Donald Trump: హష్ మనీ కేసు.. డొనాల్డ్ ట్రంప్‌కు భారీ ఎదురుదెబ్బ

అమెరికా అధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం చేయనున్న డొనాల్డ్ ట్రంప్‌కి పెద్ద షాక్ తగిలింది. హష్ మనీ కేసులో రక్షణ కోసం న్యూయార్క్ కోర్టును ఆశ్రయించగా తిరస్కరించింది. ట్రంప్‌కి రక్షణ కల్పించే అవకాశాలు ఇందులో లేవని కోర్టు తెలిపింది.

New Update
Donald Trump Arrested: అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అరెస్ట్..!!

వచ్చే ఏడాది జనవరి 20న అధ్యక్షుడి పదవికి డొనాల్డ్ ట్రంప్ ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఈ క్రమంలో అతనికి పెద్ద ఎదురుదెబ్బ తగిలింది. పోర్న్ స్టార్ హష్ మనీ కేసు విషయంలో ఆయనకు వ్యతిరేకంగా కోర్టు తీర్పునిచ్చింది. ఈ కేసులో అతనిపై ఉన్న అభియోగాలను కొట్టి వేసేందుకు న్యూయార్క్ కోర్టు అంగీకారం తెలపలేదు. కేవలం అధికారిక చర్యలకు సంబంధించిన కేసుల్లో మాత్రమే అధ్యక్షులకు రక్షణ ఉంటుందని, ఇలాంటి ప్రవర్తన విషయంలో ఎలాంటి ట్రంప్‌కు ఎలాంటి రక్షణ వర్తించదని న్యూయార్క్ న్యాయమూర్తి తీర్పునిచ్చారు.

ఇది కూడా చూడండి: నా రికార్డ్‌లు కావాలంటే గూగుల్‌లో వెతకండి– బుమ్రా

దోషిగా తేలినా కూడా శిక్షించకుండా..

ఇప్పటికే డొనాల్డ్ ట్రంప్ హష్ మనీ కేసులో దోషిగా తేలారు. న్యూయార్క్ కోర్టు నవంబర్‌లోనే శిక్ష వేయాల్సి ఉంది. కానీ అదే సమయంలో అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. అయితే క్రిమినల్ విచారణ ఎదుర్కోకుండా రక్షణ ఉంటుందని గతంలో ఓసారి సుప్రీంకోర్టు తీర్పునిచ్చింది. దీంతో ట్రంప్ సుప్రీంకోర్టును ఆశ్రయించగా.. అతనికి రక్షణ కల్పించే అవకాశాలు ఇందులో లేవని తెలిపింది. మరి ఈ కేసులో ట్రంప్‌కి ఊరట లభిస్తుందో లేదో చూడాలి. 

ఇది కూడా చూడండి: ట్రూడోకు షాక్.. ఉప ప్రధాని రాజీనామా

డొనాల్డ్ ట్రంప్ శృంగార తార స్టార్మీ డానియల్స్‌తో ఏకాంతంగా గడిపారనే ఆరోపణలు గతంలో వచ్చాయి. అయితే ఆమె ఈ విషయం బయటకు చెప్పకుండా ఉండేందుకు 2016 అధ్యక్ష ఎన్నికల సమయంలో ఆమెకు 1.30 లక్షల డాలర్ల హష్‌మనీ ఇచ్చినట్లు ఆరోపణలు ఉన్నాయి. అయితే ఈ డబ్బు విరాళాల నుంచి సేకరించినదని అభియోగం ఉంది. ఈ ఆరోపణల నేపధ్యంలో ట్రంప్‌పై కేసు నమోదు అయ్యింది. పోలీసులు విచారణ జరిపిన తర్వాత ఈ అభియోగం నిజమని కోర్టు తీర్పునిచ్చింది. 

ఇది కూడా చూడండి: తానుపారిపోవాలని అనుకోలేదు.. మొదటిసారి స్పందించిన అసద్

ఇది కూడా చూడండి: ప్రభుత్వ ఉద్యోగులకు రైతు భరోసా.. రేవంత్ సర్కార్ కీలక అప్డేట్!

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు