/rtv/media/media_files/2025/05/16/Aez9WwBrwVR1jTEYidjw.jpg)
James Comey
James Comey : అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌ను చంపేస్తానని ఎఫ్‌బీఐ మాజీ డైరెక్టర్ జేమ్స్ కామీ ఇన్ స్టాలో పోస్ట్ చేయడం కలకలం రేపింది. జేమ్స్ కామీ తన ఇన్ స్టాలో ‘86 47’ అనే పదాలను పోస్టు చేశారు. అయితే కొంత సేపటికే వాటిని డిలీట్ చేశారు. అయితే ట్రంప్ అమెరికాకు 47 వ అధ్యక్షుడు. అంటే 47వ అధ్యక్షుడిని చంపడం అనే అర్థం వచ్చేలా కామీ పోస్టు ఉండటంతో అధికారులు దర్యాప్తు చేస్తున్నారు. కాగా ఈ విషయమై కామీ మాట్లాడుతూ తనకు హింస అంటే ఇష్టం లేదని, పోస్టును తప్పుగా అర్థం చేసుకున్నారని స్పష్టత ఇచ్చారు.
Also Read: రౌడీ స్టార్ ఫ్యాన్సీ కి బ్యాడ్ న్యూస్.. 'కింగ్ డమ్' రిలీజ్ లేదు!
డొనాల్డ్ ట్రంప్ తన మొదటి పదవీకాలంలో FBI డైరెక్టర్ గా ఉన్న జేమ్స్ కోమీని తొలగించారు. అయితే ఆయన తన బీచ్ వాకింగ్‌కు వెళ్లిన సమయంలో అక్కడ లభించిన గవ్వలతో "8647" అని ఇసుకపై రాసి దాన్ని ఫోటో తీసి తన ఇన్ స్టాలో పోస్ట్ చేశారు. ఆ సముద్రపు గవ్వల ఫోటోను కోమీ ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేయడంతో వివాదం ప్రారంభమైంది, "నా బీచ్ వాక్‌లో కూల్ షెల్ నిర్మాణం " అనే శీర్షికతో దాన్ని షేర్ చేశారు. అయితే దానిపై విమర్శలు రావడంతో తొలగించి నప్పటికీ స్క్రీన్‌షాట్‌లు విస్తృతంగా వ్యాపించాయి. ఆ పోస్ట్ పై ట్రంప్ మద్దతుదారులు, కాంగ్రెస్ సభ్యులు,మాజీ ప్రభుత్వ అధికారుల నుండి తీవ్ర వ్యతిరేకతలు వస్తున్నాయి.
Also Read: కడపలో కలకలం.. బార్డర్‌కి వెళ్లిన ఆర్మీ ఉద్యోగి మిస్సింగ్..!
డోనాల్డ్ ట్రంప్ జూనియర్ కోమీ "నా తండ్రిని హత్య చేయాలని కోమీ పిలుపునిచ్చాడు" అని ఆరోపించగా, మేఘన్ మెక్‌కెయిన్, క్రిస్టి నోయెమ్ వంటి ప్రముఖులు ఈ పోస్ట్‌ను చాలా ప్రమాదకరమైందిగా పేర్కొనడంతో పాటు దానిపై దర్యాప్తు చేయాలని కోరారు. కాగా దీనిపై యుఎస్ సీక్రెట్ సర్వీస్ , డిపార్ట్‌మెంట్ ఆఫ్ హోమ్‌ల్యాండ్ సెక్యూరిటీ ఈ విషయాన్ని సమీక్షిస్తున్నట్లు ధృవీకరించాయి, FBI కూడా మద్దతు ఇస్తున్నట్లు పేర్కొంది. చాలా కాలంగా ట్రంప్ పై విమర్శలు చేస్తున్న కోమీ, ఆ చిత్రాన్ని తప్పుగా అర్థం చేసుకున్నారని పేర్కొంటూ తొలిగించారు. తను హింసకు వ్యతిరేకమని కూడా వ్యాఖ్యానించారు. కాగా 86 అంటే తొలగించడం లేదా విస్మరంచడం అని అర్థం. ట్రంప్ అమెరికాకు 47వ అధ్యక్షుడు కావడం తో ట్రంప్‌ను తొలగించడం లేదా హని చేయమని పిలుపునిచ్చినట్లు అర్థమని భావిస్తున్నారు.
Also Read: క్రిస్టియానో రొనాల్డో కొడుకొచ్చాడు.. ఫుట్‌బాల్ ఎంట్రీ అదిరిపోయింది
అమెరికాకు చెందిన జేమ్స్ కామీ న్యాయవాదిగా పనిచేశారు. ఆ తర్వాత ఆయన ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (FBI) డైరెక్టర్‌గా 2013 నుండి 2017 వరకు పనిచేశారు. 2016 అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో హిల్లరీ క్లింటన్ ఇమెయిల్ వివాదంపై FBI దర్యాప్తును పర్యవేక్షించడంలో ఆయన పాత్ర చాలా వివాదాస్పదమైంది. 2017లో, అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కోమీని పదవి నుండి తొలగించారు. ఇది చాలా వివాదాస్పద నిర్ణయంగా నిలిచింది. దీంతో ఇద్దరి మధ్య విభేదాలు చోటు చేసుకున్నట్లు చెబుతారు. తాజాగా ఆయన పెట్టిన పోస్ట్ వైరల్ కావడంతో దీనిపై అధికారులు దర్యాప్తు జరుపుతున్నారు.
Also Read: ఏపీలో ఘోర విషాదం.. ఈతకు వెళ్లిన చిన్నారులు గల్లంతు.. లభించని ఆచూకీ!