/rtv/media/media_files/2025/11/17/fotojet-2025-11-17t105929513-2025-11-17-11-00-01.jpg)
Big twist in terror network
Delhi blast: ఢిల్లీలో ఎర్రకోట సమీపంలో పేలుడు ఘటనపై నిఘావర్గాలు ముమ్మరంగా దర్యాప్తు చేస్తున్నాయి. అయితే దర్యాప్తులో భాగంగా మేడమ్ సర్జన్, డీ-6 వంటి పదాలు వెలుగులోకి వచ్చాయి. నిషేధిత జైషే మహ్మద్, అన్సార్ గజ్‌వత్ ఉల్ హింద్ ఉగ్ర సంస్థలతో సంబంధమున్న 43 ఏళ్ల ‘మేడమ్ సర్జన్’ షాహిన్ షాహిద్ ఉగ్రనెట్‌వర్క్‌లో కీలకంగా వ్యవహరిస్తున్నారని తేలింది. ఈ నెట్‌వర్క్ ఆరు నగరాలు లక్ష్యంగా డీ-6 మిషన్‌కు ప్లాన్ చేసిందని విచారణలో భాగంగా అధికారులు గుర్తించినట్లు తెలుస్తోంది.
🚨 Madam Surgeon’ Linked to Delhi Car Blast
— Geo Strategist (@GeoStrategistX) November 17, 2025
A mysterious woman emerges as a key player, with seized diaries hinting at a coded ‘D-6 Mission’ allegedly plotted to avenge the Babri demolition. pic.twitter.com/xKFVPw3KGu
ఏఏ నగరాలను లక్ష్యంగా చేసుకోవాలి, నియామక వ్యూహాలు, డబ్బు తరలింపు, రహస్య పద్ధతిలో సమాచార మార్పిడి ప్లాన్స్ వంటి విషయాలు వెలుగు చూస్తున్నాయి. జమ్మూకశ్మీర్, ఫరీదాబాద్‌లో అరెస్టు చేసిన ఉగ్ర అనుమానితులను విచారించగా ఇవన్నీ వెలుగులోకి వస్తున్నాయి. లక్ష్య నగరాల ఎంపిక, రిక్రూట్‌మెంట్ పద్ధతులు,నిధుల పంపకం, గోప్యంగా సమాచారాన్నిమార్పిడి చేసే మార్గాలు వంటి కీలక వివరాలు బయటపడుతున్నాయి. జమ్ముకశ్మీర్, ఫరీదాబాద్‌లో అరెస్టు చేసిన అనుమానితుల్ని విచారించిన సమయంలో ఈ మొత్తం వివరాలు వెలుగులోకి వచ్చినట్లు దర్యాప్తు వ్యవస్థలు చెబుతున్నాయి.
Follow Us