Elon Musk vs Trump: సె*క్స్‌ కుంభకోణంలో ట్రంప్.. ఎలాన్ మస్క్‌ సంచలన ఆరోపణలు

ఎక్స్‌లో ఓ యూజర్‌ ట్రంప్‌ను అభిశంసించి.. ఆయన స్థానంలో ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్‌ను అధ్యక్షుడిగా చేయాలని ఎక్స్‌లో పోస్ట్‌ చేశారు. దీనికి స్పందించిన ఎలాన్‌ మస్క్‌.. ఆ పోస్టును సమర్థించాడు. అలాగే ఎప్‌స్టీన్ ఫైల్స్‌ స్కామ్‌లో ట్రంప్ పేరుందని మస్క్ ఆరోపించారు.

New Update
Trump and Elon Musk

Trump and Elon Musk

ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్‌, డోనాల్డ్‌ ట్రంప్ మధ్య వివాదం రోజురోజుకి పెరుగుతోంది. ఇద్దరూ కూడా ఒకరినొకరు పరస్పర ఆరోపణలు చేసుకోవడం సంచలనం రేపుతోంది. అధ్యక్ష ఎన్నికలకు ముందు ట్రంప్‌కు సపోర్ట్‌ చేసిన మస్క్‌.. ఇప్పుడు ఆయనకు వ్యతిరేకంగా మారడం ప్రాధాన్యం సంతరించుకుంది. ఎక్స్‌లో ట్రంప్‌పై వరుస ట్వీట్లతో మస్క్‌ విరుచుకుపడుతున్నారు. తాజాగా ఓ యూజర్‌ ట్రంప్‌ను అభిశంసించి.. ఆయన స్థానంలో ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్‌ను అధ్యక్షుడిగా చేయాలని పోస్ట్‌ చేశారు. దీనికి స్పందించిన ఎలాన్‌ మస్క్‌.. ఆ పోస్టును సమర్థించాడు. ఈ పోస్టును గుర్తుపెట్టుకోవాలని.. భవిష్యత్తులో ఇదే జరుగుతుందని రాసుకొచ్చారు. 

Also read: బెంగళూరు తొక్కిసలాటలో విషాదం. మృతుల్లో తమిళనాడు యువతి

'' ఓ పెద్ద బాంబు లాంటి సమాచారాన్ని చెప్పే సమయం వచ్చింది.ఎప్‌స్టీన్ ఫైల్స్‌లో ట్రంప్‌ పేరు ఉంది. అందుకే ఆ ఫైల్స్‌ వివరాలు బయటపెట్టడం లేదని'' మస్క్‌ పోస్ట్ చేశాడు. అయితే బిగ్‌ బ్యూటిఫుల్ బిల్‌ వ్యవహారంలో ఎలాన్‌ మస్క్‌ వైఖరితో తాను విసిగిపోయానని ట్రంప్‌ మీడియా ముందు చెప్పిన సంగతి తెలిసిందే. ఇలా చెప్పిన గంటలోపే ఎలాన్ మస్క్‌ ఈ ట్వీట్ చేశారు. 

ఏంటి ఎప్‌స్టీన్ ఫైల్స్‌

ఎప్‌స్టీన్‌ ఫైల్స్‌ అనేది జెఫ్రీ ఎప్‌స్టీన్ సెక్స్‌ స్కామ్‌కు సంబంధించిన వ్యవహారం. అతడు మైనర్‌ అమ్మాయిలతో సెక్స్‌ ట్రాఫికింగ్ చేసేవాడు. ఇది అప్పట్లో అమెరికాలో సంచనం రేపింది. ఈ ఫైల్స్‌లో ఎప్‌స్టీన్ కాంటాక్స్‌ లిస్ట్‌, ప్లైట్‌ లాగ్‌లు, అతనికి వ్యతిరేకంగా సేకరించినటువంటి ఆధారాలున్నాయి. ఈ కుంభకోణంలో ప్రముఖ రాజకీయ నేతలతో పాటు సెలబ్రిటీలు, వ్యాపారవేత్తలు ఉన్నట్లు ఆరోపణలు ఉన్నాయి. వాస్తవానికి ఎప్‌స్టీన్‌ ఓ ఇన్వెస్టర్. గతంలో లైంగిక వేధింపుల ఆరోపణలతో అతడిని మీటూ ఉద్యమ సమయంలో పోలీసులు అరెస్టు చేశారు. ఆ తర్వాత 2019లో జైల్లో ఎప్‌స్టీన్ అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. అతడు సూసైడ్ చేసుకున్నట్లు అధికారులు తెలిపారు. కానీ ఈ ఫైల్స్‌ ఇప్పటిదాకా బయటకు రాలేదు. దీంతో ఈ వ్యవహారం అమెరికా రాజకీయాల్లో దుమారం రేపుతోంది. 

Also Read: మహిళలు పొట్టి దుస్తులు వేసుకోవద్దు.. బీజేపీ మంత్రి వివాదాస్పద వ్యాఖ్యలు

ఇదిలాఉండగా..   రిపబ్లికన్‌ ట్యాక్స్‌ బిల్లును మస్క్‌ వ్యతిరేకించారు. ఆ తర్వాత ఆయన డోజ్‌ శాఖ బాధ్యతల నుంచి వైదొలిగారు. తన సపోర్ట్‌ లేకుంటే 2024 అధ్యక్ష ఎన్నికల్లో ట్రంప్, రిపబ్లికన్ పార్టీ నేతలు ఓడిపోయేవారని ఎలాన్‌ మస్క్‌ అన్నారు. డెమోక్రాట్లు ఆధిక్యం సాధించేవారని.. సెనెట్‌లో రిపబ్లికన్లు 5149తో ఉండేవారని పేర్కొన్నారు. అంతకు ముందు ట్రంప్ మాట్లాడుతూ.. రిపబ్లికన్ ట్యాక్స్‌ బిల్లును మస్క్‌ వ్యతిరేకించడం వల్ల తాను అసంతృప్తికి గురయ్యానన్నారు. వైట్‌హౌస్‌లో మస్క్‌ లేకపోవడం విచారకరమన్నారు. అలాగే తాను ఎన్నికల్లో విజయం సాధించేందుకు మస్క్‌ అవసరం లేదని.. ఆయన లేకుండానే పెన్సిల్వేనియాలో తాను గెలిచేవాడినని పేర్కొన్నారు. అంతేకాదు మస్క్‌ వ్యాపారాలకు ఉపయోగపడే ప్రభుత్వ కాంట్రాక్టులకు, రాయితీలకు కోత విధిస్తానని కూడా ట్రంప్‌ హెచ్చరించారు. ఈ క్రమంలోనే మస్క్‌ వరుసగా ఎక్స్‌లో ట్వీట్లు చేశారు. 80 శాతం మందికి ప్రాతినిధ్యం వహించేలా అమెరికా కొత్త పార్టీ పెట్టేందుకు ఇది సమయమేనా అని పోల్‌ పెట్టారు. 

Advertisment
Advertisment
తాజా కథనాలు