Putin: పుతిన్‌ను హత్య చేసేందుకు ప్లాన్.. కారులో బాంబు పేలుడు

రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్‌ పుతిన్‌కు చెందిన లగ్జరీ కారు లిమోజిన్‌లో భారీ పేలుడు సంభవించింది. కారులో ఉన్నవారికి ఎలాంటి ప్రమాదం జరగలేదు. పుతిన్‌ను హత్య చేసేందుకు ప్లాన్ వేశారా అని ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ప్రస్తుతం ఈ వీడియో వైరల్ అవుతోంది.

New Update
Putin’s luxary car engulfed in flames

Putin’s luxary car engulfed in flames

రష్యా  అధ్యక్షుడు వ్లాదిమిర్‌ పుతిన్‌కు చెందిన లగ్జరీ కారు లిమోజిన్‌లో భారీ పేలుడు సంభవించింది. దీంతో పుతిన్‌ భద్రతపై అనుమానాలు తలెత్తున్నాయి. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది. ఇక వివరాల్లోకి వెళ్తే.. పుతిన్‌కు చెందిన లగ్జరీ కారు.. లుబియాంకాలోని ఎఫ్‌ఎస్‌బీ ప్రధాన కార్యాలయం సమీపంలో ఒక్కసారిగా కాలిపోయింది. తొలుత ఇంజిన్ నుంచి మంటలు ప్రారంభమై.. వాహనంలోకి వ్యాపించినట్లు అక్కడున్న స్థానికులు తెలిపారు.     

Also Read: కుక్కలను తప్పించుకోబోయి బావిలో.. 3 రోజులు అక్కడే! తర్వాత ఏం జరిగిందంటే...

అయితే ఈ ప్రమాదంలో ఎవరికీ ఎలాంటి గాయాలు కాలేదు. కారులో మంటలు చెలరేగడంతో అగ్నిమాపక సిబ్బంది వచ్చేలోపే దగ్గర్లో ఉన్న రెస్టారెంట్‌లోని సిబ్బంది మంటలు ఆర్పేందుకు ముందుకొచ్చారు. సీసీటీవీ ఫుటోజ్‌లో చూస్తే కారులో  నుంచి దట్టమైన పొగ రావడం, దాని వెనుక భాగం దెబ్బతిన్నట్లు కనిపిస్తోంది. అయితే ఈ పేలుడు ఎలా జరిగింది అనేదానిపై ఇంకా స్పష్టత లేదు. మరోవైపు అధ్యక్షుడు పుతిన్‌ను హత్య చేసేందుకు ప్లాన్ వేశారా అనేది కూడా క్లారిటీ లేదు. ప్రస్తుతం దీనిపై విచారణ జరుగుతోంది.     

Also Read: తెలంగాణలోని వృద్ధులకు సర్కార్ ఉగాది కానుక..  ఏప్రిల్ నుంచి రూ.5 లక్షల బెనిఫిట్!

ఇటీవల ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీ మాట్లాడుతూ.. పుతిన్ ఆరోగ్యం క్షీణిస్తోందని, త్వరలో ఆయన చనిపోతారని చేసిన వ్యాఖ్యలు దుమారం రేపిన సంగతి తెలిసిందే. అయితే తాజాగా పుతిన్ కారు కాలిపోయిన నేపథ్యంలో  ఆయన మరణాన్ని జెలెన్‌స్కీ ముందే ఊహించారంటూ ప్రచారాలు జరుగుతున్నాయి. బుధవారం యూరోవిజన్‌ న్యూస్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో జెల్‌స్కీ.. త్వరలో పుతిన్ చనిపోతారని, ఆ తర్వాత ఇరుదేశాల మధ్య యుద్ధం ముగుస్తుందని అన్నారు. ఈ వీడియో కూడా సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. 

Also Read: తవ్వుతున్న కొద్దీ బయటపడుతున్న మృతదేహాలు..మయన్మార్ లో మృత్యుఘోష


rtv-news | zelensky | russia-ukraine-war

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు