Sabarimala: తెలుగు రాష్ట్రాల నుంచి శబరిమలకు 62 ప్రత్యేక రైళ్లు! తెలుగు రాష్ట్రాల నుంచి శబరిమలకు వెళ్తున్న యాత్రికుల కోసం 62 ప్రత్యేక రైలు సర్వీసులు ఏర్పాటు చేశారు. డిసెంబర్ ఒకటి నుంచి ఈ రైళ్లు..వచ్చే ఏడాది ఫిబ్రవరి 27 వరకూ ఈ రైళ్లను నడపనున్నారు. By Bhavana 26 Nov 2024 in ఆంధ్రప్రదేశ్ వైజాగ్ New Update షేర్ చేయండి Sabarimala : శబరిమల అయ్యప్ప స్వామి దర్శనం కోసం తెలుగు రాష్ట్రాల నుంచి తరలి వెళ్తున్న భక్తుల సంఖ్య విపరీతంగా పెరిగింది. ప్రస్తుతం కార్తీక మాసం కావటంతో ఈ నెలతో పాటు , మకర జ్యోతిదర్శనం కోసం మరింత మంది భక్తులు శబరిమలకు వెళ్లే అవకాశాలు భారీగా కనపడుతున్నాయి. Also Read: వీడెవడండీ బాబు.. ఈ వీడియో చూస్తే పొట్ట చెక్కలైపోవడం ఖాయం ఈ నేపథ్యంలో భక్తులకు అసౌకర్యం కలగకుండా భారతీయ రైల్వే శబరిమలకు ఇప్పటికే ప్రత్యేక రైళ్లు నడుపుతున్న సంగతి తెలిసిందే. ఇక తెలుగు రాష్ట్రాల అయ్యప్ప భక్తుల కోసం దక్షిణ మధ్య రైల్వేమరో 62 ప్రత్యేక రైళ్లు నడపనున్నట్లు సమాచారం. డిసెంబర్ ఒకటో తేదీ నుంచి 2025 ఫిబ్రవరి 27 వరకూ ఈ ప్రత్యేక రైళ్లు నడవనున్నాయి. Also Read: TTDశ్రీవారి భక్తులకు బ్యాడ్ న్యూస్..పదిరోజుల పాటు ఆ దర్శనాలు రద్దు! అందులో భాగంగా దక్షిణ మధ్య రైల్వే విశాఖపట్నం, శ్రీకాకుళం నుంచి కొల్లాంకు 44 ప్రత్యేక రైలు సర్వీసులు నడుపుతున్నట్లు సమాచారం. విశాఖపట్నం - కొల్లాం ప్రత్యేక రైలు నడపనున్నారు.ఈ ప్రత్యేక రైలు డిసెంబర్ 4వ తేదీ నుంచి వచ్చే ఏడాది ఫిబ్రవరి 26 వరకూ అందుబాటులో ఉండనుంది. విశాఖపట్నం- కొల్లాం ప్రత్యేక రైలు డిసెంబర్ నాలుగు నుంచి ప్రతి బుధవారం అందుబాటులో ఉంటుంది. విశాఖపట్నంలో ఉదయం 8.20 గంటలకు బయల్దేరి.. మరుసటి రోజు మధ్యాహ్నం 12.55 గంటలకు కొల్లాం చేరుతుంది. Also Read: Union Cabinet: పాన్ కార్డ్ 2.0కి కేంద్ర కేబినెట్ ఆమోదం.. కొల్లాం నుంచి విశాఖపట్నం తిరిగి బయల్దేరుతుంది. డిసెంబర్ ఐదు నుంచి ఫిబ్రవరి 27 వరకూ ప్రతి గురువారం కొల్లాం- విశాఖపట్నం ప్రత్యేక రైలు అందుబాటులో ఉండనున్నట్లు సమాచారం. ఈ రైలు కొల్లాం నుంచి ప్రతి గురువారం రాత్రి 7.35 గంటలకు బయల్దేరి మరుసటి రోజు రాత్రి 11.20 గంటలకు విశాఖపట్నం రైల్వేస్టేషన్ చేరుతుంది. Also Read: నవంబర్ 26న రాజ్యాంగ దినోత్సవం ఎందుకు జరుపుకుంటామో తెలుసా ? అలాగే శ్రీకాకుళం- కొల్లాం మధ్య 18 ప్రత్యేక రైలు సర్వీసులను సౌత్ సెంట్రల్ రైల్వే నడపనుంది. డిసెంబర్ ఒకటి నుంచి జనవరి 27 వరకూ శ్రీకాకుళం- కొల్లాం ప్రత్యేక రైలు నడపనున్నట్లు సమాచారం. ఈ రైలు ప్రతి సోమవారం ఉదయం 6 గంటలకు శ్రీకాకుళంలో బయల్దేరి మంగళవారం మధ్యాహ్నం 2.30కు కొల్లాం చేరుకుంటుంది. డిసెంబర్ 5 నుంచి 27 వరకు.. మంగళవారం సాయంత్రం నాలుగున్నరకు కొల్లాంలో తిరిగి బయల్దేరనున్న కొల్లాం - శ్రీకాకుళం ప్రత్యేక రైలు బుధవారం తెల్లవారుజామున 2.30 గంటలకు శ్రీకాకుళం వస్తుంది.మరోవైపు కాచిగూడ- కొట్టాయం మధ్యన కూడా అయ్యప్ప భక్తుల కోసం ప్రత్యేక రైళ్లు నడపనున్నారు. డిసెంబర్ 5 నుంచి 27 వరకు ప్రతి గురువారాల్లో ఈ రైళ్లు అందుబాటులో ఉంటాయి. ప్రతి గురువారం కాచిగూడ - కొట్టాయం ప్రత్యేక రైలు నడపనుంది. ఈ రైలు ప్రతి గురువారం మధ్యాహ్నం 3 గంటల 40 నిమిషాలకు కాచిగూడలో బయల్దేరి.. మరుసటి రోజు సాయంత్రం 7గంటలకు కొట్టాయం చేరుతుంది. అనంతరం కొట్టాయం నుంచి శుక్రవారం రాత్రి ఎనిమిదిన్నర గంటలకు బయల్దేరి.. శనివారం రాత్రి 11.40 గంటలకు కాచిగూడ వస్తుంది. హైదరాబాద్ - కొట్టాయం ప్రత్యేక రైలును డిసెంబర్ మూడు నుంచి జనవరి ఒకటో తేదీ వరకూ నడపనున్నారు. ఈ రైలు ప్రతి మంగళవారం మధ్యాహ్నం 12 గంటలకు హైదరాబాద్ నుంచి బయల్దేరి.. బుధవారం సాయంత్రం 4.10 గంటలకు కొట్టాయం చేరుతుంది. కొట్టాయం నుంచి బుధవారం సాయంత్రం 6.10 గంటలకు తిరిగి బయల్దేరి.. గురువారం రాత్రి 11.45 గంటలకు హైదరాబాద్ వస్తుందని దక్షిణ మధ్య రైల్వే అధికారులు ఓ ప్రకటనలో ప్రకటించారు. #andhra-pradesh #telangana #sabarimala #south-central-railway మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి