న్యూరాలింక్ సీఈవో ఎలాన్ కీలక ప్రకటన చేశారు. మరో వ్యక్తి మెదడులో చిప్‌ను అమర్చినట్లు పేర్కొన్నారు. దీంతో న్యూరాలింక్ చిప్ అమర్చిన వారి సంఖ్య మూడుకి చేరింది. అంతేకాదు వీళ్లందరిలో మంచి పనితీరు కనిపిస్తోందని తెలిపారు. అయితే 2025లో 20 నుంచి 30 మందిలో వీటిని అమర్చే లక్ష్యంతో ముందుకెళ్తామన్నారు. లాస్‌వెగాస్‌లో జరిగిన ఓ కార్యక్రమంలో ఎలాన్ మస్క్ ఈ విషయాలు వెల్లడించారు. వెన్నుముక, పక్షవాతం, మెదడు సంబంధిత సమస్యలతో బాధపడుతున్న వారికి సాయంగా ఉండేందుకు ఈ ఎలక్ట్రానిక్ చిప్‌ను అభివృద్ధి చేస్తున్న సంగతి తెలిసిందే. Also Read: లిక్కర్ పాలసీతో ఢిల్లీ ప్రభుత్వానికి భారీ నష్టం.. కాగ్ రిపోర్టులో సంచలన విషయాలు ఇక వివరాల్లోకి వెళ్తే.. న్యూరాలింక్ బ్రెయిన్ కంప్యూటర్ ఇంటర్‌ఫేస్ (BCI)లో 8 మిల్లీమీటర్ల వ్యాసంతో ఎన్1 అనే ఒక చిప్ ఉంటుంది. దీనికి సన్నటి ఎలక్ట్రోడ్లు ఉంటాయి. వెంట్రుకలతో పోల్చి చూస్తే ఈ ఎలక్ట్రోడ్ల మందం 20వ వంతు మాత్రమే ఉంటుంది. మనిషి పుర్రెలో చిన్న భాగాన్ని తీసేసి అక్కడ ఈ ఎన్ చిప్ డివైస్‌ను అమర్చుతారు. అలాగే ఈ చిప్‌కు ఉన్న సన్నటి ఎలక్ట్రోడ్లను మెదడులకి చొప్పిస్తారు. ఒక చిప్‌లో చూసుకుంటే 3 వేలకు పైగా ఎలక్ట్రోడ్లు ఉంటాయి. వాటిని మెదడులో ఉండే ముఖ్యమైన భాగాలకు చేరువయ్యేలా ప్రవేశపెడుతారు. Also Read: మహిళా అథ్లెట్‌పై 62 మంది లైంగిక దాడి.. 5 ఏళ్లుగా ఆ వీడియోలు చూపిస్తూ! ఆ ఎలక్ట్రోడ్లు చాలా మెత్తగా ఎటుపడితే అటు వంగగలవు. ఇవి మెదడులో న్యూరాన్ల మధ్య ప్రసారమయ్యే సందేశాలను గుర్తిస్తాయి. ఆ తర్వాత వీటిని చిప్‌నకు పంపిస్తాయి. చిప్‌లోని ఎలక్ట్రోడ్‌లు ఏకంగా వెయ్యి న్యూరాన్ల చర్యలను పరిశీలిస్తాయి. మొత్తంగా ఒక వ్యక్తిలోకి 10 చిప్‌లను ప్రవేశపెట్టొచ్చు. అవి ఇన్‌స్టాల్ అయ్యాక బ్రెయిన్ కంప్యూటర్ ఇంటర్‌ఫేస్ (BCI) మెదడు నుంచి విద్యుత్ సంకేతాలు పంపించడం, అందుకోవడం అలాగే వాటిని ప్రేరేపించడం లాంటి పనులు చేస్తుంది. వీటిని కంప్యూటర్లు విశ్లేషించగలిగే అల్లారిథమ్‌లుగా మారుస్తుంది. Also read: గుండెపోటుతో కుర్చీలోనే.. ఈ చిన్నారి విజువల్స్ చూస్తే కన్నీళ్లు ఆగవు