తెలంగాణలోని ప్రముఖ ఉస్మానియా యూనివర్సిటీ తాజాగా కీలక ప్రకటన చేసింది. పలు పరీక్షల ఫలితాలను విడుదల చేస్తున్నట్లు ప్రకటించింది. ఈ రోజు బీఏ, బీకామ్, బీఎస్సీ, బీబీఏ తదితర డిగ్రీ కోర్సులకు సంబంధించిన ఫలితాలను విడుదల చేసినట్లు వెల్లడించింది. ఆయా కోర్సులకు సంబంధించి 3, 5వ సెమిస్టర్ ఫలితాలను విడుదల చేసినట్లు పేర్కొంది. ఈ పరీక్షలకు హాజరైన విద్యార్థులు యూనివర్సిటీ అధికారిక వెబ్ సైట్ లో తమ రిజల్ట్స్ ను చెక్ చేసుకోవచ్చని వెల్లడించింది. osmania.ac.in వెబ్ సైట్లో విద్యార్థులు తమ హాల్ టికెట్ నంబర్ ను నమోదు చేసి ఫలితాలను చెక్ చేసుకోవచ్చని యూనివర్సిటీ అధికారులు ప్రకటనలో పేర్కొన్నారు.ఇది కూడా చదవండి: Railway Jobs: నిరుద్యోగులకు శుభవార్త.. దక్షిణ మధ్య రైల్వేలో 4వేల జాబ్స్! Osmania University ( OU ) UG - BA / BCom / BSc / BBA (CBCS) III, V Semester Examinations Results -November/December 2024 @ https://t.co/284YoOvPrg pic.twitter.com/O2sgTZBy7m — Osmania University (@OU_Updates) January 7, 2025 ఇది కూడా చదవండి: Ponguleti: బాంబులు పేలడం స్టార్ట్.. KTR అరెస్ట్‌పై పొంగులేటి సంచలనం! రిజల్ట్స్ చెక్ చేసుకోవడం ఎలా? Step 1: విద్యార్థులు మొదటగా యూనివర్సిటీ అధికారిక వెబ్ సైట్ https://www.osmania.ac.in/ ఓపెన్ చేయాలి. Step 2: అనంతరం Examination Branch పై క్లిక్ చేయాలి. Step 3: తర్వాత నోటిఫికేషన్స్ విభాగంలో.. Examination Results ఆప్షన్ పై క్లిక్ చేయాలి. Step 4: ఆ తర్వాత కోర్సుల వారీగా ఫలితాల లింక్స్ పై క్లిక్ చేయాలి. అనంతరం ఫలితాల పేజీ ఓపెన్ అవుతుంది. Step 5: తర్వాత పేజీలో హాల్ టికెట్ నంబర్ ను నమోదు చేసి సబ్మిట్ చేయాలి. Step 6: ఫలితాలు డిస్ ప్లే అవుతాయి. ప్రింట్ తీసుకుని భద్రపరుచుకోవాలి. ఇది కూడా చదవండి: Dogs: అయ్యో పాపం.. కాళ్లు,నోళ్లు కట్టేసి 32కుక్కలను చంపిన గ్రామస్థులు!