X Chat: వాట్సాప్ కు పోటీగా ఎక్స్ చాట్..మస్క్ మరో ప్లాన్

ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్ టెక్ అధిపతి. ట్విట్టర్, డ్రైవింగ్ చేయకుండానే నడిచే టెస్లా ఇలా కొత్తకొత్తవి కనిపెట్టి తీసుకువచ్చారు. ఇప్పుడు మరో సోషల్ మీడియాను ప్రపంచంలో వదలడానికి సిద్ధమయ్యారు. వాట్సాప్ కు పోటీగా ఎక్స్ చాట్ ను తీసుకురానున్నారు.

New Update
x

Social Media X

ఎలాన్ మస్క్ ఏం చేసినా అదో సంచలనం. ఇప్పుడు వాట్సాప్, ఇన్ స్టాగ్రామ్, టెలిగ్రామ్ లాంటి సోషల్ మీడియా యాప్ లకు పోటీగా మరో సంచలనాన్ని తీసుకొస్తున్నారు. ప్రముఖ మెసేజింగ్‌ యాప్ వాట్సాప్‌ కు పోటీగా ఎక్స్ యాప్ ఇప్పుడు ఎక్స్ చాట్ ను ఇంట్రడ్యూస్ చేయనున్నారు. వాట్సాప్ కంటే మెరుగైన సేవలను దీని ద్వారా అందిస్తామని చెప్పారు. 

వాట్సాప్ మాదిరి ఎక్స్ చాట్

ఎలాన్ మస్క్‌కు చెందిన ఎక్స్ యాప్‌లో కొత్తగా ఎక్స్‌ చాట్‌ పేరుతో చాట్ ఇంటర్ ఫేస్‌ను ప్రవేశపెట్టారు. ఇది ఇన్-యాప్ డైరెక్ట్ మెసేజింగ్ ఫీచర్. మిగతా వాటి మాదిరిగానే ఇందులో కూడా కంటిన్యూగా చాటింగ్ చేసుకోవచ్చును. వాట్సాప్ లానే ఇందులో కూడా ఎండ్-టు-ఎండ్ ఎన్‌క్రిప్షన్‌, డిసప్పియరింగ్‌ మెసేజెస్, ఆడియో/ వీడియో కాల్స్ వంటి లేటెస్ట్‌ ఫీచర్లు అందుబాటు ఉండనున్నాయి. 

ఎక్స్ చాట్...ఎక్స్ యూజర్ల కోసం డెవలప్ చేసిన కొత్త ఫీచర్ అని ఎలాన్ మస్క్ చెబుతున్నారు. దీన్ని ఇప్పటికే ఎక్స్ లో ప్రవేశపెట్టారు. ఇది ఫ్యూచర్ లో మరింత డెవలప్ అవుతుందని చెబుతున్నారు. సెక్యూర్‌ కనెక్షన్స్‌ కోసం ఎండ్ టూ ఎండ్‌ ఎన్‌క్రిప్షన్‌ కూడా అందిస్తుంది. కొంత టైమ్‌ తర్వాత మెసేజ్‌లు ఆటోమేటిక్‌గా డిసప్పియర్‌ అయిపోతాయి. ఏ టైప్‌ ఫైల్స్‌ అయినా షేర్‌ చేసుకోవచ్చు. ఫోన్ నంబర్ అవసరం లేకుండా ఆడియో, వీడియో కాల్స్‌ మాట్లాడొచ్చు.  ప్రస్తుతం బీటా టెస్టింగ్‌లో ఉన్న ఈ అప్‌డేటెడ్‌ మెసేజింగ్ ఇంటర్ ఫేస్‌ను పరిమిత సంఖ్యలో యూజర్లకు త్వరలో అందుబాటులోకి తీసుకువస్తారని ఎక్ యాజమాన్యం చెప్పింది.  దీనిని మైక్రోబ్లాగింగ్ ప్లాట్‌ఫామ్ మల్టీపర్పస్ కమ్యూనికేషన్ హబ్‌గా ఎక్స్‌ను అభివృద్ధి చేయాలన్నదే మస్క్ ఆలోచన అని చెబుతున్నారు. ప్రస్తుతం బీటా టెస్టింగ్ లో ఉన్న ఈ ఎక్స్ చాట్ త్వరలో పెయిడ్ చందాదారులకు అందుబాటులోకి తీసుకురానున్నారు. ఈ ఎక్స్ చాట్ ఫీచర్లను ఉపయోగించడానికి సబ్‌స్క్రిప్షన్‌ వెర్షన్‌ను పొందాల్సి ఉంటుంది. 

Also Read: USA: డబ్బులు చెల్లిస్తే తొందరగా వీసా ఇంటర్వ్యూ..

Advertisment
Advertisment
తాజా కథనాలు