అమెరికాలో తెలుగోళ్ల భారీ కుంభకోణం.. యాపిల్‌లో 185 ఉద్యోగులు ఊస్ట్

అమెరికాలో తెలుగువాళ్ల భారీ మోసం వెలుగు చూసింది. యాపిల్ కంపెనీలో ఉద్యోగులు చారిటీ ఫండ్స్ చెప్పి ఆ కంపెనీ మ్యాచింగ్ కార్పొరేట్ గ్రాంట్స్ ను దుర్వినియోగం చేశారట. ఈ విషయాన్ని IRS అధికారులు బయటపెట్టారు. దీంతో 185 మంది ఉద్యోగులను జాబ్ నుంచి తీసేసింది కంపెనీ.

author-image
By K Mohan
New Update
nata

nata Photograph: (nata)

దేశంకాని దేశంలో తెలుగు ఎంప్లాయ్స్ 185 మంది తమ ఉద్యోగాలు కోల్పోయారు. దీనికి కారణం కంపెనీ లేఆఫ్స్ కాదు.. వాళ్లుంతా కులం పేరు చెప్పి భారీ కుంభకోణానికి పాల్పడ్డారు. ప్రపంచంలో అతి పెద్ద టెక్ కంపెనీ యాపిల్‌లో సీనియర్ మేనేజర్ కేడర్ నుంచి ఎంట్రీ లెవల్ ఎగ్జిక్యూటివ్‌ల వరకూ అందరూ ఇందులో ఇన్వాల్వ్ అయ్యారట. అమెరికాలో కంపెనీల ట్యాక్స్ లెక్కలు చూసే ఇంటర్‌నల్ రెవెన్యూ సర్వీస్(IRS) వీళ్ల గుట్టును రట్టు చేసింది. యూఎస్ బే ఏరియాలో యాపిల్‌ ఆఫీస్‌లో 185 మంది ఉద్యోగులు క్యాస్ట్ పేరు చెప్పి వందల డాలర్లు విరాళాలుగా సేకరించారు.

Also Read : ఆస్కార్ బరిలో అట్టర్ ప్లాప్ సినిమా.. నెట్టింట ట్రోల్స్

అమెరికాలో ఉన్న తెలుగు వారంతా TANA తెలుగు అసోసియేషన్ ఫర్ నార్త్ అమెరికా, NATA నార్త్ అమెరికన్ తెలుగు అసోసియేషన్, ATA అమెరికన్ తెలుగు అసోసియేషన్, APTA అమెరికన్ ప్రొగ్రెసివ్ తెలుగు అసోసియేషన్, NATS నార్త్ అమెరికా తెలుగు సొసైటీ, NIRVA వంటి సంఘాలుగా ఏర్పడ్డారు. అమెరికాలో కాపులు, కమ్మలు, రెడ్లు కుల సంఘాలుగా ఏర్పడి ఈ ఆర్గనైజేషన్స్ ను నడిపిస్తాయి. ప్రతి ఏటా ఈ సంఘాలు సమేశాలు, సభలు నిర్వహిస్తాయి. అయితే యాపిల్ కార్పొరేట్ ఫండ్ కింద ఇచ్చే డొనేషన్స్‌ను ఈ తెలుగు సంఘాల్లో ఉన్న ఉద్యోగులు దుర్వినియోగం చేశారు. యాపిల్ కంపెనీ మ్యాచింగ్ కార్పొరేట్ గ్రాంట్స్ అని ఛారిటీ సంస్థలకు విరాళాలు ఇస్తోంది. ఆ డబ్బుపై ట్యాక్స్ కూడా విధించదు అమెరికా ప్రభుత్వం. ఈ డబ్బును అందులో పని చేసే తెలుగువాళ్లు విరాళాల పేరు చెప్పి సేకరించి సొంత ప్రయోజనాలకు వాడుకున్నారని IRS నివేదిక ఇచ్చింది.

ఇది కూడా చదవండి: Pandem kollu: కాలు దువ్వుతున్న పందెం కోళ్లు.. రూ.100కోట్ల బెట్టింగ్

బే ఏరియాలో యాపిల్‌ ఆఫీస్‌లో పని చేసే 185 మంది ఈ ఫండ్స్‌ను కలక్ట్ చేసి వారి సొంత అవసరాలకు వాడుకున్నారట. ఈ విషయం IRS చేసిన ఎన్‌క్వైరీలో తేలింది. దీంతో యాపిల్ కంపెనీకి బ్యాడ్ చేమ్ వచ్చింది. వెంటనే మ్యాచింగ్ కార్పొరేట్ గ్రాంట్స్‌ను మిస్‌యూస్ చేసిన వారిపై చర్యలు తీసుకుంది. వారిని ఉద్యోగాల నుంచి పీకేసింది. దీంతో తెలుగు రాష్ట్రాల ప్రజలు ఈ వ్యవహారంపై మండిపడుతున్నారు. డబ్బులకు కక్కుర్తిపడి, కులం పేరు చెప్పి అమెరికాలో తెలుగు వాళ్ల పరువుతీశారని కొందరు జర్నలిస్టులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. 

 

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు