-war-2026-02-27-10-02-41.jpg)
Russia Ukraine War
రష్యా ఉక్రెయిన్ మధ్య దాడులు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. బుధవారం రాత్రి ఉక్రెయిన్‌పై రష్యా దాడులు ప్రారంభించింది. 8 ప్రాంతాలను లక్ష్యంగా చేసుకొని 420 డ్రోన్లు, 39 మిసైల్స్‌తో విరుచుకుపడింది. ఇందులో 11 బాలిస్టిక్ మిసైల్స్ కూడా ఉన్నాయి. ఈ దాడిలో పదుల సంఖ్యలో ఉక్రెయిన్ వాసులు గాయాలపాలయ్యారు. వీళ్లలో చిన్నారులు కూడా ఉన్నారు. తమ దేశం పైకి వచ్చిన 17 ఉక్రెయిన్ డ్రోన్లను బుధవారం రాత్రి కూల్చేశామని రష్యా రక్షణ శాఖ అధికారులు తెలిపారు.
Also read: మెట్రోలో కరెంట్ పోతే టెన్షన్ వద్దు.. గ్రిడ్ ఫెయిల్ అయినా రైలు ఆగదు!
ఈ యుద్ధంలో మరణించిన వెయ్యి మంది ఉక్రెయిన్ సైనికుల మృతదేహాలను ఆ దేశానికి అప్పగించామని రష్యా అధికారి వ్లాదిమిర్ మేదిన్స్కీ పేర్కొన్నారు. ఉక్రెయిన్ కూడా 35 మంది రష్యా సైనికుల మృతదేహాలను అప్పగించినట్లు చెప్పారు. కానీ ఈ అప్పగింతలు ఎప్పుడు జరిగాయనేవి మాత్రం వెల్లడించలేదు. ఇదిలాఉండగా ఈ యుద్ధంలో ఉక్రెయిన్ తరఫున 75 దేశాలకు చెందిన 10 వేల మందికి పైగా వాలంటీర్లు పోరాడుతున్నట్లు రష్యా ప్రభుత్వ వార్తాసంస్థ టాస్ గురువారం ఓ కథనంలో రాసుకొచ్చింది. అంతేకాదు నెలనెలా దాదాపు 600 మంది కొత్త వ్యక్తులు ఉక్రెయిన్ తరఫున పోరాడేందుకు వస్తున్నట్లు పేర్కొంది.
Also Read: కూతురిని చంపి డ్రామా ఆడిన లేడీ డాక్టర్.. పోస్ట్‌మార్టంతో అసలు రంగు బయటపడింది!
ఇదిలాఉండగా ఉక్రెయిన్ యుద్ధంలో రష్యా తరఫున పోరాటం చేస్తూ తమ దేశానికి చెందిన ఇద్దరు వ్యక్తులు చనిపోయినట్లు దక్షిణాఫ్రికా విదేశాంగ శాఖ తెలిపింది. వాళ్లు రిక్రూట్మెంట్ స్కీమ్ పేరుతో మోసపోయి రష్యాకు వెళ్లినట్లు పేర్కొంది. చివరికి యుద్ధంలోకి దిగి మృతి చెందినట్లు చెప్పింది.
Follow Us