/rtv/media/media_files/2025/02/01/R5hlEEqsLRiA5ENLJMx7.jpg)
Donald Trump
అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ వస్త్రధారణ చాలాకాలంగా నెట్టింట ట్రోలింగ్ కు గురవుతుంది.తాజాగా ఆయన్ను ట్రోల్ చేసే వారి జాబితాలోకి అధ్యక్షుడు ట్రంప్ కూడా చేరిపోయారు.శ్వేతసౌధంలో ఓ దేశాధినేత ,రిపోర్టర్ల ఎదుటే వాన్స్ ను ఆట పట్టించారు. ఐరిష్ ప్రధాని మైఖెల్ మార్టిన్ బుధవారం వైట్ హౌస్‌ను సందర్శించారు. అనంతరం ఆయన సెయింట్ పాట్రిక్స్ డే వార్షిక సంబరాల్లో పాల్గొన్నారు.
Also Read: Trump: గాజా నుంచి ఎవరినీ బహిష్కరించమంటున్న ట్రంప్!
ఈ సందర్భంగా ట్రంప్ ,వాన్స్ తో ఓవల్ ఆఫీస్ లో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ట్రంప్ ద్రవ్యోల్బణం గురించి మాట్లాడబోతూ..హఠాత్తుగా జేడీ వాన్స్ వేసుకొన్న సాక్స్ వైపు చూస్తూ..ఈ సాక్స్ నాకు నచ్చాయి. ఏంటీ సాక్సులు అని హఠాత్తుగా వాన్స్ ను ట్రోల్ చేశారు. దీంతో అక్కడున్నవాళ్లంతా నవ్వడం మొదలు పెట్టారు.
WATCH: President Trump clowns JD Vance’s socks during Oval Office meeting 😂
— Breaking911 (@Breaking911) March 12, 2025
“What’s with these socks? I’m trying to stay focused…”pic.twitter.com/WZuj87dMEM
నేను ఏకాగ్రతగా ఉందామనుకొంటున్నాను..వాన్స్ సాక్స్ లు నన్ను ఆకర్షించాయి అని వ్యాఖ్యానించారు. వాన్స్ యాక్సెసరీస్ ఎంపికను ట్రంప్ మెచ్చుకొన్నారు. వాన్స్ తెల్లరంగు సాక్సుల పై షామ్రాక్ ఆకుల డిజైన్లు ఉండటం ట్రంప్ ను ఆకర్షించింది. వాస్తవానికి వాన్స్ ధరించే పొట్టి ప్యాంట్ల పై ఇంటర్నెట్ లో చాలాకాలంగా చర్చ జరుగుతోంది. గత నెలకూడా వాన్స్ డ్రెస్సింగ్ విధానం సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది.
ఆయన 1700 ల్లో నాటి ఆంగ్లేయులు ధరించే వస్త్రాలు , స్టాకింగ్స్‌ను ధరిస్తారని నెటిజన్లు అభిప్రాయపడ్డారు. పొడుగు ప్యాంట్లు, పిక్కల పైకి సాక్సులు ధరించాలని సెకండ్ లేడీ సూచించాలని పేర్కొన్నారు. ఇక ట్రంప్ కూడా ద్రవ్యోల్బణం పై చర్చను వాన్స్ సాక్స్ పైకి మళ్లించిన తర్వాత..ఇక ఆ అంశాన్ని మళ్లీ మాట్లాడలేదు. ట్రంప్ కెనడా, మెక్సికో, చైనాతో మొదలు పెట్టిన వాణిజ్యయుద్ధం కారణంగా ద్రవ్యోల్బణం పెరగొచ్చనే భయాలు అమెరికాలో ఉన్నాయి.
దీనికి తోడు ఆర్థిక మాంద్యం కూడా వస్తుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
Also Read:Telangana: తెలంగాణవాసులకు వాతావరణ శాఖ ముఖ్య సమాచారం.. ఇక ఎండ దంచుడే దంచుడు!
Also Read: Telangana:ధరలు తగ్గాయోచ్.. 'తెలంగాణ'లోనే అతి తక్కువ!