Double Decker Bus Crashes: షాకింగ్ వీడియో.. బ్రిడ్జ్‌ను ఢీకొట్టిన డబుల్‌ డెక్కర్‌ బస్సు.. స్పాట్‌లో 15 మంది..!

మాంచెస్టర్‌లోని బార్టన్ లేన్ వద్ద బ్రిడ్జి కింది నుంచి వెళ్తుండగా డబుల్‌ డెక్కర్‌ బస్సు పైకప్పు ఊడింది. ఈ ప్రమాదంలో 15 మందికి పైగా ప్రయాణికులు గాయపడ్డారు. వారిలో కొందరికి తీవ్ర గాయాలయ్యాయి. దీంతో పోలీసులు బస్ డ్రైవర్‌ను అరెస్టు చేశారు.

New Update
Double Decker Bus Crashes

Double Decker Bus Crashes

యూకేలోని మాంచెస్టర్‌లో షాకింగ్ ఇన్సిడెంట్ చోటుచేసుకుంది. ఒక బ్రిడ్జి కింద నుంచి వెళ్లే క్రమంలో డబుల్ డెక్కర్ బస్సు దాన్ని ఢీకొట్టింది. దీంతో ఆ బస్సు పైకప్పు ఊడిపోయింది. ఎక్లేస్, సాల్‌ఫోర్డ్‌లోని బార్టన్ లేన్ వద్ద ఉన్న బ్రిడ్జ్‌వాటర్ కెనాల్ ఆక్విడక్ట్ కింద జరిగిన ఈ ఘటన ఇప్పుడు సంచలనంగా మారింది. ప్రస్తుతం ఈ ప్రమాదానికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. 

Double Decker Bus Crashes

బస్సు బ్రిడ్జి కింద నుంచి వెళ్లే ప్రయత్నం చేయగా.. అది తక్కువ ఎత్తులో ఉండటంతో బస్సు పైకప్పు పూర్తిగా ఊడిపోయింది. ఈ ప్రమాదంలో బస్సులో ఉన్న 15 మందికి పైగా ప్రయాణికులు గాయపడ్డారు. వీరిలో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయని, ఒకరి పరిస్థితి విషమంగా ఉందని పోలీసులు తెలిపారు. 

ప్రమాదం జరిగిన వెంటనే అత్యవసర సేవలు సంఘటనా స్థలానికి చేరుకుని.. క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనకు సంబంధించిన సీసీ కెమెరా ఫుటేజ్ కూడా సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. 

పోలీసుల ప్రకారం.. ఈ బస్సు సాధారణ మార్గంలో ప్రయాణించడం లేదని.. డ్రైవర్ ఎత్తు పరిమితి హెచ్చరికలు, సైన్ బోర్డులు ఉన్నా వాటిని పట్టించుకోలేదని తెలిపారు. బస్సు డ్రైవర్‌ నిర్లక్ష్యంగా డ్రైవింగ్ చేసి తీవ్ర గాయాలకు కారణమయ్యాడనే ఆరోపణలపై అతడిని అరెస్టు చేశారు. 

కాగా ఈ బ్రిడ్జి వద్ద గతంలో కూడా ఇలాంటి ప్రమాదాలు జరిగాయని స్థానికులు చెబుతున్నారు. ఏప్రిల్ 2023లో కూడా ఇదే ప్రదేశంలో మరో డబుల్ డెక్కర్ బస్సు పైకప్పు ఊడిన ఘటన జరిగింది. ఈ సంఘటన యూకేలో పెద్ద చర్చనీయాంశంగా మారింది. 

Also Read: లోక్‌సభలో పహల్గాం ఉగ్రదాడిపై చర్చించాలని విపక్షాల పట్టు.. సభ వాయిదా

Advertisment
తాజా కథనాలు