Japan Earthquake: జపాన్ కు సునామి వార్నింగ్.. | Tsunami Alert Issued In Japan 6.9 Magnitude | RTV
జపాన్లో సంభవించిన భారీ భూకంపాన్ని కాకులు ముందే పసిగట్టాయి. భూకంపం సంభవించడానికి ముందు.. వేలాది పక్షలు జపాన్ తీర ప్రాంతంలో గుమిగూడాయి. రోడ్లపై వేల సంఖ్యలో కాకులు వచ్చి చేరాయి. ప్రకృతి విపత్తును ముందే పసిగట్టడం ద్వారా కాకులు ఇలా చేశాయని కొందరు అంటున్నారు.
జపాన్ ను భారీ భూకంపం అతలాకుతలం చేసింది. సునామీ హెచ్చరికలు కూడా జారీ అయ్యాయి. ఇప్పటివరకు 8మంది మరణించినట్లు తెలిసింది. సోమవారం భారీ భూకంపం వచ్చిన తర్వాత మరో 50సార్లు భూమి కంపించింది. దానికి సంబంధించిన వీడియోలు వైరల్ అవుతున్నాయి. అయితే అదృష్టం కొద్దీ పెద్ద సునామీ రాలేదు.