Trump Out: ఇదేం కుదిరే బేరంలా లేదు..రష్యా, ఉక్రెయిన్ శాంతి ఒప్పంద నుంచి ట్రంప్ ఔట్?

అన్ని చేసేస్తాను...యుద్ధాలు ఆపేస్తాను అంటూ ఎగిరిన ట్రంప్ ఈరోజు నా వల్ల కాదు బాబోయ్ అంటున్నారుట. డాన్ బాస్, నాటో లాంటి వాటిల్లో తగ్గేదే లేదు అని పుతిన్ అంటుంటే...వాటిని ఇచ్చేదే లేదని జెలెన్ స్కీ అనడమే ఇందుకు కారణమని సమాచారం.

New Update
trump

putin, zelensky, Trump

అమెరికా అధ్యక్షుడు ఎన్నికల టైమ్ నుంచీ రష్యా, ఉక్రెయిన్ యుద్ధం ఆపేస్తా..ప్రపంచంలో శాంతి నెలకొల్పుతా అని చెబుతూనే ఉన్నారు ట్రంప్. అధ్యక్షుడిగా ఎన్నిక అవ్వగానే చేసేస్తా అన్నారు. పదవిలోకి వచ్చి తొమ్మిది నెలలు అవుతున్నా  ఆయన ఆశ మాత్రం తీరలేదు. ట్రంప్ ప్రయత్నాలు చేస్తూనే ఉన్నా కానీ...రష్యా అధ్యక్షుడు పుతిన్ ముందు ఆయన ఆటలు ఏమీ సాగడం లేదు. అసలు మొన్న మొన్నటి వరకూ పుతిన్ కలవలేదు, మాట్లాడ్డానికే అవకాశం ఇవ్వలేదు. ఈ వారం మొదట్లో ఎట్టకేలకు ట్రంప్, పుతిన్ ఇద్దరూ కలిశారు. అలస్కా వేదికగా చర్చలు సాగించారు. కానీ యుద్ధం విరమణ వికషయం మాత్రం అలాగే ఉండిపోయింది. అసలు పుతిన్ దాని గురించే మాట్లాడే అవకాశమే ఇవ్వలేదని చెబుతున్నారు. కానీ ట్రంప్ మాత్రం గొప్ప పురోగతి సాధించామని చెప్పారు. తరువాత ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్ స్కీ, యూరోపియన్ నేతలతోనూ సమావేశమయ్యారు. శాంతి ఒప్పందానికి మేము సిద్ధమేనని జెలెన్ స్కీ చెప్పారు.  త్వరలోనే పుతిన్, జెలెన్ స్కీ, తాను కలిసి త్రై పాక్షిక సమావేశం అవుతామని చెప్పారు. అది కూడా రష్యాలో జరుగుతుందని చెప్పారు. 

వాళ్ళ సమావేశం అవనీయండి చూద్దాం..

కానీ రెండు రోజుల తర్వాత ట్రంప్ మాటలు మారిపోయాయి. రష్యా, ఉక్రెయిన్ మధ్య సంధి కుదర్చడం తన వల్ల కాదని అంటున్నారుట. నిన్నటి వరకు త్రైపాక్షిక సమావేశం అంటూ ఎగిరిన ఆయన ఇప్పుడు ముందు వాళ్ళిద్దరూ మాట్లాడుకోనీయండి...తర్వాత నేను మాట్లాడతా అని చెబుతున్నారని తెలుస్తోంది. రష్యా, ఉక్రెయిన్ అధ్యక్షుల మధ్య ద్వైపాక్షిక సమావేశం అయ్యే వరకూ తాను శాంతి ఒప్పందం చర్చల నుంచి వైదొలగాలని నిర్ణయించుకున్నట్టు తెలుస్తోంది.  ద్వైపాక్షిక సమావేశం ఏర్పాటు చేయడానికి కూడా తాను ప్రయత్నం చేనని ట్రంప్ అధికారులు తెలిపారు. ఆ సమావేశంలో ఏం జరుగుతుందో చూద్దాం..

రష్యా కొత్త ఆంక్షలు..

అమెరికా అధ్యక్షుడు ఈ నిర్ణయం తీసుకోవడం వెనుక రష్యా కొత్త ఆంక్షలు పెట్టడమే అంటున్నారు. ఉక్రెయిన్ భద్రతా హామీలపై రష్యాకు వీటో అధికారం ఇవ్వాలని ఆ దేశ విదేశాంగ మంత్రి సెర్గీ లావ్ రోవ్ కొత్త డిమాండ్ ను అమెరికా ముందు ఉంచారు. దాంతో పాటూ ఉక్రెయిన్‌లో దళాలను మోహరించాలనే యూరప్ సూచనను కూడా ఆయన తీవ్రంగా వ్యతిరేకించారు. అది విదేశీ జోక్యం అవుతుందని అన్నారు. యూరోపియన్ మిత్రదేశాలతో కలిసి రష్యా మరియు చైనా ఉక్రెయిన్ భద్రతను చూసుకుంటాయని లావ్రోవ్ చెబుతున్నారు. అలాగే ఇంతకు ముందే చెప్పినట్టు ఉక్రెయిన్ తూర్పు డాన్ బాస్ ప్రాంతాన్ని పూర్తిగా వదులుకోవాలని..నాటోలో చేరాలనే ఉద్దేశం మానుకోవాలని రష్యా అంటోంది. కానీ ఉక్రెయిన్  మాత్రం ఈ ఆంక్షలకు ఒప్పుకోవడం లేదు. ఇద్దరూ ఎక్కడా రాజీ పడేలా కనిపించడం లేదని తెలుస్తోంది. అందుకే అమెరికా అధ్యక్షుడు ట్రంప్..పుతిన్, జెలెన్ స్కీల మధ్య సమావేశం అయ్యే వరకూ కామ్ ఉండాలని డిసైడ్ చేసుకున్నారని చెబుతున్నారు. 

Also Read: India-Russia-China: ట్రంప్ కు దిమ్మ తిరిగే షాక్..కలిసి కొట్టడానికి రెడీ వుతున్న భారత్, రష్యా, చైనా

Advertisment
తాజా కథనాలు